1. హోమ్
  2. కూర్పులు
  3. ఫిఖ్ మరియు దాని నియమాలు

హదీస్ “నిశ్చయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలకృత్యాలు తీర్చుకున్న తరువాత ‘ఇస్తింజా’ చేయడానికి (శుభ్రపరుచుకోవడానికి) పేడ లేదా ఎముకను ఉపయోగించడాన్ని నిషేధించినారు

عَنْ أَبِي هُرَيْرَةَ رَضيَ اللهُ عنه قَالَ:
إِنَّ النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ نَهَى أَنْ يُسْتَنْجَى بِرَوْثٍ أَوْ عَظْمٍ، وَقَالَ: «إِنَّهُمَا لَا تُطَهِّرَانِ».

అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన:
“నిశ్చయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలకృత్యాలు తీర్చుకున్న తరువాత ‘ఇస్తింజా’ చేయడానికి (శుభ్రపరుచుకోవడానికి) పేడ లేదా ఎముకను ఉపయోగించడాన్ని నిషేధించినారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “ఈ రెండూ శుద్ధపరచవు.”

ప్రామాణికమైన హదీథు దారు ఖుత్నీ నమోదు చేసినారు: సునన్ అద్దారల్ ఖుత్నీ - 152

వివరణ

మూత్ర విసర్జన లేదా మల విసర్జన ద్వారా ఉపశమనం పొందిన తరువాత ఎవరైనా శుభ్రపరుచు కోవడానికి జంతువు ఎముకను, పేడను లేదా పిడకను ఉపయోగించడాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం నిషేధించారు. ఆయన సల్లల్లాహు అలైహి వ సల్లం ఇలా అన్నారు: “అవి అశుద్ధతను దూరం చేయవు అలాగే అవి ఎవరినీ అశుద్ధత నుండి పరిశుద్ధ పరచవు కూడా.”

من فوائد الحديث

  1. ఈ హదీథులో మరుగుదొడ్డిని ఉపయోగించుటకు సంబంధించి మరియు ఇస్తింజాకు (కాలకృత్యాలు తీర్చుకున్న తరువాత శుభ్రపరుచుకోవడానికి) సంబంధించి కొన్ని మర్యాదలు వివరించబడినాయి.
  2. పేడను, పిడకలను ఇస్తింజా కోసం ఉపయోగించడం నిషేధించబడింది, ఎందుకంటే అది అపవిత్రమైనది లేదా జిన్నాతుల జంతువులకు మేత కాబట్టి.
  3. ఎముకలను ఇస్తింజా కోసం ఉపయోగించడం నిషేధించబడింది, ఎందుకంటే ఎముకలు అశుధ్ధమైనవి లేదా అవి స్వయంగా జిన్నాతుల ఆహారం కాబట్టి.

అనువాదాలను వీక్షించండి

36 భాష
EN English ఇంగ్లీషు
UR اردو ఉర్దూ
ES Español స్పానిష్
ID Indonesia ఇండోనేషియన్
BN বাংলা బెంగాలీ
TR Türkçe టర్కిష్
RU Русский రష్యన్
BS Bosanski బోస్నియన్
SI සිංහල సింహళ
HI हिन्दी హిందీ
ZH 中文 చైనీస్
FA فارسی పర్షియన్
VI Tiếng Việt వియత్నమీస్
TL Tagalog టాగలాగ్
KU Kurdî కుర్దిష్
HA Hausa హౌసా
PT Português పోర్చుగీసు
ML മലയാളം మలయాళం
SW Kiswahili స్వాహిలీ
MY မြန်မာ బర్మీస్
TH ไทย థాయ్
PS پښتو పష్టో
AS অসমীয়া అస్సామీ
AM አማርኛ الأمهرية
NL Nederlands الهولندية
GU ગુજરાતી الغوجاراتية
PRS دری الدرية
SR Српски الصربية
RO Română الرومانية
HU Magyar المجرية
KN ಕನ್ನಡ Канада
KA ქართული الجورجية
MK Македонски المقدونية
KM ភាសាខ្មែរ الخميرية
PA ਪੰਜਾਬੀ البنجابية
MR मराठी الماراثية