1. హోమ్
  2. కూర్పులు
  3. సద్గుణాలు మరియు పద్దతులు

హదీస్ ఎవరైతే 'నేను అల్లాహ్‌ను నా ప్రభువుగా, ఇస్లాం‌ను నా ధర్మంగా, ముహమ్మద్‌ సల్లల్లాహు అలైహి వసల్లంను నా ప్రవక్తగా స్వీకరించాను' అని పలుకుతారో, వారికి స్వర్గం నిశ్చయం

عَن أَبي سَعِيدٍ الْخُدْرِيِّ رَضِيَ اللَّهُ عَنْهُ أَنَّ رَسُولَ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«مَنْ قَالَ: رَضِيتُ بِاللَّهِ رَبًّا، وَبِالْإِسْلَامِ دِينًا، وَبِمُحَمَّدٍ رَسُولًا، وَجَبَتْ لَهُ الْجَنَّةُ».

అబూ సయీద్ అల్ ఖుద్రీ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
"ఎవరైతే 'నేను అల్లాహ్‌ను నా ప్రభువుగా, ఇస్లాం‌ను నా ధర్మంగా, ముహమ్మద్‌ సల్లల్లాహు అలైహి వసల్లంను నా ప్రవక్తగా స్వీకరించాను' అని పలుకుతారో, వారికి స్వర్గం నిశ్చయం."

ప్రామాణికమైన హదీథు అబూదావూద్ నమోదు చేసినారు: సునన్ అబీదావూద్ - 1529

వివరణ

ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలిపినారు: "ఎవరైతే [నేను అల్లాహ్‌ను - నా ప్రభువుగా, ఆరాధ్యుడిగా, పోషకుడిగా, సర్వాధికారిగా, యజమానిగా, నన్ను సరిదిద్దేవాడిగా మనస్పూర్తిగా (రజా) అంగీకరిస్తున్నాను; ఇస్లాం ధర్మాన్ని — దాని అన్ని ఆజ్ఞలు, నిషేధాలతో సహా — నా ధర్మంగా, నా మార్గంగా, నా విశ్వాసంగా, సంపూర్ణంగా అంగీకరిస్తున్నాను; అలాగే ముహమ్మద్‌ సల్లల్లాహు అలైహి వసల్లంను నా ప్రవక్తగా, సందేశహరుడిగా, ఆయన తెచ్చిన ప్రతీ విషయాన్ని, ప్రకటించిన ప్రతీ సందేశాన్ని సంపూర్ణంగా అంగీకరిస్తున్నాను'] అని హృదయపూర్వకంగా ఒప్పుకుంటారో, అతనికి తప్పకుండా స్వర్గం లభిస్తుంది."

من فوائد الحديث

  1. ఇందులో ఈ దుఆ పలకమని ప్రజలను ప్రోత్సహించడం మరియు దాని ఫలితంగా వచ్చే ప్రతిఫలాన్ని వివరించడం జరిగింది.
  2. అల్లాహ్ ను ప్రభువుగా భావించి సంతృప్తి చెందడం అంటే ఆయనను తప్ప మరెవ్వరినీ ఆరాధించకూడదు, ఆయన పరమ పవిత్రుడు.
  3. ఒక ప్రవక్తగా మరియు సందేశహరుడిగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల సంతృప్తి చెందడం అంటే ఆయనకు విధేయత చూపడం, అల్లాహ్ ఆయనను ఆశీర్వదించాలని దరూద్ పంపడం ద్వారా ఆయన కొరకు దుఆ చేయడం మరియు ఆయన సున్నతులకు విధేయత చూపడం.
  4. ఇస్లాంను ఒక ధర్మంగా స్వీకరించడం అంటే అల్లాహ్ తన దాసుల కోసం ఎంపిక చేసిన దానిని స్వీకరించడం.
  5. ఇతర హదీథులలో ప్రస్తావించబడినట్లుగా, అదాన్ పిలుపు విన్న తర్వాత విశ్వాసం యొక్క రెండు సాక్ష్యాలను పలికి, ఈ ప్రార్థన కూడా చేయాలని సిఫార్సు చేయబడింది.
  6. ఈ ప్రార్థనను ఉదయం మరియు సాయంత్రం పలకడం యొక్క ఆవశ్యకతను మరొక హదీథు పేర్కొన్నది.

అనువాదాలను వీక్షించండి

40 భాష
EN English ఇంగ్లీషు
ID Indonesia ఇండోనేషియన్
BN বাংলা బెంగాలీ
TR Türkçe టర్కిష్
RU Русский రష్యన్
BS Bosanski బోస్నియన్
SI සිංහල సింహళ
ZH 中文 చైనీస్
FA فارسی పర్షియన్
VI Tiếng Việt వియత్నమీస్
TL Tagalog టాగలాగ్
KU Kurdî కుర్దిష్
HA Hausa హౌసా
PT Português పోర్చుగీసు
ML മലയാളം మలయాళం
SW Kiswahili స్వాహిలీ
TA தமிழ் తమిళం
MY မြန်မာ బర్మీస్
TH ไทย థాయ్
PS پښتو పష్టో
AS অসমীয়া అస్సామీ
SQ Shqip అల్బేనియన్
SV Svenska السويدية
AM አማርኛ الأمهرية
NL Nederlands الهولندية
GU ગુજરાતી الغوجاراتية
PRS دری الدرية
SR Српски الصربية
RO Română الرومانية
HU Magyar المجرية
MOS Moore الموري
MG Malagasy Малагашӣ
KN ಕನ್ನಡ Канада
WO Wolof الولوف
UK Українська الأوكرانية
KA ქართული الجورجية
MK Македонски المقدونية
KM ភាសាខ្មែរ الخميرية
PA ਪੰਜਾਬੀ البنجابية
MR मराठी الماراثية