1. హోమ్
  2. కూర్పులు
  3. సద్గుణాలు మరియు పద్దతులు

హదీస్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలకృత్యాలు తీర్చుకొను ప్రదేశములోనికి ప్రవేశించినప్పుడు, నేను మరియు ఒక సేవకుడు ఒక నీటితో నిండిన తోలుతిత్తిని, ఒక చేతికర్రను తీసుకుని వెళ్ళే వాళ్ళము, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఆ నీటితో తనను తాను శుభ్రపరుచుకునేవారు

عَنْ أَنَسِ بْنِ مَالِكٍ رَضيَ اللهُ عنه قَالَ:
كَانَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ يَدْخُلُ الْخَلَاءَ، فَأَحْمِلُ أَنَا وَغُلَامٌ نَحْوِي إِدَاوَةً مِنْ مَاءٍ وَعَنَزَةً فَيَسْتَنْجِي بِالْمَاءِ.

అనస్ ఇబ్న్ మాలిక్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన:
రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలకృత్యాలు తీర్చుకొను ప్రదేశములోనికి ప్రవేశించినప్పుడు, నేను మరియు ఒక సేవకుడు ఒక నీటితో నిండిన తోలుతిత్తిని, ఒక చేతికర్రను తీసుకుని వెళ్ళే వాళ్ళము, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఆ నీటితో తనను తాను శుభ్రపరుచుకునేవారు.

ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు సహీహ్ ముస్లిం - 271

వివరణ

అనస్ ఇబ్న్ మాలిక్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన ప్రకారం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలకృత్యాలు తీర్చు కోవడానికి బయటకు వెళ్ళినప్పుడు, తాను మరియు దాదాపు అదే వయస్సు గల ఒక సేవకుడు ఆయనను అనుసరించేవారు. వారు ఒక అంచున ఈటె వంటి పదునైన భాగం ఉన్న ఒక చేతికర్రను వెంట తీసుకువెళ్లేవారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దానిని నేలలో పాతి, తన గోప్యత కొరకు దానిపై ఏదైనా వస్త్రం లాంటిది వ్రేళ్ళాడదీసేవారు, లేదా దానిని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తాను నమాజు ఆచరించునపుడు తన ముందు సుత్రాగా నేలలో పాతేవారు; అలాగే నీటితో నిండిన ఒక చిన్న తోలు తిత్తిని కూడా తీసుకువెళ్ళేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలకృత్యాలు తీర్చుకొనుట పూర్తి చేసినపుడు వారిలో ఒకరు ఆయనకు ఆ తోలుతిత్తిని అందజేసేవారు, మరియు ఆయన ఆ తోలుతిత్తిలోని నీటితో తనను తాను శుభ్రపరచుకునేవారు.

من فوائد الحديث

  1. ఒక ముస్లిం కాలకృత్యాలు తీర్చుకోవలసిన అవసరం వస్తే, ముందుగానే తనను తాను శుబ్రపరుచుకునే సామాగ్రిని సిద్ధం చేసుకుంటాడు; తద్వారా కాలకృత్యాలు తీర్చుకున్న తరువాత శుభ్రపరిచే సామాగ్రి కొరకు అటూఇటూ కదిలి మరింత మురికిగా మారకుండా ఉంటాడు.
  2. కాలకృత్యాలు తీర్చుకొనునపుడు తన మర్మాంగాలు ఇతరులకు కనబడకుండా పరిరక్షించుకోవడం ముఖ్యం; ఎందుకంటే ఇతరుల మర్మాంగాలను చూడడం నిషేధము. అందుకనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, కాల కృత్యాలు తీర్చుకొనునపుడు నేలలో తన చేతి కర్రను దిగవేసి దానిపై ఏదైనా ఒక వస్త్రాన్ని తనకు అడ్డుగా కప్పివేసేవారు.
  3. పిల్లలకు ఇస్లామీయ మర్యాదలను, ఆచార వ్యవహారాలను బోధించాలి మరియు దానికి అనుగుణంగా వారిని పెంచడం జరగాలి, తద్వారా వారు దానిని వారసత్వంగా పొందుతారు.

అనువాదాలను వీక్షించండి

36 భాష
EN English ఇంగ్లీషు
UR اردو ఉర్దూ
ES Español స్పానిష్
ID Indonesia ఇండోనేషియన్
BN বাংলা బెంగాలీ
TR Türkçe టర్కిష్
RU Русский రష్యన్
BS Bosanski బోస్నియన్
SI සිංහල సింహళ
HI हिन्दी హిందీ
ZH 中文 చైనీస్
FA فارسی పర్షియన్
VI Tiếng Việt వియత్నమీస్
TL Tagalog టాగలాగ్
KU Kurdî కుర్దిష్
HA Hausa హౌసా
PT Português పోర్చుగీసు
ML മലയാളം మలయాళం
SW Kiswahili స్వాహిలీ
MY မြန်မာ బర్మీస్
TH ไทย థాయ్
PS پښتو పష్టో
AS অসমীয়া అస్సామీ
AM አማርኛ الأمهرية
NL Nederlands الهولندية
GU ગુજરાતી الغوجاراتية
PRS دری الدرية
SR Српски الصربية
RO Română الرومانية
HU Magyar المجرية
KN ಕನ್ನಡ Канада
KA ქართული الجورجية
MK Македонски المقدونية
KM ភាសាខ្មែរ الخميرية
PA ਪੰਜਾਬੀ البنجابية
MR मराठी الماراثية
కూర్పులు