1. హోమ్
  2. కూర్పులు
  3. అల్ అఖీద

హదీస్ “ఎవరి చేతిలోనైతే నా ప్రాణమున్నదో, ఆయన సాక్షిగా – త్వరలో మరియం కుమారుడు (ఈసా అలైహిస్సలాం) ఒక ధర్మబద్ధుడైన న్యాయమూర్తిగా మీ మధ్యకు (భువి నుండి) దిగివస్తాడు. అతడు శిలువను విరిచేస్తాడు; పందిని చంపుతాడు; మరియు జిజియాను ఎత్తివేస్తాడు; అప్పుడు సంపద ఎంత పుష్కలంగా ఉంటుందంటే, ఎవరూ దానిని స్వీకరించరు.”

عَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ اللَّهُ عَنْهُ قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«وَالَّذِي نَفْسِي بِيَدِهِ، لَيُوشِكَنَّ أَنْ يَنْزِلَ فِيكُمْ ابْنُ مَرْيَمَ حَكَمًا مُقْسِطًا، فَيَكْسِرَ الصَّلِيبَ، وَيَقْتُلَ الخِنْزِيرَ، وَيَضَعَ الجِزْيَةَ، وَيَفِيضَ المَالُ حَتَّى لاَ يَقْبَلَهُ أَحَدٌ».

అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
“ఎవరి చేతిలోనైతే నా ప్రాణమున్నదో, ఆయన సాక్షిగా – త్వరలో మరియం కుమారుడు (ఈసా అలైహిస్సలాం) ఒక ధర్మబద్ధుడైన న్యాయమూర్తిగా మీ మధ్యకు (భువి నుండి) దిగివస్తాడు. అతడు శిలువను విరిచేస్తాడు; పందిని చంపుతాడు; మరియు జిజియాను ఎత్తివేస్తాడు; అప్పుడు సంపద ఎంత పుష్కలంగా ఉంటుందంటే, ఎవరూ దానిని స్వీకరించరు.”

ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు సహీహ్ అల్ బుఖారీ - 2222

వివరణ

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం భవిష్యత్తులో త్వరిత గతిన ఈసా అలైహిస్సలాం భువి నుండి దిగి రావడాన్ని గురించి (అల్లాహ్ పై) ఒట్టు వేసి మరీ ఇలా చెబుతున్నారు – ఆయన (ఈసా అలైహిస్సలాం) ప్రజల మధ్య ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం షరియత్ ప్రకారం న్యాయం చేస్తారు. ఆయన (ఈసా అలైహిస్సలాం) క్రైస్తవులు భక్తిభావనతో గౌరవించే శిలువను విరిచివేస్తారు. మరియు ఈసా (అలైహిస్సలాం) పందిని చంపుతారు. ఆయన అలైహిస్సలాం జిజియాను ఎత్తివేస్తారు, మరియు ప్రజలందరినీ ఇస్లాంలోనికి ప్రవేశించేలా చేస్తారు. మరియు సంపద ప్రవాహం లాగా ఉంటుంది, ఎవరూ దానిని స్వీకరించరు; అలా ఎందుకంటే దాని పుష్కలత కారణంగా. ప్రతి వ్యక్తీ తన చేతులలో ఉన్న దానితో పూర్తి సంతృప్తితో నిండి ఉంటాడు. శుభాలు, ఆశీర్వాదాలు, మేళ్ళు నిరంతరం అవతారిస్తూనే ఉంటాయి.

من فوائد الحديث

  1. ఈ హదీథు ద్వారా (ఈ యుగపు) చివరి దినాలలో ఈసా అలైహిస్సలాం ఆకాశం నుండి దిగి వస్తారని రుజువు అవుతున్నది. ఆయన దిగిరావడం అనేది ప్రళయ ఘడియను సూచించే చిహ్నాలలో ఒకటి.
  2. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం షరియత్ (ప్రళయ ఘడియ వరకు) స్థిరంగా ఉంటుంది. అది దేని చేతనూ రద్ధు చేయబడదు.
  3. ఇందులో – ప్రపంచపు చివరి దినాలలో సంపదలో శుభాలు, ఆశీర్వాదాలు అవతారిస్తూ ఉంటాయని, ప్రజలు సంపద పట్ల ఆసక్తిని కలిగి ఉండరని (దాని నుండి దూరంగా ఉంటారని) తెలుస్తున్నది.
  4. ఇందులో – ఈసా అలైహిస్సలాం ఇస్లాం షరియత్ ప్రకారంగానే పరిపాలిస్తారనే విషయం ద్వారా, మనకు ప్రపంచపు చివరి దినాల వరకూ ఇస్లాం అమరంగా, స్థిరంగా ఉంటుందననే శుభవార్త కనిపిస్తున్నది.

అనువాదాలను వీక్షించండి

58 భాష
EN English ఇంగ్లీషు
UR اردو ఉర్దూ
ES Español స్పానిష్
ID Indonesia ఇండోనేషియన్
UG ئۇيغۇرچە ఉయ్ఘర్
BN বাংলা బెంగాలీ
TR Türkçe టర్కిష్
RU Русский రష్యన్
BS Bosanski బోస్నియన్
SI සිංහල సింహళ
HI हिन्दी హిందీ
ZH 中文 చైనీస్
FA فارسی పర్షియన్
VI Tiếng Việt వియత్నమీస్
TL Tagalog టాగలాగ్
KU Kurdî కుర్దిష్
HA Hausa హౌసా
PT Português పోర్చుగీసు
ML മലയാളം మలయాళం
SW Kiswahili స్వాహిలీ
TA தமிழ் తమిళం
MY မြန်မာ బర్మీస్
TH ไทย థాయ్
DE Deutsch జర్మన్
PS پښتو పష్టో
AS অসমীয়া అస్సామీ
SQ Shqip అల్బేనియన్
SV Svenska السويدية
AM አማርኛ الأمهرية
NL Nederlands الهولندية
GU ગુજરાતી الغوجاراتية
KY Кыргызча Қирғизӣ
NE नेपाली النيبالية
YO Yorùbá Юрба
LT Lietuvių الليتوانية
PRS دری الدرية
SR Српски الصربية
SO Soomaali الصومالية
TG тоҷикӣ الطاجيكية
RW Kinyarwanda Кинёрвондӣ
RO Română الرومانية
HU Magyar المجرية
CS Čeština التشيكية
MOS Moore الموري
MG Malagasy Малагашӣ
OM Oromoo Урумӣ
KN ಕನ್ನಡ Канада
WO Wolof الولوف
AZ Azərbaycan Озарӣ
UZ O‘zbek الأوزبكية
UK Українська الأوكرانية
KA ქართული الجورجية
MK Македонски المقدونية
KM ភាសាខ្មែរ الخميرية
BM Bambara البامبارية
PA ਪੰਜਾਬੀ البنجابية
MR मराठी الماراثية
KMR Kurmancî الكرمنجية