1. హోమ్
  2. కూర్పులు
  3. జీవితచరిత్ర మరియు చరిత్ర

హదీస్ ఇంట్లోని ఒక మూలలో ఒదిగి ఉండే ఒక బాలిక కంటే ఎక్కువ వినయాన్ని, బిడియాన్ని, నిరాడంబరతను “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కలిగి ఉండేవారు. ఒకవేళ ఎపుడైనా ఆయన తనకు ఇష్టం లేనిది ఏదైనా చూస్తే, ఆయన ముఖాన్ని చూసి మేము అది వెంటనే గ్రహించేవారము.”

عَنْ أَبِي سَعِيدٍ الخُدْرِيِّ رضي الله عنه قَالَ:
كَانَ النَّبِيُّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ أَشَدَّ حَيَاءً مِنَ العَذْرَاءِ فِي خِدْرِهَا، فَإِذَا رَأَى شَيْئًا يَكْرَهُهُ عَرَفْنَاهُ فِي وَجْهِهِ.

అబూ సఈద్ అల్ ఖుద్రీ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం :
ఇంట్లోని ఒక మూలలో ఒదిగి ఉండే ఒక బాలిక కంటే ఎక్కువ వినయాన్ని, బిడియాన్ని, నిరాడంబరతను “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కలిగి ఉండేవారు. ఒకవేళ ఎపుడైనా ఆయన తనకు ఇష్టం లేనిది ఏదైనా చూస్తే, ఆయన ముఖాన్ని చూసి మేము అది వెంటనే గ్రహించేవారము.”

ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు సహీహ్ అల్ బుఖారీ - 6102

వివరణ

అబూ సఈద్ అల్ ఖుద్రీ రదియల్లాహు అన్హు ఇలా తెలియజేస్తున్నారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం - ఇంకా వివాహం చేసుకోని మరియు పురుషులతో ఎప్పుడూ సన్నిహితంగా మెలగని, తన ఇంటి వారితోనే ఎక్కువగా ఉండే అమ్మాయి కంటే కూడా ఎక్కువ బిడియము, నిరాడంబరత, వినయము కలిగి ఉండేవారు. ఈ లక్షణాలు ఆయనలో ఎంత ఎక్కువగా ఉండేవి అంటే, ఆయన ఏదైనా విషయాన్ని ఇష్టపడకపోతే, వెంటనే ఆయన ముఖం మారిపోయేది, (కొంతసేపు) ఆయన మాట్లాడేవారు కాదు. ఆయన సహాబాలు ఆయన ముఖం మీద అయిష్టతను చూసి అర్థం చేసుకునేవారు.

من فوائد الحديث

  1. ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కు సంబంధించి, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఎంత నిరాడంబరంగా ఉండేవారో, ఎంత వినయంగా ఉండేవారో, మరియు ఎంతటి బిడియస్థులో తెలుస్తున్నది. ఇది ఒక అత్యుత్తమ లక్షణం.
  2. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఈ నిరాడంబరత అల్లాహ్ యొక్క నిదర్శనాలకు, ఆయన ధర్మానికి, ఆయన యొక్క పవిత్రకు ఎవరూ భంగం కలిగించనంత వరకు మాత్రమే. ఒకవేళ ఈ విషయాలకు భంగం వాటిల్లితే ఆయన కోపగ్రస్థులై పోయేవారు, తదనుగుణంగా సహాబాలకు నిషేధాఙ్ఞలు జారీ చేసేవారు.
  3. ఈ హదీసులో - నిరాడంబరతను, నమ్రతను అలవర్చుకోవాలని ప్రజలకు ఉద్బోధ ఉన్నది. ఎందుకంటే అది మంచి చేయడానికి మరియు చెడును నివారించడానికి మనస్సును ప్రేరేపిస్తుంది.

అనువాదాలను వీక్షించండి

53 భాష
EN English ఇంగ్లీషు
UR اردو ఉర్దూ
ES Español స్పానిష్
ID Indonesia ఇండోనేషియన్
UG ئۇيغۇرچە ఉయ్ఘర్
BN বাংলা బెంగాలీ
TR Türkçe టర్కిష్
RU Русский రష్యన్
BS Bosanski బోస్నియన్
SI සිංහල సింహళ
HI हिन्दी హిందీ
ZH 中文 చైనీస్
FA فارسی పర్షియన్
VI Tiếng Việt వియత్నమీస్
TL Tagalog టాగలాగ్
KU Kurdî కుర్దిష్
HA Hausa హౌసా
PT Português పోర్చుగీసు
ML മലയാളം మలయాళం
SW Kiswahili స్వాహిలీ
TA தமிழ் తమిళం
MY မြန်မာ బర్మీస్
TH ไทย థాయ్
DE Deutsch జర్మన్
PS پښتو పష్టో
AS অসমীয়া అస్సామీ
SQ Shqip అల్బేనియన్
SV Svenska السويدية
AM አማርኛ الأمهرية
NL Nederlands الهولندية
GU ગુજરાતી الغوجاراتية
KY Кыргызча Қирғизӣ
NE नेपाली النيبالية
LT Lietuvių الليتوانية
PRS دری الدرية
SR Српски الصربية
TG тоҷикӣ الطاجيكية
RW Kinyarwanda Кинёрвондӣ
RO Română الرومانية
HU Magyar المجرية
CS Čeština التشيكية
MOS Moore الموري
MG Malagasy Малагашӣ
OM Oromoo Урумӣ
KN ಕನ್ನಡ Канада
WO Wolof الولوف
AZ Azərbaycan Озарӣ
UK Українська الأوكرانية
KA ქართული الجورجية
MK Македонски المقدونية
KM ភាសាខ្មែរ الخميرية
PA ਪੰਜਾਬੀ البنجابية
MR मराठी الماراثية