1. హోమ్
  2. కూర్పులు
  3. సద్గుణాలు మరియు పద్దతులు

హదీస్ “ఒక ముస్లిమునకు తోటి ముస్లిముపై ఐదు హక్కులు ఉన్నాయి: సలామునకు జవాబిచ్చుట, వ్యాధిగ్రస్తుని పరామర్శించుట, మృతులను శ్మశానమునకు కొనిపోవునపుడు, స్మశానము వరకు అనుసరించుట, ఎవరైనా ఆహ్వానించినట్లయితే వారి ఆహ్వానాన్ని మన్నించుట మరియు ఎవరైనా తుమ్మి నపుడు (అతడు అల్-హందులిల్లాహ్ అని పలికినట్లయితే) అతడికి ‘యర్హకుముల్లాహ్’ అని సమాధానమిచ్చుట”

عن أبي هريرة رضي الله عنه قال: سمعت رسول الله صلى الله عليه وسلم يقول:
«حَقُّ الْمُسْلِمِ عَلَى الْمُسْلِمِ خَمْسٌ: رَدُّ السَّلَامِ، وَعِيَادَةُ الْمَرِيضِ، وَاتِّبَاعُ الْجَنَائِزِ، وَإِجَابَةُ الدَّعْوَةِ، وَتَشْمِيتُ الْعَاطِسِ».

అబీ హురైరాహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అంటూ ఉండగా నేను విన్నాను:
“ఒక ముస్లిమునకు తోటి ముస్లిముపై ఐదు హక్కులు ఉన్నాయి: సలామునకు జవాబిచ్చుట, వ్యాధిగ్రస్తుని పరామర్శించుట, మృతులను శ్మశానమునకు కొనిపోవునపుడు, స్మశానము వరకు అనుసరించుట, ఎవరైనా ఆహ్వానించినట్లయితే వారి ఆహ్వానాన్ని మన్నించుట మరియు ఎవరైనా తుమ్మి నపుడు (అతడు అల్-హందులిల్లాహ్ అని పలికినట్లయితే) అతడికి ‘యర్హకుముల్లాహ్’ అని సమాధానమిచ్చుట”.

ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు సహీహ్ అల్ బుఖారీ - 1240

వివరణ

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక ముస్లిమునకు తన తోటి సోదర ముస్లింపై కొన్ని హక్కులు ఉన్నాయని వివరిస్తున్నారు. ఆ హక్కులలో మొదటిది, మీపై శాంతి కురియాలని మీకు సలాముతో అభివాదం చేసిన వ్యక్తికి మీరు జవాబిచ్చుట.
రెండవ హక్కు: వ్యాధిగ్రస్తుడై ఉన్న ముస్లిం సోదరుని చూచేందుకు అతని వద్దకు వెళ్ళుట మరియు అతడిని పరామర్శించుట.
మూడవ హక్కు: ఎవరైనా ముస్లిం సోదరుడు చనిపోతే, అతడి జనాజాను (శవయాత్ర)ను అతని ఇంటి నుండి, జనాజా నమాజు కొరకు మస్జిదు వరకు, నమాజు తరువాత అతడిని ఖననం చేయుట కొరకు స్మశానము వరకు అనుసరించుట.
నాలుగవ హక్కు: ఎవరైనా విందు భోజనానికి ఆహ్వానిస్తే - ఉదాహరణకు, వలిమా విందు లేదా అటువంటి ఇతర విందులు – ఆ ఆహ్వానాన్ని స్వీకరించుట.
ఐదవ హక్కు: తుమ్మిన వ్యక్తికి జవాబిచ్చుట; ఒకవేళ తుమ్మిన వ్యక్తి (అల్ హందులిల్లాహ్ అని) అల్లాహ్ కు స్తోత్రములు పలికినట్లయితే, అతడికి “అల్లాహ్ నిన్ను కరుణించుగాక” (యర్హముకల్లాహ్) అని జవాబు ఇవ్వాలి, అపుడు తుమ్మిన వ్యక్తి “అల్లాహ్ మీకు మార్గదర్శకత్వం చేయుగాక మరియు మీ వ్యవహారములను చక్కదిద్దుగాక” (యహ్’దీకుముల్లాహు, వ యుస్లిహు బాలకుం) అని పలకాలి.

من فوائد الحديث

  1. ముస్లిముల మధ్య హక్కులను స్థిరపరచడం మరియు వారి మధ్య సహోదరత్వాన్ని, ప్రేమను పటిష్ఠ పరచడం వంటి విషయాలలో ఇస్లాం యొక్క ఔన్నత్యం ప్రస్ఫుటమవుతున్నది.

అనువాదాలను వీక్షించండి

69 భాష
EN English ఇంగ్లీషు
UR اردو ఉర్దూ
ES Español స్పానిష్
ID Indonesia ఇండోనేషియన్
UG ئۇيغۇرچە ఉయ్ఘర్
BN বাংলা బెంగాలీ
FR Français ఫ్రెంచ్
TR Türkçe టర్కిష్
RU Русский రష్యన్
BS Bosanski బోస్నియన్
SI සිංහල సింహళ
HI हिन्दी హిందీ
ZH 中文 చైనీస్
FA فارسی పర్షియన్
VI Tiếng Việt వియత్నమీస్
TL Tagalog టాగలాగ్
KU Kurdî కుర్దిష్
HA Hausa హౌసా
PT Português పోర్చుగీసు
ML മലയാളം మలయాళం
SW Kiswahili స్వాహిలీ
TA தமிழ் తమిళం
MY မြန်မာ బర్మీస్
TH ไทย థాయ్
DE Deutsch జర్మన్
JA 日本語 జపనీస్
PS پښتو పష్టో
AS অসমীয়া అస్సామీ
SQ Shqip అల్బేనియన్
SV Svenska السويدية
AM አማርኛ الأمهرية
NL Nederlands الهولندية
GU ગુજરાતી الغوجاراتية
KY Кыргызча Қирғизӣ
NE नेपाली النيبالية
YO Yorùbá Юрба
LT Lietuvių الليتوانية
PRS دری الدرية
SR Српски الصربية
SO Soomaali الصومالية
TG тоҷикӣ الطاجيكية
RW Kinyarwanda Кинёрвондӣ
RO Română الرومانية
HU Magyar المجرية
CS Čeština التشيكية
MOS Moore الموري
MG Malagasy Малагашӣ
FF Fulfulde الفولانية
IT Italiano ఇటాలియన్
OM Oromoo Урумӣ
KN ಕನ್ನಡ Канада
WO Wolof الولوف
BG Български البلغارية
AZ Azərbaycan Озарӣ
EL Ελληνικά اليونانية
AK Akan الأكانية
UZ O‘zbek الأوزبكية
UK Українська الأوكرانية
KA ქართული الجورجية
LN Lingala اللينجالا
MK Македонски المقدونية
KM ភាសាខ្មែរ الخميرية
BM Bambara البامبارية
PA ਪੰਜਾਬੀ البنجابية
MR मराठी الماراثية
DA Dansk الدنماركية
RN Kirundi الكيروندي
KMR Kurmancî الكرمنجية
MS Bahasa Melayu الملايو