1. హోమ్
  2. కూర్పులు
  3. అల్ అఖీద

హదీస్ “ముస్లిం ఎవరంటే – ఎవరి నాలుక నుండి మరియు చేతి నుండి తోటి ముస్లిములు సురక్షితంగా ఉంటారో; మరియు ‘ముహాజిరు’ (అల్లాహ్ మార్గములో మరో ప్రదేశానికి వలస వెళ్ళిన వ్యక్తి) ఎవరంటే – ఎవరైతే అల్లాహ్ నిషేధించిన వాటిని వదలివేస్తాడో.”

عَنْ عَبْدِ اللَّهِ بْنِ عَمْرٍو رَضِيَ اللَّهُ عَنْهُمَا عَنِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«المُسْلِمُ مَنْ سَلِمَ المُسْلِمُونَ مِنْ لِسَانِهِ وَيَدِهِ، وَالمُهَاجِرُ مَنْ هَجَرَ مَا نَهَى اللَّهُ عَنْهُ».

అబ్దుల్లాహ్ ఇబ్నె అమ్ర్ రజియల్లాహు అన్హుమా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి ఇలా ఉల్లేఖిస్తున్నారు:
“ముస్లిం ఎవరంటే – ఎవరి నాలుక నుండి మరియు చేతి నుండి తోటి ముస్లిములు సురక్షితంగా ఉంటారో; మరియు ‘ముహాజిరు’ (అల్లాహ్ మార్గములో మరో ప్రదేశానికి వలస వెళ్ళిన వ్యక్తి) ఎవరంటే – ఎవరైతే అల్లాహ్ నిషేధించిన వాటిని వదలివేస్తాడో.”

ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు సహీహ్ అల్ బుఖారీ - 10

వివరణ

సహచర ముస్లింలు ఎవరి నాలుక నుండి అయితే సురక్షితంగా ఉంటారో, అతడే నిజమైన మరియు పరిపూర్ణమైన ముస్లిం అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ హదీసులో తెలియజేస్తున్నారు. అతను వారిని అవమానించడు, తిట్టడు లేదా వెన్నుపోటు పొడవడు మరియు తన నాలుకతో వారిని బాధించడు. అలాగే సహచర ముస్లిములు అతని చేతి నుండి కూడా సురక్షితంగా ఉంటారు – అంటే అతడు వారిపై దాడి చేయడు, వారి సంపదలను అన్యాయంగా, అధర్మంగా కబళించడు; లేక ఆవిధమైన ఏ పనీ చేయడు. అలాగే ‘ముహాజిరు’ అంటే అల్లాహ్ నిషేధించిన వాటన్నింటినీ వదలివేసే వాడు.

من فوائد الحديث

  1. భౌతికంగా లేదా నైతికంగా ఇతరులకు హాని కలిగించకుండా ఉండటం ద్వారా మాత్రమే ఇస్లాం యొక్క పరిపూర్ణత సాధించబడుతుంది.
  2. ఈ హదీసులో నాలుక మరియు చేయి ప్రత్యేకంగా ప్రస్తావించబడ్డాయి - వాటి వల్ల జరిగే అనేక తప్పులు మరియు హాని కారణంగా. చాలా చెడులు వాటి నుంచే వస్తాయి.
  3. ఇందులో చెడును వదలివేయాలనే, మరియు అల్లాహ్ ఆదేశాలను శిరసావహించాలనే హితబోధ ఉన్నది.
  4. అల్లాహ్ యొక్క హక్కులను మరియు తోటి ముస్లిముల యొక్క హక్కులను ఎవరైతే నెరవేరుస్తారో వారే ఉత్తములైన ముస్లిములు.
  5. ‘దాడి చేయుట’ అనేది మాటల ద్వారా లేక చేతల ద్వారా – ఏదైనా కావచ్చు.
  6. ‘హిజ్రత్’ (వలస పోవుట) అంటే అల్లాహ్ నిషేధించిన వాటి నుండి సంపూర్ణంగా వలస పోవుట, అంటే సర్వశక్తిమంతుడైన అల్లాహ్ నిషేధించిన దానిని విడిచిపెట్టడమే పరిపూర్ణ వలస.

అనువాదాలను వీక్షించండి

57 భాష
EN English ఇంగ్లీషు
UR اردو ఉర్దూ
ES Español స్పానిష్
ID Indonesia ఇండోనేషియన్
UG ئۇيغۇرچە ఉయ్ఘర్
BN বাংলা బెంగాలీ
TR Türkçe టర్కిష్
RU Русский రష్యన్
BS Bosanski బోస్నియన్
SI සිංහල సింహళ
HI हिन्दी హిందీ
ZH 中文 చైనీస్
FA فارسی పర్షియన్
VI Tiếng Việt వియత్నమీస్
TL Tagalog టాగలాగ్
KU Kurdî కుర్దిష్
HA Hausa హౌసా
PT Português పోర్చుగీసు
ML മലയാളം మలయాళం
SW Kiswahili స్వాహిలీ
MY မြန်မာ బర్మీస్
TH ไทย థాయ్
DE Deutsch జర్మన్
PS پښتو పష్టో
AS অসমীয়া అస్సామీ
SQ Shqip అల్బేనియన్
SV Svenska السويدية
AM አማርኛ الأمهرية
NL Nederlands الهولندية
GU ગુજરાતી الغوجاراتية
KY Кыргызча Қирғизӣ
NE नेपाली النيبالية
YO Yorùbá Юрба
LT Lietuvių الليتوانية
PRS دری الدرية
SR Српски الصربية
SO Soomaali الصومالية
TG тоҷикӣ الطاجيكية
RW Kinyarwanda Кинёрвондӣ
RO Română الرومانية
HU Magyar المجرية
CS Čeština التشيكية
MOS Moore الموري
MG Malagasy Малагашӣ
IT Italiano ఇటాలియన్
OM Oromoo Урумӣ
KN ಕನ್ನಡ Канада
WO Wolof الولوف
AZ Azərbaycan Озарӣ
UZ O‘zbek الأوزبكية
UK Українська الأوكرانية
KA ქართული الجورجية
MK Македонски المقدونية
KM ភាសាខ្មែរ الخميرية
PA ਪੰਜਾਬੀ البنجابية
MR मराठी الماراثية
KMR Kurmancî الكرمنجية