1. హోమ్
  2. కూర్పులు
  3. ఫిఖ్ మరియు దాని నియమాలు

హదీస్ “నిత్యమూ అనుసరించదగిన కొన్ని విషయాలున్నాయి - ప్రతి ఫర్జ్ సలాహ్ (ఫర్జ్ నమాజు) తరువాత వాటిని ఉచ్ఛరించే వానిని, లేదా వాటిని ఆచరించే వానిని అవి ఎప్పుడూ నిరాశపరచవు. అవి: ముప్పై మూడు సార్లు ‘తస్’బీహ్’ పలుకుట (సుబ్’హానల్లాహ్ అని పలుకుట); ముప్పై మూడు సార్లు ‘తమ్’హీద్’ పలుకుట (అల్’హందులిల్లాహ్ అని పలుకుట); మరియు ముప్పై నాలుగు సార్లు ‘తక్బీర్’ పలుకుట (అల్లాహు అక్బర్ అని పలుకుట).”

عَنْ كَعْبِ بْنِ عُجْرَةَ رضي الله عنه عَنْ رَسُولِ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«مُعَقِّبَاتٌ لَا يَخِيبُ قَائِلُهُنَّ -أَوْ فَاعِلُهُنَّ- دُبُرَ كُلِّ صَلَاةٍ مَكْتُوبَةٍ، ثَلَاثٌ وَثَلَاثُونَ تَسْبِيحَةً، وَثَلَاثٌ وَثَلَاثُونَ تَحْمِيدَةً، وَأَرْبَعٌ وَثَلَاثُونَ تَكْبِيرَةً».

కాబ్ బిన్ ఉజ్రహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు :
“నిత్యమూ అనుసరించదగిన కొన్ని విషయాలున్నాయి - ప్రతి ఫర్జ్ సలాహ్ (ఫర్జ్ నమాజు) తరువాత వాటిని ఉచ్ఛరించే వానిని, లేదా వాటిని ఆచరించే వానిని అవి ఎప్పుడూ నిరాశపరచవు. అవి: ముప్పై మూడు సార్లు ‘తస్’బీహ్’ పలుకుట (సుబ్’హానల్లాహ్ అని పలుకుట); ముప్పై మూడు సార్లు ‘తమ్’హీద్’ పలుకుట (అల్’హందులిల్లాహ్ అని పలుకుట); మరియు ముప్పై నాలుగు సార్లు ‘తక్బీర్’ పలుకుట (అల్లాహు అక్బర్ అని పలుకుట).”

ప్రామాణికమైన హదీథు ముస్లిం నమోదు చేసినారు: సహీహ్ ముస్లిం - 596

వివరణ

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్’ను స్మరించడానికి పలుకవలసిన కొన్ని పదాలను గురించి తెలియజేసారు. వాటిని ఉచ్ఛరించే వాడు ఏమీ కోల్పోడు, మరియు దేనికీ చింతించడు; పైగా వాటిని ఉచ్ఛరించినందుకు అతడు ప్రతిఫలాన్ని పొందుతాడు. వాటిలో కొన్ని విషయాల తరువాత కొన్ని వస్తాయి. ప్రతి ఫర్జ్ సలాహ్ (ఫర్జ్ నమాజు) తరువాత ఉచ్చరించబడతాయి. అవి:
“సుబ్’హానల్లాహ్” అని ముప్పైమూడు సార్లు పలకాలి. (దాని అర్థము: అల్లాహ్ పరమ పవిత్రుడు, లోపములకు, కొరతలకు అతీతుడు)
“అల్’హదులిల్లాహ్” అని ముప్పైమూడు సార్లు పలకాలి. (దాని అర్థము: సకల స్తోత్రములు, పొగడ్తలు కేవలం అల్లాహ్ కొరకే అని, అంటే ఇందులో అల్లాహ్‌ను పూర్తి పరిపూర్ణతతో వర్ణించడంతో పాటు ఆయనను ప్రేమించడం మరియు కీర్తించడం అన్నీ కలిసి ఉంటాయి)
“అల్లాహు అక్బర్” అని ముప్పైనాలుగు సార్లు పలకాలి. (దాని అర్థము: అల్లాహ్ అందరి కంటే, అన్నిటి కంటే గొప్పవాడు, మహోన్నతుడు, మరియు అన్నింటికన్నా శక్తివంతమైనవాడు)

من فوائد الحديث

  1. ఈ హదీసులో తస్బీహ్ (‘సుబ్’హానల్లాహ్’ - అల్లాహ్‌ను మహిమపరచడం), తహ్మీద్ (‘అల్’హందులిల్లాహ్’ - అల్లాహ్‌ను స్తుతించడం), మరియు తక్బీర్ (‘అల్లాహు అక్బర్’ - అల్లాహ్ యొక్క గొప్పతనాన్ని ప్రకటించడం) – ఈ స్తుతి పదాల యొక్క యోగ్యత, ఘనత తెలుస్తున్నాయి; అవి శాశ్వతత్వం కలిగిన సదాచరణలు.

అనువాదాలను వీక్షించండి

57 భాష
EN English ఇంగ్లీషు
UR اردو ఉర్దూ
ES Español స్పానిష్
ID Indonesia ఇండోనేషియన్
UG ئۇيغۇرچە ఉయ్ఘర్
BN বাংলা బెంగాలీ
TR Türkçe టర్కిష్
RU Русский రష్యన్
BS Bosanski బోస్నియన్
SI සිංහල సింహళ
HI हिन्दी హిందీ
ZH 中文 చైనీస్
FA فارسی పర్షియన్
VI Tiếng Việt వియత్నమీస్
TL Tagalog టాగలాగ్
KU Kurdî కుర్దిష్
HA Hausa హౌసా
PT Português పోర్చుగీసు
ML മലയാളം మలయాళం
SW Kiswahili స్వాహిలీ
MY မြန်မာ బర్మీస్
TH ไทย థాయ్
DE Deutsch జర్మన్
PS پښتو పష్టో
AS অসমীয়া అస్సామీ
SQ Shqip అల్బేనియన్
SV Svenska السويدية
AM አማርኛ الأمهرية
NL Nederlands الهولندية
GU ગુજરાતી الغوجاراتية
KY Кыргызча Қирғизӣ
NE नेपाली النيبالية
YO Yorùbá Юрба
LT Lietuvių الليتوانية
PRS دری الدرية
SR Српски الصربية
SO Soomaali الصومالية
TG тоҷикӣ الطاجيكية
RW Kinyarwanda Кинёрвондӣ
RO Română الرومانية
HU Magyar المجرية
CS Čeština التشيكية
MOS Moore الموري
MG Malagasy Малагашӣ
IT Italiano ఇటాలియన్
OM Oromoo Урумӣ
KN ಕನ್ನಡ Канада
WO Wolof الولوف
AZ Azərbaycan Озарӣ
UZ O‘zbek الأوزبكية
UK Українська الأوكرانية
KA ქართული الجورجية
MK Македонски المقدونية
KM ភាសាខ្មែរ الخميرية
PA ਪੰਜਾਬੀ البنجابية
MR मराठी الماراثية
KMR Kurmancî الكرمنجية