عَنْ عِكْرِمَةَ:
أَنَّ عَلِيًّا رَضِيَ اللَّهُ عَنْهُ حَرَّقَ قَوْمًا، فَبَلَغَ ابْنَ عَبَّاسٍ فَقَالَ: لَوْ كُنْتُ أَنَا لَمْ أُحَرِّقْهُمْ لِأَنَّ النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: «لاَ تُعَذِّبُوا بِعَذَابِ اللَّهِ»، وَلَقَتَلْتُهُمْ كَمَا قَالَ النَّبِيُّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ: «مَنْ بَدَّلَ دِينَهُ فَاقْتُلُوهُ».

ఇక్రమ ఉల్లేఖన:
అలీ రదియల్లాహు అన్హు కొంతమందిని కాల్చేశారు. అబ్దుల్లాహ్ ఇబ్న్ అబ్బాస్ రదియల్లాహు అన్హుమాకు ఈ విషయం తెలిసినప్పుడు ఇలా తెలిపారు: 'ఒకవేళ నేను ఉంటే అలా కాల్చేసేవాడిని కాదు’ ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించారు: మీరు అల్లాహ్ పెట్టె శిక్షతో ప్రజలను శిక్షించకండి నేను కేవలం వారిని హతమార్చేవాడిని ’ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా తెలిపారు: ఎవరైతే తన సత్యధర్మాన్ని విడిచి పెడతాడో అతడిని మరణశిక్ష విధించండి.’

ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ నమోదు చేసినారు: సహీహ్ అల్ బుఖారీ - 3017

వివరణ

అలీ బిన్ అబూతాలిబ్ రదియల్లాహు అన్హు తన ధార్మిక విచక్షణతో, ఇస్లాం నుండి ధర్మభ్రష్టులైన కొంతమంది పాషండులను అగ్నితో కాల్చేశారు. ఈ విషయం అబ్దుల్లా బిన్ అబ్బాస్ రదియల్లాహు అన్హుమాకు చేరగా, ఆయన వారిని హతమార్చిన చర్యను సమర్థించారు; అయితే వారిని అగ్నితో కాల్చడాన్ని వ్యతిరేకించారు. ఆయన ఇలా అన్నారు: ఒకవేళ నేను అతని స్థానంలో ఉంటే వారిని అగ్నితో కాల్చేవాడిని కాదు; ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా స్పష్టం చేశారు - అగ్నితో శిక్షించడం అగ్నికి ప్రభువైన అల్లాహ్ కు మాత్రమే శోభిస్తుంది. అయితే, వారిని కేవలం హతమార్చడమే సరిపోతుంది, ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారు: ‘ఎవరైతే ఇస్లాం నుండి ధర్మభ్రష్టుడై తన ధర్మాన్ని వేరొక ధర్మానికి మార్చుకుంటాడో, అతడికి మీరు మరణశిక్ష విధించండి’.

من فوائد الحديث

  1. ధర్మపండితుల ఏకాభిప్రాయం ప్రకారం ఇస్లాం విడిచి పెట్టిన ధర్మభష్టుడికి మరణశిక్ష విధించడం తప్పనిసరి, అయితే ఇది దాని షరతులకు లోబడి ఉంటుంది. మరియు దీనిపై కేవలం ఇమామ్ మరియు పాలకుడు మాత్రమే అమలు చేస్తారు.
  2. ఆయన ప్రవచనం: "తన ధర్మాన్ని విడిచి, మార్గభ్రష్టుడైన వాడికి మరణశిక్ష విధించండి." అనగా: ఇస్లాం నుండి బయటకు వెళ్ళిపోయిన వారు, ఇది పురుషులకు మరియు స్త్రీలకు ఇద్దరికీ వర్తించే ఒక సాధారణ ఆదేశం.
  3. మతభ్రష్టుడిని (ముర్తద్) అతని మతభ్రష్టత్వంపై వదిలివేయరు. బదులుగా అతడిని ఇస్లాం వైపునకు ఆహ్వానించాలి. ఒకవేళ అతను అంగీకరించకపోతే, పరిపాలకుడు అతడికి మరణశిక్ష విధించాలి.
  4. ఈ హదీథులో అగ్నిశిక్ష విధించకూడదని, మరియు హద్దు శిక్షలు అగ్నితో అమలు చేయబడవని చెప్పబడింది.
  5. ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు అన్హుమా యొక్క ఘనత, మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ యొక్క హదీథుల పట్ల ఆయనకున్న విస్తారమైన జ్ఞానం మరియు ధర్మశాస్త్ర పాండిత్యం ఇందులో తెలుస్తున్నది.
  6. విభేదించేవారిని ఖండించే శిష్టాచారం అని తెలుస్తున్నది.

అనువాదాలను వీక్షించండి

31 భాష
EN English ఇంగ్లీషు
UR اردو ఉర్దూ
ID Indonesia ఇండోనేషియన్
BN বাংলা బెంగాలీ
TR Türkçe టర్కిష్
RU Русский రష్యన్
BS Bosanski బోస్నియన్
SI සිංහල సింహళ
HI हिन्दी హిందీ
ZH 中文 చైనీస్
FA فارسی పర్షియన్
VI Tiếng Việt వియత్నమీస్
TL Tagalog టాగలాగ్
KU Kurdî కుర్దిష్
HA Hausa హౌసా
PT Português పోర్చుగీసు
ML മലയാളം మలయాళం
SW Kiswahili స్వాహిలీ
TH ไทย థాయ్
AS অসমীয়া అస్సామీ
NL Nederlands الهولندية
GU ગુજરાતી الغوجاراتية
PRS دری الدرية
SR Српски الصربية
HU Magyar المجرية
KN ಕನ್ನಡ Канада
KA ქართული الجورجية
MK Македонски المقدونية
KM ភាសាខ្មែរ الخميرية
PA ਪੰਜਾਬੀ البنجابية
MR मराठी الماراثية