1. హోమ్
  2. కూర్పులు
  3. ఫిఖ్ మరియు దాని నియమాలు

హదీస్ నేను మీకు ఉపవాసం, నమాజు మరియు దానధర్మాల స్థాయి కంటే ఉత్తమమైన దాని గురించి తెలియజేయనా?

عَنْ أَبِي الدَّرْدَاءِ رَضِيَ اللَّهُ عَنْهُ قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ:
«أَلاَ أُخْبِرُكُمْ بِأَفْضَلَ مِنْ دَرَجَةِ الصِّيَامِ وَالصَّلاَةِ وَالصَّدَقَةِ؟» قَالُوا: بَلَى، قَالَ: «صَلاَحُ ذَاتِ البَيْنِ، فَإِنَّ فَسَادَ ذَاتِ البَيْنِ هِيَ الحَالِقَةُ».

అబూ ద్’దర్దా రదియల్లాహు అన్హు ఉల్లేఖన: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
«నేను మీకు ఉపవాసం, నమాజు మరియు దానధర్మాల స్థాయి కంటే ఉత్తమమైన దాని గురించి తెలియజేయనా?» వారు, “తప్పకుండా తెలియజేయండి” అన్నారు. అపుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: «పరస్పర సంబంధాలను చక్కదిద్దడం, ఎందుకంటే పరస్పర సంబంధాలు చెడిపోవడమే వినాశము».

ప్రామాణికమైన హదీథు అబూదావూద్ మరియు అత్తిర్మిదీ నమోదు చేసినారు: సునన్ అత్తిర్మిదీ - 2509

వివరణ

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సహాబాలను ఇలా ప్రశ్నించారు: నఫిల్ ఉపవాసాలు, నమాజులు మరియు దానధర్మాలను అధికంగా ఆచరించడం కంటే ఎక్కువ పుణ్యప్రదమైన దాని గురించి మీకు తెలియజేయనా? వారు, ‘తప్పకుండా’ అని అన్నారు. అప్పు ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: వివాదంలో ఉన్న వారి మధ్య సయోధ్య (అవసరం), ఎందుకంటే వివాదం ప్రజల మధ్య విభజన, అపరిచిత్వం, పరస్పర ద్వేషం మరియు పరస్పర విముఖతను కలిగిస్తుంది. నిశ్చయంగా, పరస్పర సంబంధాలు చెడిపోవడం వల్ల కలిగే ద్వేషం ఒకలాంటి గుణం, అది కత్తి వెంట్రుకలను ఎలాగైతే సమూలంగా కత్తిరించి వేస్తుందో, అదే విధంగా ధర్మాన్ని మరియు ప్రాపంచిక జీవితాన్ని నాశనం చేసి సమూలంగా పెరికివేస్తుంది.

من فوائد الحديث

  1. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తానే ముందుగా సహాబాలను ప్రశ్నించి, వారిలో సమాధానం తెలుసుకోవాలనే ఆసక్తిని కలిగించేవారు.
  2. అత్తయ్యిబ్ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: ప్రజల మధ్య సయోధ్య కుదర్చడానికి మరియు దానిని పాడుచేయకుండా ఉండడానికి ప్రోత్సాహం మరియు ప్రేరణ ఇవ్వబడింది; ఎందుకంటే సయోధ్య అనేది అల్లాహ్ యొక్క తాడును గట్టిగా పట్టుకోవడానికి మరియు ముస్లింల మధ్య విభేదాలు లేకుండా ఉండడానికి ఒక కారణం. సంబంధాలు చెడిపోవడం ధర్మంలో ఒక లోటు. కాబట్టి ఎవరైతే దానిని సంస్కరించి, దానిలోని చెడును తొలగిస్తారో, అతను కేవలం తన వ్యక్తిగత ఆరాధనలతో నిమగ్నమై ఉండే ఉపవాసి, (రాత్రి) నమాజులు కూడా చేసేవాని కంటే ఉన్నతమైన స్థాయిని పొందుతాడు.

అనువాదాలను వీక్షించండి

29 భాష
EN English ఇంగ్లీషు
UR اردو ఉర్దూ
ID Indonesia ఇండోనేషియన్
BN বাংলা బెంగాలీ
TR Türkçe టర్కిష్
RU Русский రష్యన్
BS Bosanski బోస్నియన్
SI සිංහල సింహళ
HI हिन्दी హిందీ
VI Tiếng Việt వియత్నమీస్
TL Tagalog టాగలాగ్
KU Kurdî కుర్దిష్
HA Hausa హౌసా
PT Português పోర్చుగీసు
ML മലയാളം మలయాళం
SW Kiswahili స్వాహిలీ
TH ไทย థాయ్
AS অসমীয়া అస్సామీ
NL Nederlands الهولندية
GU ગુજરાતી الغوجاراتية
PRS دری الدرية
SR Српски الصربية
HU Magyar المجرية
KN ಕನ್ನಡ Канада
KA ქართული الجورجية
MK Македонски المقدونية
KM ភាសាខ្មែរ الخميرية
PA ਪੰਜਾਬੀ البنجابية
MR मराठी الماراثية