1. హోమ్
  2. కూర్పులు
  3. సద్గుణాలు మరియు పద్దతులు

హదీస్ “సౌమ్యత కోల్పోయినవాడు మొత్తం మంచితనాన్ని, శుభాన్ని కోల్పోయాడు.”

عَنْ جَرِيرٍ رضي الله عنه عَنِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«مَنْ يُحْرَمِ الرِّفْقَ يُحْرَمِ الْخَيْرَ».

జరీర్ ఇబ్న్ అబ్దుల్లాహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం : ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
“సౌమ్యత కోల్పోయినవాడు మొత్తం మంచితనాన్ని, శుభాన్ని కోల్పోయాడు.”

ప్రామాణికమైన హదీథు ముస్లిం నమోదు చేసినారు: సహీహ్ ముస్లిం - 2592

వివరణ

దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియ జేస్తున్నారు: "ఎవరైతే సున్నితత్వాన్ని కోల్పోతాడో, ధార్మిక జీవితంలోనూ, ఈ ప్రాపంచిక జీవితంలోనూ విజయం సాధించలేడు – అది తన స్వయం కొరకు చేసే పనుల్లో అయినా సరే, ఇతరులతో కలిసి చేసే పనుల్లోనైనా సరే, లేక ఇతరుల కొరకు చేసే పనుల్లోనైనాసరే. అలాంటి వ్యక్తికి ఎలాంటి మేలు లభించదు.

من فوائد الحديث

  1. ఈ హదీథులో సున్నితత్వం, సౌమ్యత యొక్క ఘనత మరియు దానిని కలిగి ఉండాలనే హితబోధ మరియు ప్రోత్సాహం, మరియు హింసను ఖండించడం ఉన్నాయి.
  2. సౌమ్యత కలిగి ఉండడం అనేది రెండు లోకముల జీవితం (ఇహలోక జీవితం, పరలోక జీవితం) కొరకు ఉత్తమమైనది. మరియు అది ఆయా లోకముల విషయాలను విస్తృతం చేస్తుంది. దీనికి సరిగ్గా వ్యతిరేకం ఆవేశము, హింస.
  3. వ్యక్తిత్వంలో సౌమ్యత అనేది మంచి స్వభావం, శాంతి మరియు భద్రతల నుండి వస్తుంది; అలాగే వ్యక్తిత్వములో హింస, దౌర్జన్యము మొదలైన లక్షణాలు కోపం మరియు మొరటుతనం నుండి వస్తాయి. అందుకనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సౌమ్యతను ప్రశంసించారు మరియు వారు దానిలో అత్యున్నత స్థాయిలో ఉన్నారు.
  4. సుఫ్యాన్ అల్-థౌరీ (రహిమహుల్లాహ్) తన సహచరులతో ఇలా అన్నారు: “సౌమ్యత అంటే ఏమిటో మీకు తెలుసా? వస్తువులను మరియు విషయాలను వాటి యొక్క ఉచిత స్థానాల్లో ఉంచడం, కాఠిన్యాన్ని దాని ఉచితమైన స్థానంలో ఉంచడం, సౌమ్యతను దాని ఉచితమైన స్థానంలో ఉంచడం, ఖడ్గాన్ని దాని ఉచితమైన స్థానంలో ఉంచడం (ఉపయోగించడం), కొరడాను దాని ఉచితమైన స్థానంలో ఉంచడం (ఉపయోగించడం).”

అనువాదాలను వీక్షించండి

52 భాష
EN English ఇంగ్లీషు
UR اردو ఉర్దూ
ES Español స్పానిష్
ID Indonesia ఇండోనేషియన్
BN বাংলা బెంగాలీ
TR Türkçe టర్కిష్
RU Русский రష్యన్
BS Bosanski బోస్నియన్
SI සිංහල సింహళ
HI हिन्दी హిందీ
ZH 中文 చైనీస్
FA فارسی పర్షియన్
VI Tiếng Việt వియత్నమీస్
TL Tagalog టాగలాగ్
KU Kurdî కుర్దిష్
HA Hausa హౌసా
PT Português పోర్చుగీసు
ML മലയാളം మలయాళం
SW Kiswahili స్వాహిలీ
TA தமிழ் తమిళం
MY မြန်မာ బర్మీస్
TH ไทย థాయ్
DE Deutsch జర్మన్
PS پښتو పష్టో
AS অসমীয়া అస్సామీ
SQ Shqip అల్బేనియన్
SV Svenska السويدية
AM አማርኛ الأمهرية
NL Nederlands الهولندية
GU ગુજરાતી الغوجاراتية
KY Кыргызча Қирғизӣ
NE नेपाली النيبالية
LT Lietuvių الليتوانية
PRS دری الدرية
SR Српски الصربية
TG тоҷикӣ الطاجيكية
RW Kinyarwanda Кинёрвондӣ
RO Română الرومانية
HU Magyar المجرية
CS Čeština التشيكية
MOS Moore الموري
MG Malagasy Малагашӣ
OM Oromoo Урумӣ
KN ಕನ್ನಡ Канада
WO Wolof الولوف
AZ Azərbaycan Озарӣ
UK Українська الأوكرانية
KA ქართული الجورجية
MK Македонски المقدونية
KM ភាសាខ្មែរ الخميرية
PA ਪੰਜਾਬੀ البنجابية
MR मराठी الماراثية