1. హోమ్
  2. కూర్పులు
  3. ఫిఖ్ మరియు దాని నియమాలు

హదీస్ “మీలో వివాహం చేసుకోగల స్థోమత కలిగిన వారు వివాహం చేసుకోవాలి. ఎందుకంటే (ఇది ఇతర మహిళలను చూడకుండా) చూపులను నిగ్రహిస్తుంది, మరియు (చట్టవిరుద్ధమైన లైంగిక సంబంధాలలో పడకుండా) మర్మాంగాలను రక్షిస్తుంది. మరియు ఎవరైనా అలా చేయలేకపోతే (వివాహం చేసుకునే స్థోమత లేకపోయినట్లైతే), అతడు ఉపవాసం ఉండాలి, ఎందుకంటే అది అతనికి రక్షణగా ఉంటుంది.”

عَن عَبْدِ اللَّهِ بنِ مَسْعُودٍ رَضِيَ اللَّهُ عَنْهُ قَالَ: كُنَّا مَعَ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، فَقَالَ:
«مَنِ اسْتَطَاعَ البَاءَةَ فَلْيَتَزَوَّجْ، فَإِنَّهُ أَغَضُّ لِلْبَصَرِ، وَأَحْصَنُ لِلْفَرْجِ، وَمَنْ لَمْ يَسْتَطِعْ فَعَلَيْهِ بِالصَّوْمِ، فَإِنَّهُ لَهُ وِجَاءٌ».

అబ్దుల్లాహ్ ఇబ్న్ మస్’ఊద్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం: “మేము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమక్షములో ఉన్నాము. అప్పుడు ఆయన ఇలా పలికినారు:
“మీలో వివాహం చేసుకోగల స్థోమత కలిగిన వారు వివాహం చేసుకోవాలి. ఎందుకంటే (ఇది ఇతర మహిళలను చూడకుండా) చూపులను నిగ్రహిస్తుంది, మరియు (చట్టవిరుద్ధమైన లైంగిక సంబంధాలలో పడకుండా) మర్మాంగాలను రక్షిస్తుంది. మరియు ఎవరైనా అలా చేయలేకపోతే (వివాహం చేసుకునే స్థోమత లేకపోయినట్లైతే), అతడు ఉపవాసం ఉండాలి, ఎందుకంటే అది అతనికి రక్షణగా ఉంటుంది.”

ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు సహీహ్ అల్ బుఖారీ - 1905

వివరణ

ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం, లైంగిక సంపర్కం చేయగలిగే సామర్థ్యము మరియు వివాహ ఖర్చులను భరించగలిగే స్థోమత కలిగిన వారిని వివాహం చేసుకోవాలని కోరారు. ఇది నిషేధించబడిన వాటి నుండి వారి దృష్టిని కాపాడుతుంది, వారి మర్మావయవాలను మరింత రక్షిస్తుంది మరియు అనైతికతకు పాల్పడకుండా వారిని నిరోధిస్తుంది ఎవరైతే లైంగిక సంపర్కం చేయగలిగే సామర్థ్యము కలిగి ఉండి, వివాహ ఖర్చులను భరించగలిగే స్థోమత లేనట్లైతే అటువంటి వాడు ఉపవాసాలు పాటించాలి. అది అతని మర్మావయవాల కోరికను తగ్గిస్తుంది మరియు వీర్యం యొక్క హానిని నిరోధిస్తుంది.

من فوائد الحديث

  1. ఇస్లాం ధర్మం పవిత్రతకు దారి తీసే కారణాలపట్ల మరియు అనైతికతకు పాల్బడుటకు దారి తీసే కారణాలనుండి రక్షణకు సంబంధించిన కారణాలపట్ల శ్రధ్ధ వహిస్తుంది.
  2. ఎవరికైతే వివాహం చేసుకోగల స్థోమత లేదో వారిని ఇస్లాం ఉపవాసాలు పాటించమని బోధిస్తుంది. అది వారి కోరికలను అదుపు చేస్తుంది.
  3. ఉపవాసాలు పాటించడాన్ని కవచం తో పోల్చుట: ఎందుకంటే ఉపవాసము వృషణాలలోని రక్తనాళాలను ప్రభావితం చేస్తుంది. తద్వారా లైంగికపరమైన కోరికల తీవ్రత దూరం అవుతుంది. ఉపవాసము లైంగికపరమైన కోరికలను అదుపులో ఉంచుతుంది.

అనువాదాలను వీక్షించండి

53 భాష
EN English ఇంగ్లీషు
UR اردو ఉర్దూ
ES Español స్పానిష్
ID Indonesia ఇండోనేషియన్
UG ئۇيغۇرچە ఉయ్ఘర్
BN বাংলা బెంగాలీ
TR Türkçe టర్కిష్
RU Русский రష్యన్
BS Bosanski బోస్నియన్
SI සිංහල సింహళ
HI हिन्दी హిందీ
ZH 中文 చైనీస్
FA فارسی పర్షియన్
VI Tiếng Việt వియత్నమీస్
TL Tagalog టాగలాగ్
KU Kurdî కుర్దిష్
HA Hausa హౌసా
PT Português పోర్చుగీసు
ML മലയാളം మలయాళం
SW Kiswahili స్వాహిలీ
TA தமிழ் తమిళం
MY မြန်မာ బర్మీస్
TH ไทย థాయ్
DE Deutsch జర్మన్
PS پښتو పష్టో
AS অসমীয়া అస్సామీ
SQ Shqip అల్బేనియన్
SV Svenska السويدية
AM አማርኛ الأمهرية
NL Nederlands الهولندية
GU ગુજરાતી الغوجاراتية
KY Кыргызча Қирғизӣ
NE नेपाली النيبالية
LT Lietuvių الليتوانية
PRS دری الدرية
SR Српски الصربية
TG тоҷикӣ الطاجيكية
RW Kinyarwanda Кинёрвондӣ
RO Română الرومانية
HU Magyar المجرية
CS Čeština التشيكية
MOS Moore الموري
MG Malagasy Малагашӣ
OM Oromoo Урумӣ
KN ಕನ್ನಡ Канада
WO Wolof الولوف
AZ Azərbaycan Озарӣ
UK Українська الأوكرانية
KA ქართული الجورجية
MK Македонски المقدونية
KM ភាសាខ្មែរ الخميرية
PA ਪੰਜਾਬੀ البنجابية
MR मराठी الماراثية