1. హోమ్
  2. కూర్పులు
  3. సద్గుణాలు మరియు పద్దతులు

హదీస్ అల్లాహ్ వద్ద అన్నింటి కన్నా ఉత్తమమమైన ఆచరణ ఏది?” అని. ఆయన ఇలా అన్నారు: “(ప్రతి) నమాజును దాని నిర్ధారిత సమయంలో ఆచరించుట”; నేను “దాని తరువాత ఏది?” అని ప్రశ్నించాను. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం “తల్లిదండ్రుల పట్ల విధేయత కలిగి ఉండుట” అన్నారు; నేను “దాని తరువాత ఏది?” అని ప్రశ్నించాను. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం “అల్లాహ్ మార్గములో జిహాదు చేయుట (పోరాడుట, శ్రమించుట) అని జవాబిచ్చారు

عَنْ عَبْدِ اللَّهِ بِن مَسْعُودٍ رضي الله عنه قَالَ:
سَأَلْتُ النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ: أَيُّ العَمَلِ أَحَبُّ إِلَى اللَّهِ؟ قَالَ: «الصَّلاَةُ عَلَى وَقْتِهَا»، قَالَ: ثُمَّ أَيٌّ؟ قَالَ: «ثُمَّ بِرُّ الوَالِدَيْنِ» قَالَ: ثُمَّ أَيٌّ؟ قَالَ: «الجِهَادُ فِي سَبِيلِ اللَّهِ» قَالَ: حَدَّثَنِي بِهِنَّ، وَلَوِ اسْتَزَدْتُهُ لَزَادَنِي.

అబ్దుల్లాహ్ ఇబ్న్ మస్'ఊద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం :
“నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను ఇలా ప్రశ్నించాను: “అల్లాహ్ వద్ద అన్నింటి కన్నా ఉత్తమమమైన ఆచరణ ఏది?” అని. ఆయన ఇలా అన్నారు: “(ప్రతి) నమాజును దాని నిర్ధారిత సమయంలో ఆచరించుట”; నేను “దాని తరువాత ఏది?” అని ప్రశ్నించాను. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం “తల్లిదండ్రుల పట్ల విధేయత కలిగి ఉండుట” అన్నారు; నేను “దాని తరువాత ఏది?” అని ప్రశ్నించాను. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం “అల్లాహ్ మార్గములో జిహాదు చేయుట (పోరాడుట, శ్రమించుట) అని జవాబిచ్చారు". ఇబ్న్ మస్'ఊద్ రజియల్లాహు అన్హు ఇంకా ఇలా అన్నారు: "ఇవి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నాకు తెలిపిన విషయాలు. ఒకవేళ నేను ఇంకా ప్రశ్నించి ఉంటే ఇంకా చెప్పి ఉండేవారు.”

ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు సహీహ్ అల్ బుఖారీ - 527

వివరణ

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను ప్రశ్నించడం జరిగింది “అల్లాహ్ వద్ద అన్నింటికన్నా ఉత్తమమైన ఆచరణ ఏది?” అని. ఆయన “విధిగా ఆచరించవలసిన ప్రతి ఫర్ద్ నమాజును, షరియత్ ప్రదాత (అయిన అల్లాహ్) దాని కొరకు నిర్ధారించిన సమయములోనే ఆచరించుట” అన్నారు. దాని తరువాత తల్లిదండ్రుల పట్ల కరుణ కలిగి ఉండడం, వారి పట్ల విధేయత కలిగి ఉండడం, వారి హక్కులను నెరవేర్చడం, వారికి అవిధేయత చూపడం నుండి దూరంగా ఉండడం (అన్నారు); దాని తరువాత - తన సంపదతో, తన ప్రాణముతో అల్లాహ్ యొక్క వాక్కును ఉన్నతం చేయుట కొరకు, ఇస్లాం ధర్మాన్ని మరియు దాని ప్రజలను రక్షించడానికి, మరియు ఇస్లాం ధర్మపు ఆచారాలను రక్షించడానికి - అల్లాహ్ కొరకు జిహాదు చేయుట – అన్నారు.
ఇబ్న్ మస్’ఊద్ రజియల్లాహు అన్హు ఇలా అన్నారు: "ఇవి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నాకు తెలిపిన విషయాలు. ఒకవేళ నేను “దాని తరువాత ఏది?” అని ప్రశ్నించి ఉంటే, ఆయన ఇంకా ఎక్కువ (విషయాలు) చెప్పి ఉండేవారు.”

من فوائد الحديث

  1. ఆచరణల యొక్క ఘనత అల్లాహ్ వాటిని ఇష్టపడే క్రమాన్ని బట్టి ఉంటుంది.
  2. ఇందులో – ఘనత కలిగిన విషయాలలో ఎక్కువ ఘనత కలిగిన వాటిని ఆచరించుటపై ప్రతి ముస్లిం ఎక్కువ ఆసక్తి చూపాలి అనే హితబోధ ఉన్నది.
  3. ఉత్తమ ఆచరణలను గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమాధానాలు – వ్యక్తికీ-వ్యక్తికి మధ్య ఉండే శక్తి సామర్థ్యాల తేడాపై, వాటిని గురించి ప్రశ్నించిన వారి స్థితిగతులపై, మరియు వారి కొరకు ఏది ఎక్కువ ప్రయోజనకరమైనది అనే దానిపై ఆధారపడి ఉంటుంది అని అర్థం చేసుకోవాలి.

అనువాదాలను వీక్షించండి

59 భాష
EN English ఇంగ్లీషు
UR اردو ఉర్దూ
ES Español స్పానిష్
ID Indonesia ఇండోనేషియన్
UG ئۇيغۇرچە ఉయ్ఘర్
BN বাংলা బెంగాలీ
FR Français ఫ్రెంచ్
TR Türkçe టర్కిష్
RU Русский రష్యన్
BS Bosanski బోస్నియన్
SI සිංහල సింహళ
HI हिन्दी హిందీ
ZH 中文 చైనీస్
FA فارسی పర్షియన్
VI Tiếng Việt వియత్నమీస్
TL Tagalog టాగలాగ్
KU Kurdî కుర్దిష్
HA Hausa హౌసా
PT Português పోర్చుగీసు
ML മലയാളം మలయాళం
SW Kiswahili స్వాహిలీ
TA தமிழ் తమిళం
MY မြန်မာ బర్మీస్
TH ไทย థాయ్
DE Deutsch జర్మన్
PS پښتو పష్టో
AS অসমীয়া అస్సామీ
SQ Shqip అల్బేనియన్
SV Svenska السويدية
AM አማርኛ الأمهرية
NL Nederlands الهولندية
GU ગુજરાતી الغوجاراتية
KY Кыргызча Қирғизӣ
NE नेपाली النيبالية
YO Yorùbá Юрба
LT Lietuvių الليتوانية
PRS دری الدرية
SR Српски الصربية
SO Soomaali الصومالية
TG тоҷикӣ الطاجيكية
RW Kinyarwanda Кинёрвондӣ
RO Română الرومانية
HU Magyar المجرية
CS Čeština التشيكية
MOS Moore الموري
MG Malagasy Малагашӣ
OM Oromoo Урумӣ
KN ಕನ್ನಡ Канада
WO Wolof الولوف
AZ Azərbaycan Озарӣ
UZ O‘zbek الأوزبكية
UK Українська الأوكرانية
KA ქართული الجورجية
MK Македонски المقدونية
KM ភាសាខ្មែរ الخميرية
BM Bambara البامبارية
PA ਪੰਜਾਬੀ البنجابية
MR मराठी الماراثية
KMR Kurmancî الكرمنجية