عَنْ أَبي هُرَيْرَةَ رضي الله عنه قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«مَا مِنْ صَاحِبِ ذَهَبٍ وَلَا فِضَّةٍ، لَا يُؤَدِّي مِنْهَا حَقَّهَا، إِلَّا إِذَا كَانَ يَوْمُ الْقِيَامَةِ، صُفِّحَتْ لَهُ صَفَائِحُ مِنْ نَارٍ، فَأُحْمِيَ عَلَيْهَا فِي نَارِ جَهَنَّمَ، فَيُكْوَى بِهَا جَنْبُهُ وَجَبِينُهُ وَظَهْرُهُ، كُلَّمَا بَرَدَتْ أُعِيدَتْ لَهُ، فِي يَوْمٍ كَانَ مِقْدَارُهُ خَمْسِينَ أَلْفَ سَنَةٍ، حَتَّى يُقْضَى بَيْنَ الْعِبَادِ، فَيَرَى سَبِيلَهُ، إِمَّا إِلَى الْجَنَّةِ، وَإِمَّا إِلَى النَّارِ»
قِيلَ: يَا رَسُولَ اللهِ، فَالْإِبِلُ؟ قَالَ: «وَلَا صَاحِبُ إِبِلٍ لَا يُؤَدِّي مِنْهَا حَقَّهَا، وَمِنْ حَقِّهَا حَلَبُهَا يَوْمَ وِرْدِهَا، إِلَّا إِذَا كَانَ يَوْمُ الْقِيَامَةِ، بُطِحَ لَهَا بِقَاعٍ قَرْقَرٍ، أَوْفَرَ مَا كَانَتْ، لَا يَفْقِدُ مِنْهَا فَصِيلًا وَاحِدًا، تَطَؤُهُ بِأَخْفَافِهَا وَتَعَضُّهُ بِأَفْوَاهِهَا، كُلَّمَا مَرَّ عَلَيْهِ أُولَاهَا رُدَّ عَلَيْهِ أُخْرَاهَا، فِي يَوْمٍ كَانَ مِقْدَارُهُ خَمْسِينَ أَلْفَ سَنَةٍ، حَتَّى يُقْضَى بَيْنَ الْعِبَادِ، فَيَرَى سَبِيلَهُ إِمَّا إِلَى الْجَنَّةِ، وَإِمَّا إِلَى النَّارِ»
قِيلَ: يَا رَسُولَ اللهِ، فَالْبَقَرُ وَالْغَنَمُ؟ قَالَ: «وَلَا صَاحِبُ بَقَرٍ، وَلَا غَنَمٍ، لَا يُؤَدِّي مِنْهَا حَقَّهَا، إِلَّا إِذَا كَانَ يَوْمُ الْقِيَامَةِ بُطِحَ لَهَا بِقَاعٍ قَرْقَرٍ، لَا يَفْقِدُ مِنْهَا شَيْئًا، لَيْسَ فِيهَا عَقْصَاءُ، وَلَا جَلْحَاءُ، وَلَا عَضْبَاءُ تَنْطَحُهُ بِقُرُونِهَا وَتَطَؤُهُ بِأَظْلَافِهَا، كُلَّمَا مَرَّ عَلَيْهِ أُولَاهَا رُدَّ عَلَيْهِ أُخْرَاهَا، فِي يَوْمٍ كَانَ مِقْدَارُهُ خَمْسِينَ أَلْفَ سَنَةٍ، حَتَّى يُقْضَى بَيْنَ الْعِبَادِ، فَيَرَى سَبِيلَهُ إِمَّا إِلَى الْجَنَّةِ، وَإِمَّا إِلَى النَّارِ»
قِيلَ: يَا رَسُولَ اللهِ، فَالْخَيْلُ؟ قَالَ: «الْخَيْلُ ثَلَاثَةٌ: هِيَ لِرَجُلٍ وِزْرٌ، وَهِيَ لِرَجُلٍ سِتْرٌ، وَهِيَ لِرَجُلٍ أَجْرٌ، فَأَمَّا الَّتِي هِيَ لَهُ وِزْرٌ، فَرَجُلٌ رَبَطَهَا رِيَاءً وَفَخْرًا وَنِوَاءً عَلَى أَهْلِ الْإِسْلَامِ، فَهِيَ لَهُ وِزْرٌ، وَأَمَّا الَّتِي هِيَ لَهُ سِتْرٌ، فَرَجُلٌ رَبَطَهَا فِي سَبِيلِ اللهِ، ثُمَّ لَمْ يَنْسَ حَقَّ اللهِ فِي ظُهُورِهَا وَلَا رِقَابِهَا، فَهِيَ لَهُ سِتْرٌ وَأَمَّا الَّتِي هِيَ لَهُ أَجْرٌ، فَرَجُلٌ رَبَطَهَا فِي سَبِيلِ اللهِ لِأَهْلِ الْإِسْلَامِ، فِي مَرْجٍ وَرَوْضَةٍ، فَمَا أَكَلَتْ مِنْ ذَلِكَ الْمَرْجِ، أَوِ الرَّوْضَةِ مِنْ شَيْءٍ، إِلَّا كُتِبَ لَهُ، عَدَدَ مَا أَكَلَتْ حَسَنَاتٌ، وَكُتِبَ لَهُ، عَدَدَ أَرْوَاثِهَا وَأَبْوَالِهَا، حَسَنَاتٌ، وَلَا تَقْطَعُ طِوَلَهَا فَاسْتَنَّتْ شَرَفًا، أَوْ شَرَفَيْنِ، إِلَّا كَتَبَ اللهُ لَهُ عَدَدَ آثَارِهَا وَأَرْوَاثِهَا حَسَنَاتٍ، وَلَا مَرَّ بِهَا صَاحِبُهَا عَلَى نَهْرٍ، فَشَرِبَتْ مِنْهُ وَلَا يُرِيدُ أَنْ يَسْقِيَهَا، إِلَّا كَتَبَ اللهُ لَهُ، عَدَدَ مَا شَرِبَتْ، حَسَنَاتٍ»
