1. హోమ్
  2. కూర్పులు
  3. ఫిఖ్ మరియు దాని నియమాలు

హదీస్ “సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఇలా అన్నాడు: మూడు రకాల వ్యక్తులతో ప్రళయదినాన నేను స్వయంగా గొడవ పడతాను

عَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ اللَّهُ عَنْهُ عَنِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«قَالَ اللَّهُ تَعَالَى: ثَلاَثَةٌ أَنَا خَصْمُهُمْ يَوْمَ القِيَامَةِ: رَجُلٌ أَعْطَى بِي ثُمَّ غَدَرَ، وَرَجُلٌ بَاعَ حُرًّا فَأَكَلَ ثَمَنَهُ، وَرَجُلٌ اسْتَأْجَرَ أَجِيرًا فَاسْتَوْفَى مِنْهُ وَلَمْ يُعْطِهِ أَجْرَهُ».

అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
“సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఇలా అన్నాడు: మూడు రకాల వ్యక్తులతో ప్రళయదినాన నేను స్వయంగా గొడవ పడతాను: ఒకడు నా పేరు మీద వాగ్దానం చేసి మోసం చేసినవాడు, మరొకడు స్వేచ్ఛాపరుణ్ణి అమ్మి ఆ డబ్బు తిన్నవాడు మరియు ఇంకొకడు ఒక మనిషిని కూలికి పెట్టుకొని అతనితో బాగా పని చేయించుకుని కూలి ఇవ్వకుండా ఎగవేసినవాడు.”

ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ నమోదు చేసినారు: సహీహ్ అల్ బుఖారీ - 2270

వివరణ

మహోన్నతుడైన అల్లాహ్ సెలవిచ్చాడని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు: (అల్లాహ్ పలుకులు) "పునరుత్థాన దినమున నేను మూడు రకాల వ్యక్తులకు విరోధిగా ఉంటాను మరియు నేను ఎవరికైతే విరోధిగా ఉంటానో, అతనిని ఓడించివేస్తాను": మొదటిది: ఎవరైతే అల్లాహ్ పై ప్రమాణం చేసి, ఒడంబడిక చేసుకుని, ఆ తర్వాత దానిని ఉల్లంఘించి ద్రోహం చేస్తాడో. రెండవవాడు: ఒక స్వతంత్రుడైన వ్యక్తిని బానిసగా అమ్మి, ఆ సొమ్మును తిని, దాని విలువను వాడుకున్నవాడు. మూడవది: ఒక మనిషిని కూలికి పెట్టుకుని, అతనితో పూర్తిగా పని చేయించుకుని, అతనికి కూలి ఇవ్వనివాడు.

من فوائد الحديث

  1. ఈ హదీథు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన ప్రభువు నుండి ఉల్లేఖించిన హదీథులలో ఒకటి, దీనిని ‘హదీథ్ అల్-ఖుద్సీ’ లేదా ‘దైవప్రేరితమైన హదీథ్’ అని పిలుస్తారు. దీనిలోని పదాలు మరియు అర్థం అల్లాహ్ తరఫు నుండే ఉంటాయి. అయినప్పటికీ, దీనికి ఖుర్’ఆన్ కు ఉన్న ప్రత్యేక లక్షణాలు ఉండవు. ఉదాహరణకు, ఖుర్’ఆన్ పారాయణం ఒక ఆరాధనగా పరిగణించబడుతుంది, దానిని పఠించడానికి శారీరక శుద్ధి (ఉదూ) తప్పనిసరి, అది మానవాళికి ఒక సవాలు, మరియు దానిలో అద్భుతత్వం ఉంది. ఇటువంటి ప్రత్యేకతలు మరియు ఇతరాలు హదీథ్ అల్-ఖుద్సీలో ఉండవు.
  2. అల్ సిందీ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: ఈ ముగ్గురి ప్రస్తావన కేవలం వీరిని ప్రత్యేకించడానికే కాదు, అయితే వారి విషయంలో తీవ్రతను తెలియజేయడానికే. ఎందుకంటే మహోన్నతుడైన అల్లాహ్ అన్యాయస్థులందరికీ విరోధి.
  3. ఇబ్న్ అల్-జౌజీ అన్నారు: స్వతంత్రుడు అల్లాహ్ దాసుడు, కనుక అతనిపై అపరాధం చేసినవాడికి, అతని యజమాని అయిన అల్లాహ్ యే ప్రత్యర్థి.
  4. స్వతంత్రుడిని బానిసగా చేసుకోవడం అనేది రెండు విధాలుగా జరుగుతుంది: ఒకటి, అతనికి విముక్తి ప్రసాదించి, ఆ తర్వాత ఆ విషయాన్ని దాచిపెట్టడం లేదా తిరస్కరించడం. రెండవది, విముక్తి ప్రసాదించిన తర్వాత అతనితో బలవంతంగా దాస్యం చేయించుకోవడం. ఈ రెండింటిలో మొదటిది అత్యంత తీవ్రమైనది. అయితే ఈ అధ్యాయంలోని హదీథు మరింత తీవ్రమైనది; ఎందుకనగా అందులో విముక్తిని దాచిపెట్టడం లేదా తిరస్కరించడంతో పాటు, దాని పర్యవసానంగా అతనిని అమ్మివేయడం మరియు ఆ డబ్బును వినియోగించడం కూడా ఉంది. అందుకే దీనిపై హెచ్చరిక మరింత తీవ్రంగా ఉంది.

అనువాదాలను వీక్షించండి

29 భాష
EN English ఇంగ్లీషు
UR اردو ఉర్దూ
ID Indonesia ఇండోనేషియన్
BN বাংলা బెంగాలీ
TR Türkçe టర్కిష్
RU Русский రష్యన్
BS Bosanski బోస్నియన్
SI සිංහල సింహళ
HI हिन्दी హిందీ
VI Tiếng Việt వియత్నమీస్
TL Tagalog టాగలాగ్
KU Kurdî కుర్దిష్
HA Hausa హౌసా
PT Português పోర్చుగీసు
ML മലയാളം మలయాళం
SW Kiswahili స్వాహిలీ
TH ไทย థాయ్
AS অসমীয়া అస్సామీ
NL Nederlands الهولندية
GU ગુજરાતી الغوجاراتية
PRS دری الدرية
SR Српски الصربية
HU Magyar المجرية
KN ಕನ್ನಡ Канада
KA ქართული الجورجية
MK Македонски المقدونية
KM ភាសាខ្មែរ الخميرية
PA ਪੰਜਾਬੀ البنجابية
MR मराठी الماراثية