1. హోమ్
  2. కూర్పులు
  3. సద్గుణాలు మరియు పద్దతులు

హదీస్ “డెబ్భై సంవత్సరాల క్రితం ఒక పెద్ద బండరాయి నరకము లోనికి విసిరి వేయబడింది. అది అలా (నరకము యొక్క అడుగు భాగం వైపునకు) జారుతూనే ఉంది. ఇప్పుడు అది నరకపు అడుగు భాగాన్ని తాకింది.” అన్నారు.”

عَنْ أَبِي هُرَيْرَةَ رضي الله عنه قَالَ:
كُنَّا مَعَ رَسُولِ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، إِذْ سَمِعَ وَجْبَةً، فَقَالَ النَّبِيُّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ: «تَدْرُونَ مَا هَذَا؟» قَالَ: قُلْنَا: اللهُ وَرَسُولُهُ أَعْلَمُ، قَالَ: «هَذَا حَجَرٌ رُمِيَ بِهِ فِي النَّارِ مُنْذُ سَبْعِينَ خَرِيفًا، فَهُوَ يَهْوِي فِي النَّارِ الْآنَ حَتَّى انْتَهَى إِلَى قَعْرِهَا».

అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం :
“మేము రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం సమక్షములో ఉండగా ఒక భయంకరమైన శబ్దం విన్నాము. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “అది (ఆ శబ్దము) ఏమిటో మీకు తెలుసా?” అని అడిగారు. మేము “అల్లాహ్ మరియు ఆయన సందేశహరుడు మాత్రమే బాగా ఎరుగును” అని అన్నాము. దానికి ఆయన (స) “డెబ్భై సంవత్సరాల క్రితం ఒక పెద్ద బండరాయి నరకము లోనికి విసిరి వేయబడింది. అది అలా (నరకము యొక్క అడుగు భాగం వైపునకు) జారుతూనే ఉంది. ఇప్పుడు అది నరకపు అడుగు భాగాన్ని తాకింది.” అన్నారు.”

ప్రామాణికమైన హదీథు ముస్లిం నమోదు చేసినారు: సహీహ్ ముస్లిం - 2844

వివరణ

ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అత్యంత కలవర పరిచేలా, ఏదో వస్తువు పడిపోయినట్లు పెద్ద శబ్దం విన్నారు. వారితో పాటు అక్కడే ఉన్న సహాబాలను (రదియల్లాహు అన్హుమ్) ఆ శబ్దాన్ని గురించి అడిగారు. దానికి వారు ‘అల్లాహ్ మరియు ఆయన సందేశహరుడు మాత్రమే బాగా ఎరుగుదురు’ అని సమాధానమిచ్చారు.
అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, వారితో ఇలా అన్నారు: మీరు విన్న ఈ శబ్దం డెబ్బై సంవత్సరాల క్రితం నరకం అంచు నుండి విసిరిన రాయి, నరకపు దిగువకు చేరుకునే వరకు పడిపోతూ పడిపోతూ, నరకం అడుగున తాకినపుడు చేసిన ఆ శబ్దాన్ని మీరు విన్నారు.

من فوائد الحديث

  1. ఈ హదీథులో సత్కార్యాలు ఎక్కువగా చేస్తూ అంతిమ దినము కొరకు తయారు కావాలనే హితబోధ, మరియు నరకం పట్ల హెచ్చరిక ఉన్నాయి.
  2. మానవుడు తనకు ఙ్ఞానం లేని విషయాలలో – వాటికి సంబంధించిన జ్ఞానాన్ని అల్లాహ్’కు ఆపాదించడం అభిలాషణీయమైన విషయం.
  3. ఉపాధ్యాయుడు విషయాన్ని వివరించే ముందు విద్యార్థులలో ఆసక్తిని, శ్రద్ధను పెంపొందించాలి, తద్వారా అది మంచి అవగాహనకు దారితీసే అవకాశం ఉంటుంది.

అనువాదాలను వీక్షించండి

52 భాష
EN English ఇంగ్లీషు
UR اردو ఉర్దూ
ES Español స్పానిష్
ID Indonesia ఇండోనేషియన్
BN বাংলা బెంగాలీ
TR Türkçe టర్కిష్
RU Русский రష్యన్
BS Bosanski బోస్నియన్
SI සිංහල సింహళ
HI हिन्दी హిందీ
ZH 中文 చైనీస్
FA فارسی పర్షియన్
VI Tiếng Việt వియత్నమీస్
TL Tagalog టాగలాగ్
KU Kurdî కుర్దిష్
HA Hausa హౌసా
PT Português పోర్చుగీసు
ML മലയാളം మలయాళం
SW Kiswahili స్వాహిలీ
TA தமிழ் తమిళం
MY မြန်မာ బర్మీస్
TH ไทย థాయ్
DE Deutsch జర్మన్
PS پښتو పష్టో
AS অসমীয়া అస్సామీ
SQ Shqip అల్బేనియన్
SV Svenska السويدية
AM አማርኛ الأمهرية
NL Nederlands الهولندية
GU ગુજરાતી الغوجاراتية
KY Кыргызча Қирғизӣ
NE नेपाली النيبالية
LT Lietuvių الليتوانية
PRS دری الدرية
SR Српски الصربية
TG тоҷикӣ الطاجيكية
RW Kinyarwanda Кинёрвондӣ
RO Română الرومانية
HU Magyar المجرية
CS Čeština التشيكية
MOS Moore الموري
MG Malagasy Малагашӣ
OM Oromoo Урумӣ
KN ಕನ್ನಡ Канада
WO Wolof الولوف
AZ Azərbaycan Озарӣ
UK Українська الأوكرانية
KA ქართული الجورجية
MK Македонски المقدونية
KM ភាសាខ្មែរ الخميرية
PA ਪੰਜਾਬੀ البنجابية
MR मराठी الماراثية