1. హోమ్
  2. కూర్పులు
  3. సద్గుణాలు మరియు పద్దతులు

హదీస్ “ఎప్పుడైనా, మీలో ఎవరైనా మస్జిదులోనికి ప్రవేశిస్తే అతడు ఇలా పలకాలి “అల్లాహుమ్మఫ్’తహ్ లీ అబ్వాబ రహ్మతిక” (ఓ అల్లాహ్! నా కొరకు నీ కరుణాకటాక్షముల ద్వారములను తెరువుము); అలాగే మస్జిదు నుండి బయటకు వెళ్ళునపుడు అతడు ఇలా పలకాలి “అల్లాహుమ్మ! ఇన్నీ అస్అలుక మిన్ ఫద్’లిక” (ఓ అల్లాహ్! నేను నీ శుభాలలో నుండి నా కొరకు ప్రసాదించమని నిన్ను వేడుకుంటున్నాను).”

عَنْ ‌أَبِي حُمَيْدٍ أَوْ عَنْ ‌أَبِي أُسَيْدٍ قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«إِذَا دَخَلَ أَحَدُكُمُ الْمَسْجِدَ فَلْيَقُلِ: اللَّهُمَّ افْتَحْ لِي أَبْوَابَ رَحْمَتِكَ، وَإِذَا خَرَجَ فَلْيَقُلِ: اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ مِنْ فَضْلِكَ».

అబీ ఉసైద్ ఉల్లేఖించిన హదీసును అబీ హుమైద్ ఇలా తెలిపినారు: “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
“ఎప్పుడైనా, మీలో ఎవరైనా మస్జిదులోనికి ప్రవేశిస్తే అతడు ఇలా పలకాలి “అల్లాహుమ్మఫ్’తహ్ లీ అబ్వాబ రహ్మతిక” (ఓ అల్లాహ్! నా కొరకు నీ కరుణాకటాక్షముల ద్వారములను తెరువుము); అలాగే మస్జిదు నుండి బయటకు వెళ్ళునపుడు అతడు ఇలా పలకాలి “అల్లాహుమ్మ! ఇన్నీ అస్అలుక మిన్ ఫద్’లిక” (ఓ అల్లాహ్! నేను నీ శుభాలలో నుండి నా కొరకు ప్రసాదించమని నిన్ను వేడుకుంటున్నాను).”

ప్రామాణికమైన హదీథు ముస్లిం నమోదు చేసినారు: సహీహ్ ముస్లిం - 713

వివరణ

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మస్జిదులోనికి ప్రవేశించే ముందు పలుకవలసిన దుఆ (అల్లాహుమ్మఫ్’తహ్ లీ అబ్వాబ రహ్మతిక) వైపునకు ముస్లిం సమాజాన్ని మార్గదర్శనం చేస్తున్నారు. అతడు మస్జిదులోనికి ఆరాధన (ఇబాదత్) కొరకు ప్రవేశించడానికి ముందు అతడు తన ప్రభువు యొక్క కరుణ కొరకు దువా చేస్తున్నాడు. అలాగే అతడు మస్జిదు నుండి బయటకు వెళ్ళాలని నిర్ణయించుకున్నపుడు పలుకవలసిన దుఆ (అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుక మిన్ ఫజ్’లిక) వైపునకు మార్గదర్శనం చేస్తున్నారు. ఆ దుఆ పలుకడం ద్వారా అతడు తనకు ధర్మబద్ధమైన ఉపాధి కొరకు, అందులో అల్లాహ్ యొక్క అనుగ్రహాన్ని, దయను, కనికరాన్ని ప్రసాదించమని వేడుకుంటున్నాడు.

