1. హోమ్
  2. కూర్పులు
  3. సద్గుణాలు మరియు పద్దతులు

హదీస్ “వాహనం పై సవారీ అయి ఉన్న వాడు, పాదచారునికి సలాం చేయాలి; పాదచారుడు కూర్చుని ఉన్నవానికి సలాం చేయాలి; కొద్దిమంది ఉన్న సమూహం, ఎక్కువమంది ఉన్న సమూహానికి సలాం చేయాలి.”

عَن أَبِي هُرَيْرَةَ رضي الله عنه قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«يُسَلِّمُ الرَّاكِبُ عَلَى المَاشِي، وَالمَاشِي عَلَى القَاعِدِ، وَالقَلِيلُ عَلَى الكَثِيرِ». وَلِلبُخَارِي: «يُسَلِّمُ الصَّغِيرُ عَلَى الكَبِيرِ، وَالمَارُّ عَلَى القَاعِدِ، وَالقَلِيلُ عَلَى الكَثِيرِ».

అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు:
“వాహనం పై సవారీ అయి ఉన్న వాడు, పాదచారునికి సలాం చేయాలి; పాదచారుడు కూర్చుని ఉన్నవానికి సలాం చేయాలి; కొద్దిమంది ఉన్న సమూహం, ఎక్కువమంది ఉన్న సమూహానికి సలాం చేయాలి.” సహీహ్ బుఖారీలో: “చిన్న వారు (వయసులో) పెద్దవారికి; పాదచారుడు కూర్చుని ఉన్న వానికి, చిన్న సమూహం పెద్ద సమూహానికి సలాం చేయాలి” అని నమోదు చేయబడి ఉన్నది.

ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు సహీహ్ అల్ బుఖారీ - 6232

వివరణ

ఈ హదీసులో – ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రజలలో ‘సలాం’ ను విస్తరించే విధానానికి సంబంధించిన విధానాలను బోధిస్తున్నారు – అది “అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు” (అల్లాహ్ యొక్క శాంతి, కరుణ మరియు శుభాలు మీపై కురియుగాక). చిన్న వాళ్ళు (వయసులో) పెద్దవారికి సలాం చేయాలి; సవారీ అయి ఉన్న వ్యక్తి, కాలినడకన వెళుతున్న వానికి సలాం చేయాలి; కాలినడకన వెళుతున్న వ్యక్తి కూర్చుని ఉన్న వ్యక్తికి సలాం చేయాలి; కొద్దిమంది ఉన్న సమూహం, ఎక్కువమంది ఉన్న సమూహానికి సలాం చేయాలి.

من فوائد الحديث

  1. ‘సలాం’ చేయడమనేది హదీథులో సూచించబడిన విధానములో చేయుట మంచిది. అయితే, ఉదాహరణకు కూర్చుని ఉన్న వ్యక్తి, సవారి అయి ఉన్న వ్యక్తికి సలాం చేసినా, లేక పైన పేర్కొన్న మిగతా సందర్భాలలో అలా జరిగినా అది సమ్మతమే; అయితే అలా చేయడం, హదీసులో పేర్కొనబడిన అత్యంత విలువైన మరియు ఉత్తమమైన విధానానికి వ్యతిరేకమని గమనించాలి.
  2. హదీసులో పేర్కొన్న పద్ధతి ప్రకారం సలాంను వ్యాప్తి చేయడం (సమాజములో) ప్రేమ మరియు సామరస్యం నెలకొనడానికి కారణాలలో ఒకటి.
  3. హదీసులో పేర్కొనబడిన వారిలో ఇద్దరూ సమాన స్థితికి చెందిన వారే అయితే (ఉదాహరణకు: కాలినడకన వెళుతున్న వ్యక్తి మరొక కాలినడకన వెళుతున్న వ్యక్తి సలాం చేయడం; లేదా సవారీ పై వెళుతున్న వ్యక్తి మరొక సవారీ పై వెళుతున్న వ్యక్తి సలాం చేయడం మొ.) వారిలో ముందుగా సలాం చేసే వ్యక్తి ఉత్తముడు.
  4. ప్రజలకు అవసరమైన ప్రతి విషయాన్ని విశదీకరించడంలోనే షరియత్ యొక్క సంపూర్ణత ఉన్నది.
  5. ఇందులో ‘సలాం’ చేయుటకు సంబంధించిన మర్యాద; అలాగే ఎవరి హక్కును వారికి చెందేలా చేయడం యొక్క ప్రాధాన్యత తెలుస్తున్నది.

అనువాదాలను వీక్షించండి

57 భాష
EN English ఇంగ్లీషు
UR اردو ఉర్దూ
ES Español స్పానిష్
ID Indonesia ఇండోనేషియన్
UG ئۇيغۇرچە ఉయ్ఘర్
BN বাংলা బెంగాలీ
TR Türkçe టర్కిష్
RU Русский రష్యన్
BS Bosanski బోస్నియన్
SI සිංහල సింహళ
HI हिन्दी హిందీ
ZH 中文 చైనీస్
FA فارسی పర్షియన్
VI Tiếng Việt వియత్నమీస్
TL Tagalog టాగలాగ్
KU Kurdî కుర్దిష్
HA Hausa హౌసా
PT Português పోర్చుగీసు
ML മലയാളം మలయాళం
SW Kiswahili స్వాహిలీ
MY မြန်မာ బర్మీస్
TH ไทย థాయ్
DE Deutsch జర్మన్
PS پښتو పష్టో
AS অসমীয়া అస్సామీ
SQ Shqip అల్బేనియన్
SV Svenska السويدية
AM አማርኛ الأمهرية
NL Nederlands الهولندية
GU ગુજરાતી الغوجاراتية
KY Кыргызча Қирғизӣ
NE नेपाली النيبالية
YO Yorùbá Юрба
LT Lietuvių الليتوانية
PRS دری الدرية
SR Српски الصربية
SO Soomaali الصومالية
TG тоҷикӣ الطاجيكية
RW Kinyarwanda Кинёрвондӣ
RO Română الرومانية
HU Magyar المجرية
CS Čeština التشيكية
MOS Moore الموري
MG Malagasy Малагашӣ
IT Italiano ఇటాలియన్
OM Oromoo Урумӣ
KN ಕನ್ನಡ Канада
WO Wolof الولوف
AZ Azərbaycan Озарӣ
UZ O‘zbek الأوزبكية
UK Українська الأوكرانية
KA ქართული الجورجية
MK Македонски المقدونية
KM ភាសាខ្មែរ الخميرية
PA ਪੰਜਾਬੀ البنجابية
MR मराठी الماراثية
KMR Kurmancî الكرمنجية