1. హోమ్
  2. కూర్పులు
  3. ఫిఖ్ మరియు దాని నియమాలు

హదీస్ (నమాజులో) మీరు సజ్దహ్ చేసినపుడు రెండు అరచేతులను నేలకు ఆనించి, రెండు మోచేతులు (నేలపై ఆనకుండా) పైకి ఉండేలా సజ్దహ్ చేయండి.”

عَنِ الْبَرَاءِ رضي الله عنه قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«إِذَا سَجَدْتَ، فَضَعْ كَفَّيْكَ وَارْفَعْ مِرْفَقَيْكَ».

అల్ బరా ఇబ్న్ ఆజిబ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
(నమాజులో) మీరు సజ్దహ్ చేసినపుడు రెండు అరచేతులను నేలకు ఆనించి, రెండు మోచేతులు (నేలపై ఆనకుండా) పైకి ఉండేలా సజ్దహ్ చేయండి.”

ప్రామాణికమైన హదీథు ముస్లిం నమోదు చేసినారు: సహీహ్ ముస్లిం - 494

వివరణ

ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సలాహ్ చేయునపుడు సజ్దహ్ లో రెండు చేతుల యొక్క స్థానము ఏమిటో వివరిస్తున్నారు. అది – రెండు అరచేతులను, చేతి వ్రేళ్ళు (విడిగా, విప్పి ఉండేలా కాకుండా) కలిసి ఉండేలా మరియు ఖిబ్లా వైపునకు ఉండేలా చేయాలి. అదే సమయములో మోచేతులను (మోచేయి అంటే భుజపు టెముక మరియు ముంజేయి కలియు భాగము) నేలపై ఆనకుండా మోచేతులను శరీరానికి దూరంగా ఉండేలా, పైకి లేపి ఉంచి సజ్దహ్ చేయాలి.

من فوائد الحديث

  1. నమాజు ఆచరిస్తున్న వ్యక్తి (సజ్దహ్ లో) తన రెండు అరచేతులను నేలపై ఉంచాలి. అరచేతులు (సజ్దహ్ యొక్క) ఏడు శరీరభాగాలలో రెండు భాగాలు.
  2. మోచేతులను నేల నుండి పైకి లేపి ఉంచడం మంచిది, మరియు వాటిని అడవి మృగంలా నేలపై విస్తరించడం నమాజు ఆచరణలో మక్రూహ్’గా (అయిష్టమైనదిగా) భావించబడుతుంది.
  3. ఆరాధనలో (ఇబాదత్’లో) శక్తి, బలం మరియు ఆ ఇబాదత్’ను ఆచరించాలనే ప్రబలమైన ఇచ్ఛను ప్రదర్శించడం షరియత్ ప్రకారం సరియైనదే.
  4. నమాజు ఆచరించే వ్యక్తి సజ్దహ్ యొక్క అన్ని శరీర భాగాలపై ఆధారపడి సజ్దహ్ చేసినప్పుడు, ప్రతి భాగానికి ఆ ఇబాదత్ (ఆరాధన) యొక్క హక్కు లభిస్తుంది.

అనువాదాలను వీక్షించండి

50 భాష
EN English ఇంగ్లీషు
UR اردو ఉర్దూ
ES Español స్పానిష్
ID Indonesia ఇండోనేషియన్
UG ئۇيغۇرچە ఉయ్ఘర్
BN বাংলা బెంగాలీ
TR Türkçe టర్కిష్
RU Русский రష్యన్
BS Bosanski బోస్నియన్
SI සිංහල సింహళ
HI हिन्दी హిందీ
ZH 中文 చైనీస్
FA فارسی పర్షియన్
VI Tiếng Việt వియత్నమీస్
TL Tagalog టాగలాగ్
KU Kurdî కుర్దిష్
HA Hausa హౌసా
PT Português పోర్చుగీసు
ML മലയാളം మలయాళం
SW Kiswahili స్వాహిలీ
TA தமிழ் తమిళం
MY မြန်မာ బర్మీస్
TH ไทย థాయ్
DE Deutsch జర్మన్
PS پښتو పష్టో
AS অসমীয়া అస్సామీ
SQ Shqip అల్బేనియన్
SV Svenska السويدية
AM አማርኛ الأمهرية
NL Nederlands الهولندية
GU ગુજરાતી الغوجاراتية
NE नेपाली النيبالية
PRS دری الدرية
SR Српски الصربية
TG тоҷикӣ الطاجيكية
RW Kinyarwanda Кинёрвондӣ
RO Română الرومانية
HU Magyar المجرية
MOS Moore الموري
MG Malagasy Малагашӣ
OM Oromoo Урумӣ
KN ಕನ್ನಡ Канада
WO Wolof الولوف
AZ Azərbaycan Озарӣ
UK Українська الأوكرانية
KA ქართული الجورجية
MK Македонски المقدونية
KM ភាសាខ្មែរ الخميرية
PA ਪੰਜਾਬੀ البنجابية
MR मराठी الماراثية