1. హోమ్
  2. కూర్పులు
  3. పవిత్ర ఖుర్ఆన్ మరియు దాని శాస్త్రాలు

హదీస్ “ఖుర్ఆన్ పారాయణంలో ప్రావీణ్యం కలిగిన వ్యక్తి, దైవదూతలలో గొప్పవారైన, ఉన్నతులైన మరియు విధేయులైన లేఖరుల సాంగత్యములో ఉంటాడు; మరియు ఎవరైతే ఖుర్ఆన్ ను తడబడుతూ, పారాయణం అతనికి కష్టంగా అనిపించినా ఖుర్ఆన్ పారాయణం చేసే వ్యక్తికి రెండు ప్రతిఫలాలు లభిస్తాయి.”

عَنْ عَائِشَةَ رضي الله عنها قَالَتْ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«الْمَاهِرُ بِالْقُرْآنِ مَعَ السَّفَرَةِ الْكِرَامِ الْبَرَرَةِ، وَالَّذِي يَقْرَأُ الْقُرْآنَ وَيَتَتَعْتَعُ فِيهِ، وَهُوَ عَلَيْهِ شَاقٌّ، لَهُ أَجْرَانِ».

ఆయిషా (రదియల్లాహు అన్హా) ఉల్లేఖన: “రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలికినారు:
“ఖుర్ఆన్ పారాయణంలో ప్రావీణ్యం కలిగిన వ్యక్తి, దైవదూతలలో గొప్పవారైన, ఉన్నతులైన మరియు విధేయులైన లేఖరుల సాంగత్యములో ఉంటాడు; మరియు ఎవరైతే ఖుర్ఆన్ ను తడబడుతూ, పారాయణం అతనికి కష్టంగా అనిపించినా ఖుర్ఆన్ పారాయణం చేసే వ్యక్తికి రెండు ప్రతిఫలాలు లభిస్తాయి.”

ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు సహీహ్ ముస్లిం - 798

వివరణ

ఈ హదీథులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియజేస్తున్నారు: ఎవరైతే ఖుర్ఆన్ పఠనం చేసి, దానిని బాగా కంఠస్థం చేసి, దానిని పఠించడంలో ప్రావీణ్యత మరియు నైపుణ్యం సంపాదించిన వ్యక్తికి పరలోకంలో ప్రతిఫలం లభిస్తుంది, అతనికి గొప్ప హోదా లభిస్తుంది, మరియు అతడు సద్గుణవంతులైన దైవదూతలతో ఉంటాడు, అలాగే ఎవరైతే తన బలహీన ఙ్ఞాపక శక్తి కారణంగా ఖుర్ఆన్ ను సంకోచిస్తూ, తడబడుతూ, పఠిస్తాడో; అతనికి కష్టంగా ఉన్నప్పటికీ, దానిని పారాయణం చేస్తాడో, అతనికి రెండు బహుమతులు ఉన్నాయి. ఒకటి పారాయణం చేసినందుకు ప్రతిఫలం, రెండు దానిని పఠించడంలో అతని ప్రయత్నానికి, సంకోచానికి, తడబాటుకు ప్రతిఫలం.

من فوائد الحديث

  1. ఈ హదీథులో ఖుర్ఆన్ కంఠస్థం చేయమని, దానిపై పట్టు సాధించమని మరియు ప్రతిఫలం పొందడానికి దానిని తరచుగా పఠించమని ప్రజలను ప్రోత్సహించడం మరియు అలా చేసే వారి ఉన్నత స్థితిని వివరించడం చూస్తాము.
  2. అల్ ఖాదీ ఇయాద్ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: “దీని అర్థం ఎవరైతే సంకోచిస్తూ, తడబడుతూ ఖుర్’ఆన్ పారాయణం చేస్తాడో, అతడు ఖుర్’ఆన్ పారాయణములో ప్రావీణ్యము కలిగిన వానికంటే గొప్ప బహుమతిని పొందుతాడు అని కాదు. నిజానికి ఖుర్’ఆన్ పారాయణములో ప్రావీణ్యము కలిగిన వ్యక్తే గొప్ప ప్రతిఫలాన్ని పొందుతాడు. ఎందుకంటే అతడు దైవదూతలలో (అల్లాహ్ ఆఙ్ఞలను వ్రాసే) లేఖరుల సాంగత్యములో ఉంటాడు; అటువంటి ఇంకా అనేకమైన గొప్ప బహుమానాలు పొందుతాడు. ఈ ఘనతలు ఇంకెవరి గురించీ పేర్కొనబడలేదు. అల్లాహ్ గ్రంథానికి తనను తాను అంకితం చేసుకొనని, దానిని కంఠస్థం చేయని, దానిపై ప్రావీణ్యం సంపాదించని, దానిని తరచుగా పఠించని, మరియు దానిలో ప్రావీణ్యం పొందే వరకు శ్రద్ధతో దానిని అధ్యయనం చేయని వ్యక్తి, ఇవన్నీ చేసిన వ్యక్తి కంటే ఎక్కువ ప్రతిఫలాన్ని ఎలా పొందగలడు?
  3. షేఖ్ ఇబ్నె బాజ్ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: "ఖుర్ఆన్ పారాయణం చేసి దానిలో ప్రావీణ్యం సంపాదించి, దానిని బాగా పఠించి, దానిని బాగా కంఠస్థం చేసేవాడు దైవదూతలలో గొప్ప మరియు నీతిమంతులైన లేఖరులతో ఉంటాడు." దీని అర్థం: దానిని పఠించడం మాత్రమే కాకుండా, అతని పఠనం మాటలలోనూ, చేతలలోనూ ప్రతిబింబిస్తూ, దానిని అద్భుతంగా పారాయణం చేస్తూ, మరియు దాని ప్రకారం నడుచుకుంటూ ఉన్నట్లైతే – అతడు దాని పదాలను మరియు వాటి అర్థాన్ని నెరవేరుస్తున్నాడు.

అనువాదాలను వీక్షించండి

39 భాష
EN English ఇంగ్లీషు
UR اردو ఉర్దూ
ES Español స్పానిష్
ID Indonesia ఇండోనేషియన్
BN বাংলা బెంగాలీ
TR Türkçe టర్కిష్
RU Русский రష్యన్
BS Bosanski బోస్నియన్
SI සිංහල సింహళ
HI हिन्दी హిందీ
ZH 中文 చైనీస్
FA فارسی పర్షియన్
VI Tiếng Việt వియత్నమీస్
TL Tagalog టాగలాగ్
KU Kurdî కుర్దిష్
HA Hausa హౌసా
PT Português పోర్చుగీసు
ML മലയാളം మలయాళం
SW Kiswahili స్వాహిలీ
MY မြန်မာ బర్మీస్
TH ไทย థాయ్
PS پښتو పష్టో
AS অসমীয়া అస్సామీ
SQ Shqip అల్బేనియన్
AM አማርኛ الأمهرية
NL Nederlands الهولندية
GU ગુજરાતી الغوجاراتية
PRS دری الدرية
SR Српски الصربية
RO Română الرومانية
HU Magyar المجرية
MOS Moore الموري
KN ಕನ್ನಡ Канада
UK Українська الأوكرانية
KA ქართული الجورجية
MK Македонски المقدونية
KM ភាសាខ្មែរ الخميرية
PA ਪੰਜਾਬੀ البنجابية
MR मराठी الماراثية