1. హోమ్
  2. కూర్పులు
  3. ఫిఖ్ మరియు దాని నియమాలు

హదీస్ “ఏ ముస్లిం వ్యక్తి అయినా, సలాహ్ (నమాజు) సమయం ఆసన్నమైనపుడు పరిపూర్ణంగా ఉదూ ఆచరించి, అణకువ, వినయం కలిగి, సలాహ్’లో రుకూ (మొదలైన వాటిని) పరిపూర్ణంగా ఆచరిస్తాడో, అది అతని వల్ల అంతకు ముందు వరకు జరిగిన ‘సగాయిర్’ పాపాలకు (చిన్న పాపాలకు) పరిహారంగా మారుతుంది; అతడు ‘కబాయిర్’ పాపాలకు (పెద్ద పాపాలకు) పాల్బడనంత వరకు; మరియు ఇది అన్ని కాలాలకు వర్తిస్తుంది.”

عَنْ عُثْمَانَ رضي الله عنه قَالَ: سَمِعْتُ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ يَقُولُ:
«مَا مِنَ امْرِئٍ مُسْلِمٍ تَحْضُرُهُ صَلَاةٌ مَكْتُوبَةٌ فَيُحْسِنُ وُضُوءَهَا وَخُشُوعَهَا وَرُكُوعَهَا، إِلَّا كَانَتْ كَفَّارَةً لِمَا قَبْلَهَا مِنَ الذُّنُوبِ، مَا لَمْ يُؤْتِ كَبِيرَةً، وَذَلِكَ الدَّهْرَ كُلَّهُ».

ఉస్మాన్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకగా నేను విన్నాను:
“ఏ ముస్లిం వ్యక్తి అయినా, సలాహ్ (నమాజు) సమయం ఆసన్నమైనపుడు పరిపూర్ణంగా ఉదూ ఆచరించి, అణకువ, వినయం కలిగి, సలాహ్’లో రుకూ (మొదలైన వాటిని) పరిపూర్ణంగా ఆచరిస్తాడో, అది అతని వల్ల అంతకు ముందు వరకు జరిగిన ‘సగాయిర్’ పాపాలకు (చిన్న పాపాలకు) పరిహారంగా మారుతుంది; అతడు ‘కబాయిర్’ పాపాలకు (పెద్ద పాపాలకు) పాల్బడనంత వరకు; మరియు ఇది అన్ని కాలాలకు వర్తిస్తుంది.”

ప్రామాణికమైన హదీథు ముస్లిం నమోదు చేసినారు: సహీహ్ ముస్లిం - 228

వివరణ

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా వివరించారు. ఏ ముస్లిమ్ అయినా కూడా ఫర్జ్ నమాజు చేసే సమయం ప్రవేశించినపుడు, ఉత్తమంగా ఉదూ ఆచరించి దానిని పరిపూర్ణం చేస్తాడు; తరువాత తన హృదయాన్నీ, తన దేహాన్నీ అల్లాహ్ వైపునము మరల్చి, అణకువ, వినయం కలిగి తనను తాను పూర్తిగా సమర్పించుకున్న రీతిలో అల్లాహ్ యొక్క ఘనతను, ఆయన ఔన్నత్యాన్ని కొనియాడుతూ, రుకూ మరియు సజ్దాలను పరిపూర్ణంగా ఆచరిస్తూ సలాహ్ ను (నమాజును) ఆచరిస్తాడు, అది అంతకు ముందు వరకు అతని వల్ల జరిగిన చిన్న పాపాలకు పరిహారంగా పరిణమిస్తుంది; అతడు పెద్ద పాపాలకు పాల్బడనంత వరకు. ఈ ఘనత కాలానుగతంగా ప్రతి సలాహ్ కు వర్తిస్తుంది.

من فوائد الحديث

  1. పాపాలకు పరిహారంగా పరిణమించే నమాజు (సలాహ్) ఏదంటే – దాసుడు ఉత్తమంగా వుదూ ఆచరించి, వినయము, అనకువలతో, గర్వము లేకుండా, కేవలం అల్లాహ్ యొక్క ప్రసన్నత కొరకు మాత్రమే ఆచరించబడే నమాజు.
  2. ఆరాధనలో నిలకడ కలిగి ఉండటం యొక్క ఘనతను, పుణ్యమును ఇందులో చూడవచ్చు, మరియు అది చిన్న పాపాలు క్షమించబడటానికి కారణం అవుతుంది.
  3. వుజూ ను ఉత్తమంగా ఆచరించడం, మరియు సలాహ్’ను వినయము, అణకువ కలిగి ఆచరించడం యొక్క ఘనత తెలుస్తున్నది.
  4. మన ద్వారా జరిగే చిన్న పాపాలు తుడిచివేయబడడానికి పెద్ద పాపాలకు దూరంగా ఉండడం యొక్క ప్రాధాన్యత తెలుస్తున్నది.
  5. పెద్ద పాపాలు ప్రాయశ్చిత్తముతో తప్ప పరిహరించబడవు.

అనువాదాలను వీక్షించండి

57 భాష
EN English ఇంగ్లీషు
UR اردو ఉర్దూ
ES Español స్పానిష్
ID Indonesia ఇండోనేషియన్
UG ئۇيغۇرچە ఉయ్ఘర్
BN বাংলা బెంగాలీ
TR Türkçe టర్కిష్
RU Русский రష్యన్
BS Bosanski బోస్నియన్
SI සිංහල సింహళ
HI हिन्दी హిందీ
ZH 中文 చైనీస్
FA فارسی పర్షియన్
VI Tiếng Việt వియత్నమీస్
TL Tagalog టాగలాగ్
KU Kurdî కుర్దిష్
HA Hausa హౌసా
PT Português పోర్చుగీసు
ML മലയാളം మలయాళం
SW Kiswahili స్వాహిలీ
MY မြန်မာ బర్మీస్
TH ไทย థాయ్
DE Deutsch జర్మన్
PS پښتو పష్టో
AS অসমীয়া అస్సామీ
SQ Shqip అల్బేనియన్
SV Svenska السويدية
AM አማርኛ الأمهرية
NL Nederlands الهولندية
GU ગુજરાતી الغوجاراتية
KY Кыргызча Қирғизӣ
NE नेपाली النيبالية
YO Yorùbá Юрба
LT Lietuvių الليتوانية
PRS دری الدرية
SR Српски الصربية
SO Soomaali الصومالية
TG тоҷикӣ الطاجيكية
RW Kinyarwanda Кинёрвондӣ
RO Română الرومانية
HU Magyar المجرية
CS Čeština التشيكية
MOS Moore الموري
MG Malagasy Малагашӣ
IT Italiano ఇటాలియన్
OM Oromoo Урумӣ
KN ಕನ್ನಡ Канада
WO Wolof الولوف
AZ Azərbaycan Озарӣ
UZ O‘zbek الأوزبكية
UK Українська الأوكرانية
KA ქართული الجورجية
MK Македонски المقدونية
KM ភាសាខ្មែរ الخميرية
PA ਪੰਜਾਬੀ البنجابية
MR मराठी الماراثية
KMR Kurmancî الكرمنجية