1. హోమ్
  2. కూర్పులు
  3. దావహ్ మరియు హసబహ్

హదీస్ “ఓ అల్లాహ్! నా ఉమ్మత్ కు (సమాజానికి) సంబంధించిన ఏ విషయములోనైనా ఎవరికైనా అధికారాన్ని ఇచ్చినట్లయితే, అతడు దాని ద్వారా ప్రజలను కష్టాలకు, కఠిన పరిస్థితులకు గురిచేస్తే, నీవు కూడా అతడిని కాఠిన్యానికి గురి చేయి. మరియు నా ఉమ్మత్ కు సంబంధించిన ఏ విషయములోనైనా ఎవరికైనా అధికారాన్ని ఇచ్చినట్లయితే, అతడు (ప్రజలను కష్టాలపాలు చేయకుండా) ప్రజలతో దయతో, కరుణతో స్నేహపూర్వకంగా ఉన్నట్లయితే, నీవు కూడా అతనిపై కృపతో, దయతో, అనుగ్రహముతో ఉండు”

عن عائشة رضي الله عنها قالت: سمعتُ من رسول الله صلى الله عليه وسلم يقول في بيتي هذا:
«اللَّهُمَّ مَنْ وَلِيَ مِنْ أَمْرِ أُمَّتِي شَيْئًا فَشَقَّ عَلَيْهِمْ فَاشْقُقْ عَلَيْهِ، وَمَنْ وَلِيَ مِنْ أَمْرِ أُمَّتِي شَيْئًا فَرَفَقَ بِهِمْ فَارْفُقْ بِهِ».

ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖనం : “ఇంటిలో ఉన్నపుడు, ఒకరోజు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకగా నేను విన్నాను:
“ఓ అల్లాహ్! నా ఉమ్మత్ కు (సమాజానికి) సంబంధించిన ఏ విషయములోనైనా ఎవరికైనా అధికారాన్ని ఇచ్చినట్లయితే, అతడు దాని ద్వారా ప్రజలను కష్టాలకు, కఠిన పరిస్థితులకు గురిచేస్తే, నీవు కూడా అతడిని కాఠిన్యానికి గురి చేయి. మరియు నా ఉమ్మత్ కు సంబంధించిన ఏ విషయములోనైనా ఎవరికైనా అధికారాన్ని ఇచ్చినట్లయితే, అతడు (ప్రజలను కష్టాలపాలు చేయకుండా) ప్రజలతో దయతో, కరుణతో స్నేహపూర్వకంగా ఉన్నట్లయితే, నీవు కూడా అతనిపై కృపతో, దయతో, అనుగ్రహముతో ఉండు”.

ప్రామాణికమైన హదీథు ముస్లిం నమోదు చేసినారు: సహీహ్ ముస్లిం - 1828

వివరణ

ఈ హదీసులో రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం చేసిన దుఆ అందరికీ వర్తిస్తుంది. ఎవరైతే ముస్లిముల యొక్క వ్యవహారాలలో దేనినైనా నిర్వహించడానికి అధికారము పొందుతారో, అటువంటి వారందరికీ వర్తిస్తుంది. ఆ వ్యవహారము చిన్నదైనా లేక పెద్దదైనా, అది ప్రజలందరికీ సంబంధించిన వ్యవహారమైనా లేక ప్రజలలో కొద్ది మందికి (ఒక సమూహానికి, ఒక తెగకు మొ.) సంబంధించిన వ్యవహారమైనా – అందులో అతడు ప్రజలను కష్టాలకు గురిచేసినట్లయితే లేక వారిని కఠిన పరిస్థితుల పాల్జేసినట్లయితే, వారి పట్ల కనికరం, దయ లేకుండా వ్యవహరించినట్లయితే, (అధికార స్థానం’లో ఉండి) అతడు ప్రజలతో ఏవిధంగానైతే వ్యవహరించాడో అల్లాహ్ అతడికి అదే విధంగా ప్రతిఫలాన్నిస్తాడు.
అలాగే ఇందులో, ఎవరైతే అధికారాన్ని పొందిన తరువాత, తద్వారా ప్రజలకు తగిన విధంగా సేవ చేస్తాడో, వారి వ్యవహారాలను న్యాయబధ్ధంగా పరిష్కరిస్తాడో, చక్కదిద్దుతాడో అల్లాహ్ కూడా అతడి వ్యవహారాలను కూడా అదే విధంగా పరిష్కరిస్తాడు.

