1. హోమ్
  2. కూర్పులు
  3. ఫిఖ్ మరియు దాని నియమాలు

హదీస్ “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక వ్యక్తి నమాజులో పంక్తి వెనుక ఒంటరిగా నిలబడి నమాజు ఆచరించడాన్ని చూసినారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం అతడిని ఆ నమాజు మరలా చేయమని ఆదేశించినారు.”

عَنْ وَابِصَةَ رضي الله عنه:
أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ رَأَى رَجُلًا صَلَّى وَحْدَهُ خَلْفَ الصَّفِّ، فَأَمَرَهُ أَنْ يُعِيدَ صَلَاتَهُ.

వాబిసహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం :
“ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక వ్యక్తి నమాజులో పంక్తి వెనుక ఒంటరిగా నిలబడి నమాజు ఆచరించడాన్ని చూసినారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం అతడిని ఆ నమాజు మరలా చేయమని ఆదేశించినారు.”

హసన్ హదీథు అబూ దావూద్, అత్తిర్మిదీ, ఇబ్నెమాజహ్ మరియు అహ్మద్ నమోదు చేసినారు: ముస్నద్ అహ్మద్ - 18000

వివరణ

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నమాజులో ఒక వ్యక్తి పంక్తి వెనుక నిలబడి ఒంటరిగా నమాజు చేయడం చూసి, అతడిని ఆ నమాజును మరలా చేయమని ఆదేశించినారు; ఎందుకంటే ఆ విధంగా (పంక్తి విడిచి ఏకాకిగా) ఆచరించబడిన అతడి నమాజు చెల్లదు కనుక.

من فوائد الحديث

  1. ఈ హదీథులో జమాఅత్’తో నమాజు చేయడం కొరకు, ముందుగానే మస్జిదుకు వెళ్ళి మొదటి వరుసలలో చోటు సంపాదించడానికి ప్రయత్నించాలని, అలా కాకుండా పంక్తుల వెనుక ఒంటరిగా నిలబడి నమాజు ఆచరించి, తన నమాజును చెల్లకుండా చేసుకోరాదని ప్రోత్సహించబడుతున్నది.
  2. ఇమాం ఇబ్న్ హజర్ అల్ అస్ఖలానీ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: ఎవరైతే పంక్తుల వెనుక ఒంటరిగా నమాజు ఆచరించుటను మొదలుపెట్టి, జమాఅత్ రుకూ స్థితి నుండి లేవక ముందే వెళ్ళి పంక్తిలో కలిసిన వ్యక్తి ఆ రకాతును, నమాజును తిరిగి ఆచరించవలసిన అవసరం లేదు. ఈ విషయం అబూ బక్రహ్ (రదియల్లాహు అన్హు) హదీథు ద్వారా తెలుస్తున్నది. అలాకాక పంక్తుల వెనుక ఒంటరిగా నమాజు ఆచరించినట్లయితే అతడు దానిని తిరిగి ఆచరించాలి. వాబిసహ్ (రదియల్లాహు అన్హు) యొక్క పై హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశం యొక్క సాధారణత్వం ద్వారా మనకు ఈ విషయం తెలుస్తున్నది.

అనువాదాలను వీక్షించండి

48 భాష
EN English ఇంగ్లీషు
UR اردو ఉర్దూ
ES Español స్పానిష్
ID Indonesia ఇండోనేషియన్
BN বাংলা బెంగాలీ
TR Türkçe టర్కిష్
RU Русский రష్యన్
BS Bosanski బోస్నియన్
SI සිංහල సింహళ
HI हिन्दी హిందీ
ZH 中文 చైనీస్
FA فارسی పర్షియన్
VI Tiếng Việt వియత్నమీస్
TL Tagalog టాగలాగ్
KU Kurdî కుర్దిష్
HA Hausa హౌసా
PT Português పోర్చుగీసు
ML മലയാളം మలయాళం
SW Kiswahili స్వాహిలీ
TA தமிழ் తమిళం
MY မြန်မာ బర్మీస్
TH ไทย థాయ్
DE Deutsch జర్మన్
PS پښتو పష్టో
AS অসমীয়া అస్సామీ
SQ Shqip అల్బేనియన్
SV Svenska السويدية
AM አማርኛ الأمهرية
NL Nederlands الهولندية
GU ગુજરાતી الغوجاراتية
NE नेपाली النيبالية
PRS دری الدرية
SR Српски الصربية
TG тоҷикӣ الطاجيكية
RW Kinyarwanda Кинёрвондӣ
RO Română الرومانية
HU Magyar المجرية
MOS Moore الموري
MG Malagasy Малагашӣ
OM Oromoo Урумӣ
KN ಕನ್ನಡ Канада
WO Wolof الولوف
UK Українська الأوكرانية
KA ქართული الجورجية
MK Македонски المقدونية
KM ភាសាខ្មែរ الخميرية
PA ਪੰਜਾਬੀ البنجابية
MR मराठी الماراثية