1. హోమ్
  2. కూర్పులు
  3. ఫిఖ్ మరియు దాని నియమాలు

హదీస్ “ఒక పురుష విశ్వాసి, ఒక స్త్రీ విశ్వాసి అసహ్యించుకొన రాదు. ఆమె లక్షణాలలో ఒకదానిని అతడు ఇష్టపడకపోతే, మరొక లక్షణంతో అతడు సంతోషిస్తాడు”

عَنْ أَبِي هُرَيْرَةَ رضي لله عنه قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«لَا يَفْرَكْ مُؤْمِنٌ مُؤْمِنَةً، إِنْ كَرِهَ مِنْهَا خُلُقًا رَضِيَ مِنْهَا آخَرَ» أَوْ قَالَ: «غَيْرَهُ».

అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
“ఒక పురుష విశ్వాసి, ఒక స్త్రీ విశ్వాసి అసహ్యించుకొన రాదు. ఆమె లక్షణాలలో ఒకదానిని అతడు ఇష్టపడకపోతే, మరొక లక్షణంతో అతడు సంతోషిస్తాడు” లేక “వేరే (ఇంకేదైనా) లక్షణంతో” అన్నారు.

ప్రామాణికమైన హదీథు ముస్లిం నమోదు చేసినారు: సహీహ్ ముస్లిం - 1469

వివరణ

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక భర్త తన భార్యను ద్వేషించరాదని, ఆమెను అసహ్యించుకొన రాదని నిషేధిస్తున్నారు. అలా చేయడం ఆమెపై హింసకు, ఆమెను వదిలివేయడానికి మరియు ఆమె నుండి ముఖం తిప్పేసుకోవడానికి దారి తీస్తుంది. మనిషి సహజంగా అసంపూర్ణుడు, ఒకవేళ అతను ఆమెలో ఒక చెడు లక్షణాన్ని ఇష్టపడకపోతే, అతను ఆమెలో మరొక మంచి లక్షణాన్ని కనుగొంటాడు; తన ప్రవృత్తికి సరిపోయే ఆ మంచి లక్షణంతో అతడు సంతృప్తి చెందుతాడు. తనకు నచ్చని ఆ చెడు లక్షణం పట్ల అతడు సహనం వహిస్తాడు. ఆ సహనం ఆమెను ద్వేషించడం నుండి, ఆమెను అసహ్యించుకోవడం నుండి ఆపుతుంది; ఆమెను వదిలి వేసేందుకు లేదా ఆమె నుండి దూరమయ్యేందుకు దారి తీసే పరిస్థితి రాకుండా చేస్తుంది.

من فوائد الحديث

  1. ఈ హదీసు విశ్వాసిని న్యాయంగా ప్రవర్తించమని పిలుపునిస్తున్నది. తన భార్యతో తలెత్తే ఏ వివాదంలోనైనా తాత్కాలిక భావోద్వేగాలకు లోను కాకుండా, హేతుబద్ధంగా వ్యవహరించమని బోధిస్తున్నది.
  2. ఒక విశ్వాసి యొక్క విధి ఏమిటంటే అతడు ఒక విశ్వాస స్త్రీని, ఆమె నుండి విడిపోవడానికి దారి తీసేటంత ఎక్కువగా ద్వేషించరాదు, లేదా అసహ్యించుకొనరాదు. అలా కాకుండా ఆమెలో తనకు ఇష్టమైన లక్షణాల కొరకు తనకు ఇష్టం కాని లక్షణాలను ఉపేక్షించాలి.
  3. ఈ హదీస్ భార్యాభర్తల మధ్య మంచి ప్రవర్తన మరియు సహవాసాన్ని ప్రోత్సహిస్తుంది.
  4. విశ్వాసము మంచి నైతికత కలిగి ఉండమని పిలుపునిస్తుంది. ఏ విశ్వాస స్త్రీ అయినా లేదా విశ్వాస పురుషుడు అయినా మంచి నైతికత లేకుండా లేరు. అయితే విశ్వాసము వారిలో ప్రశంసనీయమైన లక్షణాల ఉనికిని కోరుతుంది.

అనువాదాలను వీక్షించండి

56 భాష
EN English ఇంగ్లీషు
UR اردو ఉర్దూ
ES Español స్పానిష్
ID Indonesia ఇండోనేషియన్
BN বাংলা బెంగాలీ
TR Türkçe టర్కిష్
RU Русский రష్యన్
BS Bosanski బోస్నియన్
SI සිංහල సింహళ
HI हिन्दी హిందీ
ZH 中文 చైనీస్
FA فارسی పర్షియన్
VI Tiếng Việt వియత్నమీస్
TL Tagalog టాగలాగ్
KU Kurdî కుర్దిష్
HA Hausa హౌసా
PT Português పోర్చుగీసు
ML മലയാളം మలయాళం
SW Kiswahili స్వాహిలీ
TA தமிழ் తమిళం
MY မြန်မာ బర్మీస్
TH ไทย థాయ్
DE Deutsch జర్మన్
PS پښتو పష్టో
AS অসমীয়া అస్సామీ
SQ Shqip అల్బేనియన్
SV Svenska السويدية
AM አማርኛ الأمهرية
NL Nederlands الهولندية
GU ગુજરાતી الغوجاراتية
KY Кыргызча Қирғизӣ
NE नेपाली النيبالية
YO Yorùbá Юрба
LT Lietuvių الليتوانية
PRS دری الدرية
SR Српски الصربية
SO Soomaali الصومالية
TG тоҷикӣ الطاجيكية
RW Kinyarwanda Кинёрвондӣ
RO Română الرومانية
HU Magyar المجرية
CS Čeština التشيكية
MOS Moore الموري
MG Malagasy Малагашӣ
OM Oromoo Урумӣ
KN ಕನ್ನಡ Канада
WO Wolof الولوف
AZ Azərbaycan Озарӣ
UZ O‘zbek الأوزبكية
UK Українська الأوكرانية
KA ქართული الجورجية
MK Македонски المقدونية
KM ភាសាខ្មែរ الخميرية
PA ਪੰਜਾਬੀ البنجابية
MR मराठी الماراثية
KMR Kurmancî الكرمنجية