1. హోమ్
  2. కూర్పులు
  3. హదీసు మరియు దాని శాస్త్రాలు

హదీస్ “జాగ్రత్త! రాబోయే కాలంలో ఒక వ్యక్తికి నా హదీసు చేరుతుంది. అతడు తన పడక మీద జారగిలబడి కూర్చుని ఇలా అంటాడు “మీకూ మాకూ మధ్యన అల్లాహ్ గ్రంథం ఉన్నది

عن المقدام بن معدِيْكَرِب رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم:
«أَلَا هَلْ عَسَى رَجُلٌ يَبْلُغُهُ الْحَدِيثُ عَنِّي وَهُوَ مُتَّكِئٌ عَلَى أَرِيكَتِهِ فَيَقُولُ: بَيْنَنَا وَبَيْنَكُمْ كِتَابُ اللهِ، فَمَا وَجَدْنَا فِيهِ حَلَالًا اسْتَحْلَلْنَاهُ، وَمَا وَجَدْنَا فِيهِ حَرَامًا حَرَّمْنَاهُ، وَإِنَّ مَا حَرَّمَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ كَمَا حَرَّمَ اللهُ».

మిఖ్'దాం బిన్ మ’అదీ కరిబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు :
“జాగ్రత్త! రాబోయే కాలంలో ఒక వ్యక్తికి నా హదీసు చేరుతుంది. అతడు తన పడక మీద జారగిలబడి కూర్చుని ఇలా అంటాడు “మీకూ మాకూ మధ్యన అల్లాహ్ గ్రంథం ఉన్నది. అందులో హలాల్ గా ప్రకటించ బడినదంతా మేము హలాల్ గా భావిస్తాము మరియు అందులో హరాంగా ప్రకటించ బడినదంతా మేము హరాం గా భావిస్తాము”. (ఇంకా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు) “జాగ్రత్త! అల్లాహ్ యొక్క సందేశహరుడు దేనినైతే హరాంగా ప్రకటించినాడో, అది అల్లాహ్ హరాంగా ప్రకటించిన దానితో సమానం”.

ప్రామాణికమైన హదీథు అబూ దావూద్, అత్తిర్మిదీ మరియు ఇబ్నెమాజహ్ నమోదు చేసినారు: సునన్ అత్తిర్మిదీ - 2664

వివరణ

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: సమీప భవిష్యత్తులో ఇలాంటి ఒక కాలం రాబోతున్నది. అందులో – కొంత మంది ప్రజలు కూర్చుని ఉంటారు, ఒకడు తన పడక మీద జారగిలబడి కూర్చుని ఉంటాడు. అతనికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఒక హదీసు తెలియజేయబడుతుంది. దానికి అతడు ఇలా అంటాడు “మీకూ మాకూ మధ్య తీర్పు చెప్పేది ఏదైనా ఉంది అంటే అది ‘అల్ ఖుర్’ఆన్ అల్ కరీం’. అది చాలు మాకు. అందులో మాకు ఆచరించవలసిన విషయాలుగా (హలాల్ విషయాలుగా) కనిపించిన అంతటిపై మేము ఆచరిస్తాము, మరియు అందులో నిషేధించబడిన విషయాలుగా (హరాం విషయాలుగా) కనిపించిన దానినుండి దూరంగా ఉంటాము. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా వివరించినారు – తన సున్నత్’లో తాను నిషేధించిన ఏ విషయమైనా లేదా తాను నిరోధించిన ఏ విషయమైనా, అది అల్లాహ్ తన గ్రంథములో నిషేధిస్తూ ఆదేశించిన దానితో సమానం. ఎందుకంటే ప్రతిదీ తాను తన ప్రభువు నుండే అంద జేస్తున్నాడు గనుక.

