1. హోమ్
  2. కూర్పులు
  3. సద్గుణాలు మరియు పద్దతులు

హదీస్ ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అసభ్యంగా మాట్లాడేవారు కాదు, అసభ్యంగా ప్రవర్తించేవారు కాదు, సంతల్లో (బజార్లలో) గొడవపడి అరవేవారు కాదు, తనకు చెడు చేసినవారికి చెడుతో ప్రతిస్పందించేవారు కాదు, కానీ ఆయన క్షమించేవారు, మన్నించేవారు

عَن أَبي عَبْدِ اللهِ الْجَدَلِيِّ قَالَ: سَأَلْتُ عَائِشَةَ أُمِّ المؤْمنينَ رَضيَ اللهُ عنها عَنْ خُلُقِ رَسُولِ اللهِ صلى الله عليه وسلم فَقَالَتْ:
لَمْ يَكُنْ فَاحِشًا وَلَا مُتَفَحِّشًا وَلَا صَخَّابًا فِي الْأَسْوَاقِ، وَلَا يَجْزِي بِالسَّيِّئَةِ السَّيِّئَةَ وَلَكِنْ يَعْفُو وَيَصْفَحُ.

అబూ అబ్దుల్లాహ్ అల్ జదలియ్యి రదియల్లాహు అన్హు ఉల్లేఖన, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం స్వభావం, గుణగణాల గురించి ఉమ్ముల్ ముమినీన్ ఆయిషా రదియల్లాహు అన్హును ప్రశ్నించగా, ఆమె ఇలా సమాధానము ఇచ్చినారు:
"ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అసభ్యంగా మాట్లాడేవారు కాదు, అసభ్యంగా ప్రవర్తించేవారు కాదు, సంతల్లో (బజార్లలో) గొడవపడి అరవేవారు కాదు, తనకు చెడు చేసినవారికి చెడుతో ప్రతిస్పందించేవారు కాదు, కానీ ఆయన క్షమించేవారు, మన్నించేవారు."

ప్రామాణికమైన హదీథు అత్తిర్మిదీ మరియు అహ్మద్ నమోదు చేసినారు: సునన్ అత్తిర్మిదీ - 2016

వివరణ

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క స్వభావం గురించి ఉమ్ముల్ ముమినీన్ ఆయిషా (రదియల్లాహు అన్హా) ఇలా చెప్పినారు, "ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వభావంలో అసభ్యత, అశ్లీలత ఉండేది కాదు. ఆయన మాటల్లో, పనుల్లో అసభ్యత, దుర్వినియోగం, ఆడంబరత ఉండేది కాదు. ఆయన ఎన్నడూ అసభ్యంగా ప్రవర్తించడానికి ప్రయత్నించేవారు కాదు. అంతే కాదు, సంతల్లో (బజార్లలో) బిగ్గరగా, గొడవగా అరిచేవారు కాదు. తనకు చెడు చేసినవారికి చెడుతో ప్రతిస్పందించేవారు కాదు; కాని మంచితోనే ప్రతిస్పందించేవారు. తన హృదయంలోనూ క్షమించేవారు, బయట కూడా మన్నించేవారు, అలాంటి (చెడు చేసిన) వారిని పట్టించు కోకుండా దూరంగా ఉండేవారు."

من فوائد الحديث

  1. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉన్నత స్వభావం కలిగి ఉండటం మరియు చెడు నడవడికల నుండి ఆయన దూరంగా ఉండటం అనే విషయం యొక్క వివరణ.
  2. మంచి స్వభావాలను అలవర్చుకోవడంపై ప్రోత్సాహం, చెడు స్వభావాలకు దూరంగా పెట్టాలనే హెచ్చరిక
  3. అశ్లీలమైన మాటలు మరియు చెడ్డ మాటలు మాట్లాడటాన్ని నిందించడం.
  4. ఇస్లాం ధర్మంలో గొంతెత్తి మాట్లాడడం, అరవడం తప్పు
  5. చెడు చేసినవారికి మంచి చేయడం, వారిని క్షమించటం, మన్నించటంపై ప్రోత్సాహం

అనువాదాలను వీక్షించండి

42 భాష
EN English ఇంగ్లీషు
UR اردو ఉర్దూ
ID Indonesia ఇండోనేషియన్
BN বাংলা బెంగాలీ
TR Türkçe టర్కిష్
RU Русский రష్యన్
BS Bosanski బోస్నియన్
SI සිංහල సింహళ
HI हिन्दी హిందీ
ZH 中文 చైనీస్
FA فارسی పర్షియన్
VI Tiếng Việt వియత్నమీస్
TL Tagalog టాగలాగ్
KU Kurdî కుర్దిష్
HA Hausa హౌసా
PT Português పోర్చుగీసు
ML മലയാളം మలయాళం
SW Kiswahili స్వాహిలీ
TA தமிழ் తమిళం
MY မြန်မာ బర్మీస్
TH ไทย థాయ్
PS پښتو పష్టో
AS অসমীয়া అస్సామీ
SQ Shqip అల్బేనియన్
SV Svenska السويدية
AM አማርኛ الأمهرية
NL Nederlands الهولندية
GU ગુજરાતી الغوجاراتية
PRS دری الدرية
SR Српски الصربية
RO Română الرومانية
HU Magyar المجرية
MOS Moore الموري
MG Malagasy Малагашӣ
KN ಕನ್ನಡ Канада
WO Wolof الولوف
UK Українська الأوكرانية
KA ქართული الجورجية
MK Македонски المقدونية
KM ភាសាខ្មែរ الخميرية
PA ਪੰਜਾਬੀ البنجابية
MR मराठी الماراثية