قِيلَ: يَا رَسُولَ اللهِ، فَالْحُمُرُ؟ قَالَ: «مَا أُنْزِلَ عَلَيَّ فِي الْحُمُرِ شَيْءٌ، إِلَّا هَذِهِ الْآيَةَ الْفَاذَّةُ الْجَامِعَةُ»: {فَمَنْ يَعْمَلْ مِثْقَالَ ذَرَّةٍ خَيْرًا يَرَهُ، وَمَنْ يَعْمَلْ مِثْقَالَ ذَرَّةٍ شَرًّا يَرَهُ} [الزلزلة: 8].
المزيد
అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
“బంగారము మరియు వెండి కలిగి ఉన్న సొంతదారుడు ఎవరైనా వాటి హక్కును (జకాతును) చెల్లించనట్లయితే, తీర్పు దినమున అవి పలకలుగా మార్చబడి నరకాగ్నిలో బాగా కాల్చబడతాయి. వాటితో అతని పక్కలపై, నుదుటిపై, వీపుపై వాతలు పెట్టడం జరుగుతుంది. అవి చల్లారితే వాటిని తిరిగి ఎర్రగా కాల్చడం జరుగుతుంది (తిరిగి అతడిని ఆ విధంగా శిక్షించడం జరుగుతుంది). అప్పుడు ఒక దినము యాభైవేల సంవత్సరాలంత సుదీర్ఘంగా ఉంటుంది. ఆ శిక్ష అల్లాహ్ తన దాసుల మధ్య తీర్పు చేసేటంత వరకూ కొనసాగుతూ ఉంటుంది. తరువాత అతడు అతని గమ్యస్థానమైన స్వర్గం వైపునకో లేక నరకం వైపునకో మార్గం చూసుకుంటాడు (చూపడం జరుగుతుంది). ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఇలా అడగడం జరిగింది: “ఓ రసూలల్లాహ్! మరి ఒంటెల గురించి?” (అంటే ఒంటెలు కలిగి ఉన్న ఆసామి ఎవరైనా వాటి హక్కును (జకాతును) చెల్లించనట్లయితే?) దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “పునరుత్థాన దినమున ఒంటెల యజమానిని, ఎవరైతే వాటి హక్కును చెల్లించడో – వాటి హక్కులలో, వాటికి నీరు త్రాపుట, దినములో పాలుపితుకుట కూడా ఉన్నది – అటువంటి యజమానిని విశాలమైన ఎడారి వంటి మైదానములో తన ముఖముపై, లేదా అతని వీపుపై పడవేయుట జరుగుతుంది. ఆ ఒంటెలు బాగా బలిసినట్టుగా లావుగా ఉంటాయి, వాటిలో చిన్న ఒంటె కూడా మినహాయించ బడదు. అవి తమ కాళ్ళ గిట్టలతో అతడిని తొక్కుతూ, తమ పళ్ళతో అతడిని కరుస్తూ ఉంటాయి. మొదటి ఒంటె నుండి చివరి ఒంటె వరకు వంతుల వారీగా ఇలా జరుగుతుంది. అపుడు ఒక దినము యాభై వేల సంవత్సరాల అంత దీర్ఘంగా ఉంటుంది, ఈ విధంగా అల్లాహ్ దాసుల మధ్య తీర్పు చేసేటంత వరకు జరుగుతుంది. చివరికి అతడు తన అంతిమ గమ్యస్థానం అయిన స్వర్గం వైపునకో లేక నరకం వైపునకో మార్గం చూసుకుంటాడు (దారి చూపబడుతుంది). ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను (మరలా) ఇలా అడగడం జరిగింది: “ఓ రసూలల్లాహ్! మరి ఆవులు (పశువులు) మరియు మేకలు, గొర్రెల సంగతేమిటి?” అని (అంటే ఆవులు, మేకలు/గొర్రెలు కలిగి ఉన్న ఆసామి ఎవరైనా వాటి హక్కును (జకాతును) చెల్లించనట్లయితే?) దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “పునరుత్థాన దినమున అతడు విశాలమైన ఎడారి వంటి మైదానములో తన ముఖం మీద పడవేయబడతాడు. అక్కడ వంకరలు తిరిగిన కొమ్ములు లేని ఏ జంతువూ కనిపించదు, అలాగే విరిగిన కొమ్ములు కలిగిన ఏ జంతువు గానీ, కొమ్ములు లేని ఏ జంతువు గానీ కనిపించదు. అవి తమ కొమ్ములతో అతడిని పొడుస్తాయి, తమ కాలి గిట్టలతో అతడిని తొక్కుతాయి. వాటిలో మొదటి పశువు అతడిని దాటిన తరువాత ఆ దినము చివరి పశువు అతడిని దాటేంత వరకు ఇలా జరుగుతుంది. అపుడు ఒక దినము యాభైవేల సంవత్సరాల అంత సుదీర్ఘంగా ఉంటుంది. అల్లాహ్ దాసుల మధ్య తీర్పు ప్రకటించబడే వరకు ఇలా జరుగుతుంది. చివరికి అతని అంతిమ గమ్యస్థానం అయిన స్వర్గం వైపునకో లేక నరకం వైపునకో అతడు తన మార్గం చూసుకుంటాడు (దారి చూపబడుతుంది). ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను (మరలా) ఇలా అడగడం జరిగింది: “ఓ రసూలల్లాహ్! మరి గుర్రాల గురించి?” అని (అంటే గుర్రాలు కలిగి ఉన్న ఆసామి ఎవరైనా వాటి హక్కును (జకాతును) చెల్లించనట్లయితే?) దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “గుర్రాలు మూడు రకాలు: అవి ఆ వ్యక్తికి భారంగా పరిణమించవచ్చు, ఆ వ్యక్తికి కవచంగా పరిణమించవచ్చు, మరియు ఆ వ్యక్తిని పుణ్యఫలానికి అర్హుడినిగా చేయవచ్చు. ఎవరైతే ప్రజలకు చూపించడానికి, హోదా మరియు గర్వపడుట కొరకు, మరియు ఇస్లాంకు, ముస్లిములకు వ్యతిరేకంగా ఉపయోగించడానికి కట్టి ఉంచినట్లయితే, తీర్పు దినమున అవి అతనికి ఒక భారంగా పరిణమిస్తాయి. కవచంగా పరిణమించే గుర్రాల విషయానికి వస్తే, ఎవరైతే గుర్రాలను కలిగి ఉండి, వాటిని అల్లాహ్ మార్గములో ఉపయోగించే నిమిత్తం కట్టి ఉంచుతాడో, మరియు వాటి వీపుల మీద, మరియు వాటి మెడల మీద అల్లాహ్’కు గల హక్కును మరిచిపోడో (అంటే వాటి వీపులను, మెడలను పేద ప్రజలను తమ అవసరాల కొరకు వినియోగించుకోనిస్తాడో) అవి అతనికి కవచంగా పరిణమిస్తాయి. మరి పుణ్యఫలంగా పరిణమించే గుర్రాల విషయానికి వస్తే ఎవరైతే గుర్రాలను కలిగి ఉండి, ముస్లిముల కొరకు, మరియు అల్లాహ్ మార్గంలో జరిగే పోరాటాలలో వాటిని వినియోగించే ఉద్దేశ్యంతో, వాటి కొరకు పచ్చిక బైళ్ళను, తోటలను కేటాయించి, వాటిలో కట్టివేసి వాటిని పెంచుతున్నట్లయితే అవి వాటిలో తిరుగుతూ ఏమి మేసినా (మేసిన ప్రతి ఆకు, ప్రతి గడ్డిపరకా) అది అతనికి పుణ్యఫలంగా రాయబడుతుంది; వాటి పేడ (లద్దె), వాటి మూత్రము కూడా అతని ఖాతాలో పుణ్యఫలంగా వ్రాయబడుతుంది. ఒకవేళ ఆ గుర్రం త్రాడు తెంచుకుని ఒకటి లేక రెండు ఎత్తైన ప్రదేశాలు (గుట్టలు) దాటుకుని వస్తే, అది వేసిన ప్రతి అడుగు అతనికి పుణ్యఫలంగా వ్రాయ బడుతుంది; దాని పేడ (లద్దె), మరియు దాని మూత్రము సైతం అతనికి పుణ్యఫలంగా వ్రాయబడతాయి. ఒకవేళ అతడు ఆ గుర్రాన్ని ఏదైనా నది ఒడ్డు మీద నుండి వెళుతున్నపుడు, (గుర్రానికి) నీళ్ళు తాపించే ఉద్దేశ్యం అతనికి లేకపోయినా, గుర్రం తనంతట తానే నదిలోని నీళ్ళు త్రాగితే, అది ఎన్ని గ్రుక్కల నీళ్ళు త్రాగిందో అవన్నీ అతనికి పుణ్యఫలాలుగా వ్రాయబడతాయి.”