من فوائد الحديث

  1. ఇందులో ఖుర్’ఆన్ ను ఏ విధంగానైతే గౌరవిస్తామో మరియు స్వీకరిస్తామో, అదే విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సున్నత్’లను కూడా గౌరవించాలి, స్వీకరించాలి అనే ఉద్బోధ ఉన్నది.
  2. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కు విధేయత చూపడం, అల్లాహ్’కు విధేయత చూపడమవుతుంది, అలాగే ఆయను అవిధేయత చూపడం అల్లాహ్’కు అవిధేయత చూపడమవుతుంది.
  3. ఈ హదీసు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సున్నత్ యొక్క ప్రామాణికతకు సంబంధించి ఒక నిదర్శనం. మరియు ఎవరైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సున్నత్’లను, వారి హదీసులను తోసిపుచ్చుతారో మరియు నిరాకరిస్తారో వారికి ఇందులో ఒక హెచ్చరిక ఉన్నది.
  4. ఎవరైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సున్నత్ ను నిరాకరిస్తారో వారు ‘మురిజున్’ (సందేశాన్ని తిరస్కరించినవారు) గా పరిగణించబడతారు. మరియు ‘మేము ఖుర్’ఆన్ ను అనుసరిస్తున్నాము’ అని వారు చేసే దావా ఒట్టి అబద్ధం.
  5. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రవక్తత్వానికి ఈ హదీసు ఒక నిదర్శనం. ఇందులో ఆయన భవిశ్యత్తులో జరుగబోయే దానిని గురించి చెప్పారు. ఆయన చెప్పిన విధంగానే ఈనాడు జరుగుతున్నది కూడా.

అనువాదాలను వీక్షించండి

69 భాష
EN English ఇంగ్లీషు
UR اردو ఉర్దూ
ES Español స్పానిష్
ID Indonesia ఇండోనేషియన్
UG ئۇيغۇرچە ఉయ్ఘర్
BN বাংলা బెంగాలీ
FR Français ఫ్రెంచ్
TR Türkçe టర్కిష్
RU Русский రష్యన్
BS Bosanski బోస్నియన్
SI සිංහල సింహళ
HI हिन्दी హిందీ
ZH 中文 చైనీస్
FA فارسی పర్షియన్
VI Tiếng Việt వియత్నమీస్
TL Tagalog టాగలాగ్
KU Kurdî కుర్దిష్
HA Hausa హౌసా
PT Português పోర్చుగీసు
ML മലയാളം మలయాళం
SW Kiswahili స్వాహిలీ
TA தமிழ் తమిళం
MY မြန်မာ బర్మీస్
TH ไทย థాయ్
DE Deutsch జర్మన్
JA 日本語 జపనీస్
PS پښتو పష్టో
AS অসমীয়া అస్సామీ
SQ Shqip అల్బేనియన్
SV Svenska السويدية
AM አማርኛ الأمهرية
NL Nederlands الهولندية
GU ગુજરાતી الغوجاراتية
KY Кыргызча Қирғизӣ
NE नेपाली النيبالية
YO Yorùbá Юрба
LT Lietuvių الليتوانية
PRS دری الدرية
SR Српски الصربية
SO Soomaali الصومالية
TG тоҷикӣ الطاجيكية
RW Kinyarwanda Кинёрвондӣ
RO Română الرومانية
HU Magyar المجرية
CS Čeština التشيكية
MOS Moore الموري
MG Malagasy Малагашӣ
FF Fulfulde الفولانية
IT Italiano ఇటాలియన్
OM Oromoo Урумӣ
KN ಕನ್ನಡ Канада
WO Wolof الولوف
BG Български البلغارية
AZ Azərbaycan Озарӣ
EL Ελληνικά اليونانية
UZ O‘zbek الأوزبكية
UK Українська الأوكرانية
KA ქართული الجورجية
LN Lingala اللينجالا
MK Македонски المقدونية
KM ភាសាខ្មែរ الخميرية
BM Bambara البامبارية
PA ਪੰਜਾਬੀ البنجابية
MR मराठी الماراثية
DA Dansk الدنماركية
RN Kirundi الكيروندي
YAO Yao الياو
KMR Kurmancî الكرمنجية
MS Bahasa Melayu الملايو