1. హోమ్
  2. కూర్పులు
  3. సద్గుణాలు మరియు పద్దతులు

హదీస్ “నిశ్చయంగా నరకాగ్నిలో అతి తక్కువ శిక్ష అనుభవించే వాడు ఎవరంటే, అతని కాళ్ళకు అగ్నితో చేయబడిన రెండు పాదరక్షలు, మరియు వాటిని కట్టి ఉంచే రెండు పట్టీలు తొడగబడతాయి. అవి అతని మెదడును, కుండలోని పదార్థము తుకతుక ఉడికినట్లు, మరిగేలా చేస్తాయి. అతడు తన కంటే ఘోరమైన శిక్ష మరెవ్వరూ అనుభవిస్తూ ఉండరని అనుకుంటాడు; నిజానికి అతడు అందరి కంటే తక్కువ శిక్ష అనుభవిస్తున్న వాడు అయినప్పటికీ.”

عَنِ النُّعْمَانِ بْنِ بَشِيرٍ رضي الله عنه قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«إِنَّ أَهْوَنَ أَهْلِ النَّارِ عَذَابًا مَنْ لَهُ نَعْلَانِ وَشِرَاكَانِ مِنْ نَارٍ، يَغْلِي مِنْهُمَا دِمَاغُهُ كَمَا يَغْلِ الْمِرْجَلُ، مَا يَرَى أَنَّ أَحَدًا أَشَدُّ مِنْهُ عَذَابًا، وَإِنَّهُ لَأَهْوَنُهُمْ عَذَابًا».

అన్ ను’మాన్ బిన్ బషీర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
“నిశ్చయంగా నరకాగ్నిలో అతి తక్కువ శిక్ష అనుభవించే వాడు ఎవరంటే, అతని కాళ్ళకు అగ్నితో చేయబడిన రెండు పాదరక్షలు, మరియు వాటిని కట్టి ఉంచే రెండు పట్టీలు తొడగబడతాయి. అవి అతని మెదడును, కుండలోని పదార్థము తుకతుక ఉడికినట్లు, మరిగేలా చేస్తాయి. అతడు తన కంటే ఘోరమైన శిక్ష మరెవ్వరూ అనుభవిస్తూ ఉండరని అనుకుంటాడు; నిజానికి అతడు అందరి కంటే తక్కువ శిక్ష అనుభవిస్తున్న వాడు అయినప్పటికీ.”

ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు సహీహ్ ముస్లిం - 213

వివరణ

ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేసినారు: పునరుత్థాన దినమున నరకములో అతి తక్కువ శిక్షను పొందే వ్యక్తికి అగ్నితో చేసిన రెండు పాదరక్షలు, మరియు (వాటిని కట్టి ఉంచే) రెండు పట్టీలు తొడగబడతాయి. వాటి వేడి కారణంగా అతని మెదడు రాగి కుండలో ఉడకబెట్టిన పదార్థం తుకతుక ఉడికినట్టుగా మరుగుతుంది. తన కంటే ఘోరంగా శిక్షించబడుతున్న వారెవ్వరూ అతనికి కనబడరు (తనకంటే ఘోరంగా శిక్షించబడుతున్న వారెవ్వరూ లేరు అని అతడు తలపోస్తాడు), వాస్తవానికి అందరికంటే తక్కువగా శిక్షించబడున్న వ్యక్తి అతడే అయినప్పటికీ. ఇది అతనికి శారీరకంగా శిక్షించడంతో పాటు అతన్ని మానసికంగా శిక్షకు గురిచేస్తుంది.

من فوائد الحديث

  1. ఇందులో నరకంలో విధించబడే ఈ అతి తక్కువ శిక్ష ఎంత భయంకరంగా ఉంటుందో పాపపు పనులకు పాల్బడేవారికి మరియు అవిశ్వాసులకు తెలిసేలా ఒక హెచ్చరిక ఉన్నది; తద్వారా వారు దానికి దారితీసే వాటి నుండి దూరంగా ఉండవచ్చు.
  2. నరకాగ్ని నివాసులు వారి చెడు పనుల ఆధారంగా వివిధ స్థాయిలలో ఉంటారు.
  3. ఇందులో నరకాగ్ని శిక్ష (అది అతి తక్కువ శిక్ష అయినప్పటికీ) ఎంత కఠినంగా, ఎంత భయంకరంగా ఉంటుందో వర్ణించబడినది. అల్లాహ్ మనలను దాని నుండి రక్షించుగాక.

అనువాదాలను వీక్షించండి

49 భాష
EN English ఇంగ్లీషు
UR اردو ఉర్దూ
ES Español స్పానిష్
ID Indonesia ఇండోనేషియన్
BN বাংলা బెంగాలీ
TR Türkçe టర్కిష్
RU Русский రష్యన్
BS Bosanski బోస్నియన్
SI සිංහල సింహళ
HI हिन्दी హిందీ
ZH 中文 చైనీస్
FA فارسی పర్షియన్
VI Tiếng Việt వియత్నమీస్
TL Tagalog టాగలాగ్
KU Kurdî కుర్దిష్
HA Hausa హౌసా
PT Português పోర్చుగీసు
ML മലയാളം మలయాళం
SW Kiswahili స్వాహిలీ
TA தமிழ் తమిళం
MY မြန်မာ బర్మీస్
TH ไทย థాయ్
DE Deutsch జర్మన్
PS پښتو పష్టో
AS অসমীয়া అస్సామీ
SQ Shqip అల్బేనియన్
SV Svenska السويدية
AM አማርኛ الأمهرية
NL Nederlands الهولندية
GU ગુજરાતી الغوجاراتية
NE नेपाली النيبالية
LT Lietuvių الليتوانية
PRS دری الدرية
SR Српски الصربية
TG тоҷикӣ الطاجيكية
RW Kinyarwanda Кинёрвондӣ
RO Română الرومانية
HU Magyar المجرية
MOS Moore الموري
MG Malagasy Малагашӣ
OM Oromoo Урумӣ
KN ಕನ್ನಡ Канада
WO Wolof الولوف
UK Українська الأوكرانية
KA ქართული الجورجية
MK Македонски المقدونية
KM ភាសាខ្មែរ الخميرية
PA ਪੰਜਾਬੀ البنجابية
MR मराठी الماراثية