من فوائد الحديث

  1. ఎవరైతే ముస్లింల యొక్క వ్యవహారాలలో దేనికైనా అధికారిగా నియమించబడితే, అతడు వారి పట్ల న్యాయపూరితంగా వ్యవహరించాలి, వారి పట్ల, కరుణ, దయ కలిగి ఉండాలి.
  2. అధికారం పొందిన తరువాత వారు దాని ద్వారా ఎలా వ్యవహరిస్తారో, అల్లాహ్ వద్ద వారి ప్రతిఫలం కూడా అదే విధంగా ఉంటుంది.
  3. అధికారం పొందిన తరువాత, ప్రజలతో న్యాయపూరితంగా, కనికరం, దయ, కరుణ కలిగి ఉండుటకు కొలమానం ఏమిటంటే, అది ఖుర్’ఆన్ మరియు సున్నత్ లకు విరుద్ధంగా, భిన్నంగా ఉండరాదు.

అనువాదాలను వీక్షించండి

68 భాష
EN English ఇంగ్లీషు
UR اردو ఉర్దూ
ES Español స్పానిష్
ID Indonesia ఇండోనేషియన్
UG ئۇيغۇرچە ఉయ్ఘర్
BN বাংলা బెంగాలీ
FR Français ఫ్రెంచ్
TR Türkçe టర్కిష్
RU Русский రష్యన్
BS Bosanski బోస్నియన్
SI සිංහල సింహళ
HI हिन्दी హిందీ
ZH 中文 చైనీస్
FA فارسی పర్షియన్
VI Tiếng Việt వియత్నమీస్
TL Tagalog టాగలాగ్
KU Kurdî కుర్దిష్
HA Hausa హౌసా
PT Português పోర్చుగీసు
ML മലയാളം మలయాళం
SW Kiswahili స్వాహిలీ
TA தமிழ் తమిళం
MY မြန်မာ బర్మీస్
TH ไทย థాయ్
DE Deutsch జర్మన్
JA 日本語 జపనీస్
PS پښتو పష్టో
AS অসমীয়া అస్సామీ
SQ Shqip అల్బేనియన్
SV Svenska السويدية
AM አማርኛ الأمهرية
NL Nederlands الهولندية
GU ગુજરાતી الغوجاراتية
KY Кыргызча Қирғизӣ
NE नेपाली النيبالية
YO Yorùbá Юрба
LT Lietuvių الليتوانية
PRS دری الدرية
SR Српски الصربية
SO Soomaali الصومالية
TG тоҷикӣ الطاجيكية
RW Kinyarwanda Кинёрвондӣ
RO Română الرومانية
HU Magyar المجرية
CS Čeština التشيكية
MOS Moore الموري
MG Malagasy Малагашӣ
FF Fulfulde الفولانية
IT Italiano ఇటాలియన్
OM Oromoo Урумӣ
KN ಕನ್ನಡ Канада
WO Wolof الولوف
BG Български البلغارية
AZ Azərbaycan Озарӣ
EL Ελληνικά اليونانية
AK Akan الأكانية
UZ O‘zbek الأوزبكية
UK Українська الأوكرانية
KA ქართული الجورجية
LN Lingala اللينجالا
MK Македонски المقدونية
KM ភាសាខ្មែរ الخميرية
BM Bambara البامبارية
PA ਪੰਜਾਬੀ البنجابية
MR मराठी الماراثية
RN Kirundi الكيروندي
YAO Yao الياو
KMR Kurmancî الكرمنجية