من فوائد الحديث

  1. ఈ హదీసులో తెలుపబడిన దుఆలు మస్జిదులోనికి ప్రవేశించునపుడు మరియు మస్జిదు నుండి బయటకు వచ్చునపుడు పలుకుట అభులషణీయము (ముస్తహబ్).
  2. మస్జిదులోనికి ప్రవేశించునపుడు కరుణ కొరకు మరియు బయటకు వచ్చునపుడు అనుగ్రహం మరియు దయ కొరకు వేడుకొనుట ఈ దుఆల యొక్క ప్రత్యేకత: మస్జిదులోనికి ప్రవేశించు వ్యక్తి తన సృష్టికర్తను ఆరాధించుట కొరకు ప్రవేశిస్తాడు. ఆ ఆరాధనలు (ఇబాదత్’లు) అతడిని తన ప్రభువు దగ్గరికి చేరుస్తాయి, ఆయన అతడిని స్వర్గానికి చేరువ చేస్తాడు. కనుక తన ఆరాధనలు స్వీకరించి తనను కరుణించమని ప్రార్థించుట సరియైనదే. అలాగే మస్జిదు నుండి బయటకు వచ్చే వ్యక్తి బయట ప్రపంచములోనికి ప్రవేశిస్తాడు. అందులో అతడు తన ఉపాధి కొరకు కష్టపడి పనిచేయవలసి వస్తుంది. కనుక ధర్మబధ్ధమైన ఉపాధి సంపాదన కొరకు తనను అనుగ్రహించమని, తనపై దయ చూపమని దుఆ చేయడం ఆ సందర్భములో సరియైనదే.
  3. ఆ దుఆలు మస్జిదులోనికి ప్రవేశించునపుడు మరియు మస్జిదు నుండి బయటకు వచ్చునపుడు చేయ వలసి ఉన్నది.

అనువాదాలను వీక్షించండి

60 భాష
EN English ఇంగ్లీషు
UR اردو ఉర్దూ
ES Español స్పానిష్
ID Indonesia ఇండోనేషియన్
UG ئۇيغۇرچە ఉయ్ఘర్
BN বাংলা బెంగాలీ
TR Türkçe టర్కిష్
RU Русский రష్యన్
BS Bosanski బోస్నియన్
SI සිංහල సింహళ
HI हिन्दी హిందీ
ZH 中文 చైనీస్
FA فارسی పర్షియన్
VI Tiếng Việt వియత్నమీస్
TL Tagalog టాగలాగ్
KU Kurdî కుర్దిష్
HA Hausa హౌసా
PT Português పోర్చుగీసు
ML മലയാളം మలయాళం
SW Kiswahili స్వాహిలీ
TA தமிழ் తమిళం
MY မြန်မာ బర్మీస్
TH ไทย థాయ్
DE Deutsch జర్మన్
JA 日本語 జపనీస్
PS پښتو పష్టో
AS অসমীয়া అస్సామీ
SQ Shqip అల్బేనియన్
SV Svenska السويدية
AM አማርኛ الأمهرية
NL Nederlands الهولندية
GU ગુજરાતી الغوجاراتية
KY Кыргызча Қирғизӣ
NE नेपाली النيبالية
YO Yorùbá Юрба
LT Lietuvių الليتوانية
PRS دری الدرية
SR Српски الصربية
SO Soomaali الصومالية
TG тоҷикӣ الطاجيكية
RW Kinyarwanda Кинёрвондӣ
RO Română الرومانية
HU Magyar المجرية
CS Čeština التشيكية
MOS Moore الموري
MG Malagasy Малагашӣ
IT Italiano ఇటాలియన్
OM Oromoo Урумӣ
KN ಕನ್ನಡ Канада
WO Wolof الولوف
AZ Azərbaycan Озарӣ
UZ O‘zbek الأوزبكية
UK Українська الأوكرانية
KA ქართული الجورجية
MK Македонски المقدونية
KM ភាសាខ្មែរ الخميرية
BM Bambara البامبارية
PA ਪੰਜਾਬੀ البنجابية
MR मराठी الماراثية
KMR Kurmancî الكرمنجية