1. హోమ్
  2. కూర్పులు
  3. ఫిఖ్ మరియు దాని నియమాలు

హదీస్ “మీసాలను కత్తిరించడం, గోళ్ళు కత్తిరించడం, చంకలలోని వెంట్రుకలు తీయడం మరియు నాభి క్రింది భాగములోని వెంట్రుకలు (జఘన వెంట్రుకలు) గీసుకోవడం గురించి మాకు ఒక సమయ పరిమితి విధించబడింది - మేము వాటిని నలభై రాత్రులకు మించి వదిలివేయరాదు.”

عَنْ أَنَسِ بْنِ مَالِكٍ رَضيَ اللهُ عنهُ قَالَ:
وُقِّتَ لَنَا فِي قَصِّ الشَّارِبِ، وَتَقْلِيمِ الْأَظْفَارِ، وَنَتْفِ الْإِبِطِ، وَحَلْقِ الْعَانَةِ، أَلَّا نَتْرُكَ أَكْثَرَ مِنْ أَرْبَعِينَ لَيْلَةً.

అనస్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) ఇలా ఉల్లేఖిస్తున్నారు:
“మీసాలను కత్తిరించడం, గోళ్ళు కత్తిరించడం, చంకలలోని వెంట్రుకలు తీయడం మరియు నాభి క్రింది భాగములోని వెంట్రుకలు (జఘన వెంట్రుకలు) గీసుకోవడం గురించి మాకు ఒక సమయ పరిమితి విధించబడింది - మేము వాటిని నలభై రాత్రులకు మించి వదిలివేయరాదు.”

ప్రామాణికమైన హదీథు ముస్లిం నమోదు చేసినారు: సహీహ్ ముస్లిం - 258

వివరణ

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) – మీసాలు కత్తిరించుకోవడానికి, చేతి మరియు కాలి వేళ్ళ గోళ్ళు కత్తిరించుకోవడానికి, చంకల క్రింది వెంట్రుకలు తీసివేయడానికి మరియు నాభి క్రింది భాగములోని వెంట్రుకలను (జఘన వెంట్రుకలను) తొలగించుకోవడానికి – ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) 40 దినముల కాలపరిమితిని విధించారు అని ఈ హదీథు ద్వారా మనకు తెలుస్తున్నది.

من فوائد الحديث

  1. ఇమాం షౌకానీ ఇలా అన్నారు: పైన తెలిపిన పనులు (మీసాలు కత్తిరించుకోవడం మొదలైనవి) రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) నిర్దేశించిన నలభై రోజుల గడువు లోపు జరగాలి అనే అభిప్రాయం ధర్మ పండితుల నడుమ ప్రాధాన్యత కలిగిన అభిప్రాయము. అయితే వెంట్రుకలు, గోళ్ళు మొదలైనవి పెరిగిన తరువాత వాటిని కత్తిరించకుండా, తొలగించకుండా ఎవరైనా ఆలాగే ఉంచినట్లైతే, ఆ విధించిన కాలపరిమితి దాటనంత వరకు అతడు సున్నత్’ను వ్యతిరేకిస్తున్నవాడిగా పరిగణించబడడు.
  2. ఇబ్నె హుబైరా ఇలా అన్నారు: ఈ హదీథ్ ఈ విషయాలను ఆలస్యం చేయడానికి విధించబడిన గరిష్ట పరిమితిని సూచిస్తుంది. ఈ పరిమితిని చేరుకునే ముందుగానే ఈ విషయాలను గమనించి వాటిపట్ల శ్రధ్ధ వహించడం మంచిది.
  3. ఇస్లాం పరిశుభ్రత, శుద్ధీకరణ మరియు సౌందర్యంగా ఉండడాన్ని నొక్కి చెబుతుంది.
  4. మీసాలను కత్తిరించడం అనేది పై పెదవిపై పెరిగే కొన్ని వెంట్రుకలను తొలగించడం ద్వారా జరుగుతుంది.
  5. చంక వెంట్రుకలను తీయడం అంటే అక్కడ పెరిగే వెంట్రుకలను తొలగించడం, ఇది చేయిని భుజానికి కలిపే కీలు కింద ఉన్న ప్రాంతం.
  6. ‘జఘన వెంట్రుకలను తొలగించడం’ అంటే, స్త్రీలు మరియు పురుషులకు వారి మర్మాంగాల చుట్టూ పెరిగే ముతకగా ఉండే వెంట్రుకలను తొలగించడం.

అనువాదాలను వీక్షించండి

35 భాష
EN English ఇంగ్లీషు
ID Indonesia ఇండోనేషియన్
BN বাংলা బెంగాలీ
TR Türkçe టర్కిష్
BS Bosanski బోస్నియన్
SI සිංහල సింహళ
HI हिन्दी హిందీ
FA فارسی పర్షియన్
VI Tiếng Việt వియత్నమీస్
TL Tagalog టాగలాగ్
KU Kurdî కుర్దిష్
HA Hausa హౌసా
PT Português పోర్చుగీసు
ML മലയാളം మలయాళం
SW Kiswahili స్వాహిలీ
MY မြန်မာ బర్మీస్
TH ไทย థాయ్
PS پښتو పష్టో
AS অসমীয়া అస్సామీ
SQ Shqip అల్బేనియన్
AM አማርኛ الأمهرية
NL Nederlands الهولندية
GU ગુજરાતી الغوجاراتية
PRS دری الدرية
SR Српски الصربية
RO Română الرومانية
HU Magyar المجرية
MOS Moore الموري
KN ಕನ್ನಡ Канада
UK Українська الأوكرانية
KA ქართული الجورجية
MK Македонски المقدونية
KM ភាសាខ្មែរ الخميرية
PA ਪੰਜਾਬੀ البنجابية
MR मराठी الماراثية