1. హోమ్
  2. కూర్పులు
  3. సద్గుణాలు మరియు పద్దతులు

హదీస్ “ఎవరైతే వితంతువు యొక్క మరియు అక్కరగొన్న వాని యొక్క (మిస్కీన్ యొక్క) మంచిచెడ్డలు చూసుకుంటాడో అతడు అల్లాహ్ మార్గములో జిహాదు చేసిన వానితో (అల్లాహ్ మార్గములో శ్రమించిన వానితో) సమానము.” అబీ హురైరహ్ (రదియల్లాహు అన్హు) కొనసాగిస్తూ ఇంకా ఇలా అన్నారు: “లేక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు “(నిరంతరం) రాత్రి అంతా నమాజులో గడిపి, ఉదయం ఉపవాసములు పాటించే వానితో సమానము.”

عَنْ أَبِي هُرَيْرَةَ قَالَ: قَالَ النَّبِيُّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«السَّاعِي عَلَى الأَرْمَلَةِ وَالمِسْكِينِ، كَالْمُجَاهِدِ فِي سَبِيلِ اللَّهِ، أَوِ القَائِمِ اللَّيْلَ الصَّائِمِ النَّهَارَ».

అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం , “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు:
“ఎవరైతే వితంతువు యొక్క మరియు అక్కరగొన్న వాని యొక్క (మిస్కీన్ యొక్క) మంచిచెడ్డలు చూసుకుంటాడో అతడు అల్లాహ్ మార్గములో జిహాదు చేసిన వానితో (అల్లాహ్ మార్గములో శ్రమించిన వానితో) సమానము.” అబీ హురైరహ్ (రదియల్లాహు అన్హు) కొనసాగిస్తూ ఇంకా ఇలా అన్నారు: “లేక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు “(నిరంతరం) రాత్రి అంతా నమాజులో గడిపి, ఉదయం ఉపవాసములు పాటించే వానితో సమానము.”

ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు సహీహ్ అల్ బుఖారీ - 5661

వివరణ

ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలుపుతున్నారు: ఒక వితంతువు - ఆమె భర్త చనిపోయాడు, ఆమె మంచి చెడ్డలు చూడడానికి ఆమె తరఫున ఎవరూ లేరు – అటువంటి వితంతువు యొక్క, మరియు నిరుపేదలు, అక్కరలు గల పేదవారు – ఇటువంటి వారి యొక్క మంచిచెడ్డలు, కేవలం అల్లాహ్ నుంచి మాత్రమే ప్రతిఫలం ఆశిస్తూ, ఎవరైతే చూస్తారో, అందు కొరకు వారిపై ఖర్చు చేస్తారో, అటువంటి వాడు ప్రతిఫలములో అల్లాహ్ మార్గములో జిహాద్ చేసిన వానికి (శ్రమించిన వానికి), లేదా రాత్రుళ్ళు తహజ్జుద్ నమాజులో గడిపినా అలుపు లేకుండా, ఇఫ్తార్ లేకుండా ఉపవాసం పాటించేవానితో సమానం.

من فوائد الحديث

  1. ఇందులో పేదలు మరియు బలహీనులు, అక్కరలు గలవారి పట్ల సామరస్యత, సానుభూతి కలిగి ఉండుట, వారికి సహకరించుట మొదలైన మంచి అలవాట్లు అలవర్చుకోవాలనే సందేశం, ప్రోత్సాహం ఉన్నాయి.
  2. “ఇబాదత్”లో (ఆరాధనలో) మంచి పనులు చేయుట కూడా ఒక భాగము. మరియు ఎవరూ దిక్కు లేని వితంతువుకు మరియు నిరుపేదలకు సహాయం చేయుట, వారి బాగోగులు చూసుకొనుట కూడా ఒక ఇబాదతే (ఆరాధనే).
  3. ఇబ్నె హుబైరహ్ ఇలా అన్నారు: “ఇందులోని భావం ఏమిటంటే - ఆ వ్యక్తి కొరకు సర్వోన్నతుడైన అల్లాహ్ ఒక ఉపవాసి యొక్క, ఒక ముజాహిద్ యొక్క మరియు ఒక నిరంతరం తహజ్జుద్ పఠించే వాని యొక్క – ఈ ముగ్గురి ప్రతిఫలాలను జమ చేసి ఇస్తున్నాడు. ఎందుకంటే అతడు వితంతువుకు ఆమె కోల్పోయిన భర్త స్థానములో నిలబడుతున్నాడు, పేదలు, నిరుపేదలు, అక్కరలు గలవారు – తమ అవసరాల కొరకు తామే నిలబడలేని స్థితిలో ఉన్న అసహాయులు, అటువంటి వారికొరకు, అతడు తన శక్తిని ఖర్చు పెడుతున్నాడు, శ్రమించి సంపాదించిన సంపదను ఖర్చు పెడుతున్నాడు, అందుకని అతని ప్రతిఫలం – నిరంతరం ఉపవాసాలు పాటించే వాని ప్రతిఫలానికీ, నిరంతరం తహజ్జుద్ పఠించే వాని ప్రతిఫలానికీ, మరియు అల్లాహ్ మార్గములో జిహాద్ చేసిన వాని (శ్రమించిన వాని) ప్రతిఫలానికీ సమానము.

అనువాదాలను వీక్షించండి

59 భాష
EN English ఇంగ్లీషు
UR اردو ఉర్దూ
ES Español స్పానిష్
ID Indonesia ఇండోనేషియన్
UG ئۇيغۇرچە ఉయ్ఘర్
BN বাংলা బెంగాలీ
TR Türkçe టర్కిష్
RU Русский రష్యన్
BS Bosanski బోస్నియన్
SI සිංහල సింహళ
HI हिन्दी హిందీ
ZH 中文 చైనీస్
FA فارسی పర్షియన్
VI Tiếng Việt వియత్నమీస్
TL Tagalog టాగలాగ్
KU Kurdî కుర్దిష్
HA Hausa హౌసా
PT Português పోర్చుగీసు
ML മലയാളം మలయాళం
SW Kiswahili స్వాహిలీ
TA தமிழ் తమిళం
MY မြန်မာ బర్మీస్
TH ไทย థాయ్
DE Deutsch జర్మన్
JA 日本語 జపనీస్
PS پښتو పష్టో
AS অসমীয়া అస్సామీ
SQ Shqip అల్బేనియన్
SV Svenska السويدية
AM አማርኛ الأمهرية
NL Nederlands الهولندية
GU ગુજરાતી الغوجاراتية
KY Кыргызча Қирғизӣ
NE नेपाली النيبالية
YO Yorùbá Юрба
LT Lietuvių الليتوانية
PRS دری الدرية
SR Српски الصربية
SO Soomaali الصومالية
TG тоҷикӣ الطاجيكية
RW Kinyarwanda Кинёрвондӣ
RO Română الرومانية
HU Magyar المجرية
CS Čeština التشيكية
MOS Moore الموري
MG Malagasy Малагашӣ
OM Oromoo Урумӣ
KN ಕನ್ನಡ Канада
WO Wolof الولوف
AZ Azərbaycan Озарӣ
UZ O‘zbek الأوزبكية
UK Українська الأوكرانية
KA ქართული الجورجية
MK Македонски المقدونية
KM ភាសាខ្មែរ الخميرية
BM Bambara البامبارية
PA ਪੰਜਾਬੀ البنجابية
MR मराठी الماراثية
KMR Kurmancî الكرمنجية