1. హోమ్
  2. కూర్పులు
  3. సద్గుణాలు మరియు పద్దతులు

హదీస్ “నిశ్చయంగా అల్లాహ్ నాకు ఈ విధంగా వహీ చేసినాడు (దివ్యజ్ఞానాన్ని అవతరింపజేసినాడు) – ఎవరూ ఒకరిపై మరొకరు గొప్పలు చెప్పుకోకండి, మరియు ఎవరూ ఒకరిని మరొకరు అణచివేతకు గురిచేయకండి.”

عَنْ عِيَاضِ بْنِ حِمَارٍ أَخِي بَنِي مُجَاشِعٍ رَضيَ اللهُ عنه قَالَ: قَامَ فِينَا رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ ذَاتَ يَوْمٍ خَطِيبًا، فَقَالَ: وَسَاقَ الْحَدِيثَ وَفِيهِ:
«وَإِنَّ اللهَ أَوْحَى إِلَيَّ أَنْ تَوَاضَعُوا حَتَّى لَا يَفْخَرَ أَحَدٌ عَلَى أَحَدٍ، وَلَا يَبْغِي أَحَدٌ عَلَى أَحَدٍ».

బనీ ముజాషీ తెగ సోదరుడైన ఇయాద్ ఇబ్న్ హిమార్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: “ఒకరోజు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం మా మధ్యన ఒక ప్రసంగకర్తగా నిలబడి ఇలా అన్నారు:” ఇయాద్ ఇబ్న్ హిమార్ (రదియల్లాహు అన్హు) ఆ హదీథును వివరించినారు; అందులో ఇలా ఉన్నది:
“నిశ్చయంగా అల్లాహ్ నాకు ఈ విధంగా వహీ చేసినాడు (దివ్యజ్ఞానాన్ని అవతరింపజేసినాడు) – ఎవరూ ఒకరిపై మరొకరు గొప్పలు చెప్పుకోకండి, మరియు ఎవరూ ఒకరిని మరొకరు అణచివేతకు గురిచేయకండి.”

ప్రామాణికమైన హదీథు ముస్లిం నమోదు చేసినారు: సహీహ్ ముస్లిం - 2865

వివరణ

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సహచరులను సంబోధిస్తూ ప్రసంగించినారు – ఆ ప్రసంగములో మిగతా విషయాలతో పాటు వారు ఇలా అన్నారు: నిశ్చయంగా అల్లాహ్ తనపై ఈ విధంగా దివ్యఙ్ఞానాన్ని అవతరింపజేసినాడు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేసినారు: ప్రజలు పరస్పరం వినయంతో మెలగాలి, ఇతరుల కొరకు తమ రెక్కలు వంచి, సౌమ్యంగా ఉండాలి. తద్వారా ఎవరూ తమ వంశపారంపర్యత, సంపద లేదా మరే విషయం ఆధారంగానైనా గొప్పతనం, గర్వం లేదా గౌరవం గురించి గొప్పలు చెప్పుకోరాదు; మరియు ఎవరూ ఎవరినీ అణచివేయరాదు లేదా అతిక్రమించరాదు.

من فوائد الحديث

  1. ఈ హదీథు వినయాన్ని ప్రోత్సహిస్తుంది మరియు ప్రజల పట్ల అహంకారం మరియు గర్వాన్ని కలిగి ఉండడాన్ని నివారిస్తుంది.
  2. ఇది అతిక్రమణ, అణచివేత మరియు అహంభావాన్ని కూడా నిషేధిస్తుంది.
  3. అల్లాహ్ పట్ల వినయం అనే పదానికి రెండు అర్థాలు ఉన్నాయి: మొదటి అర్థం ఏమిటంటే: మీరు అల్లాహ్ యొక్క ధర్మం పట్ల వినయంగా ఉంటారు, దాని పట్ల లేదా దాని నియమాల పట్ల అహంకారంతో ఉండరు. రెండవ అర్థం ఏమిటంటే: మీరు అల్లాహ్ యొక్క దాసుల పట్ల కేవలం అల్లాహ్ కొరకు వినయంగా ఉంటారు, వారి పట్ల భయంతో లేదా వారు కలిగి ఉన్న వాటిపై ఆశతో కాదు, కానీ కేవలం సర్వశక్తిమంతుడైన అల్లాహ్ కోసం మాత్రమే.

అనువాదాలను వీక్షించండి

36 భాష
EN English ఇంగ్లీషు
UR اردو ఉర్దూ
ES Español స్పానిష్
ID Indonesia ఇండోనేషియన్
BN বাংলা బెంగాలీ
TR Türkçe టర్కిష్
RU Русский రష్యన్
BS Bosanski బోస్నియన్
SI සිංහල సింహళ
HI हिन्दी హిందీ
ZH 中文 చైనీస్
FA فارسی పర్షియన్
VI Tiếng Việt వియత్నమీస్
TL Tagalog టాగలాగ్
KU Kurdî కుర్దిష్
HA Hausa హౌసా
PT Português పోర్చుగీసు
ML മലയാളം మలయాళం
SW Kiswahili స్వాహిలీ
MY မြန်မာ బర్మీస్
TH ไทย థాయ్
PS پښتو పష్టో
AS অসমীয়া అస్సామీ
AM አማርኛ الأمهرية
NL Nederlands الهولندية
GU ગુજરાતી الغوجاراتية
PRS دری الدرية
SR Српски الصربية
RO Română الرومانية
HU Magyar المجرية
KN ಕನ್ನಡ Канада
KA ქართული الجورجية
MK Македонски المقدونية
KM ភាសាខ្មែរ الخميرية
PA ਪੰਜਾਬੀ البنجابية
MR मराठी الماراثية