1. హోమ్
  2. కూర్పులు
  3. ఫిఖ్ మరియు దాని నియమాలు

హదీస్ పది (రమదాన్ చివరి పది రాత్రులు) ప్రారంభమైనప్పుడు, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం రాత్రిని మేల్కొని గడిపేవారు, తన కుటుంబాన్ని కూడా లేపేవారు, తాను మరింత ఎక్కువగా (ఆరాధనలలో) శ్రమించేవారు, మరియు తన నడుము బిగించేవారు (అర్థం: పూర్తిగా ధ్యానం, ఆరాధనలలో నిమగ్నమయ్యేవారు)

عَنْ عَائِشَةَ أُمِّ المُؤْمِنينَ رَضِيَ اللهُ عَنْهَا قَالَتْ:
كَانَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ إِذَا دَخَلَ الْعَشْرُ أَحْيَا اللَّيْلَ، وَأَيْقَظَ أَهْلَهُ، وَجَدَّ وَشَدَّ الْمِئْزَرَ.

ఉమ్ముల్ ముమినీన్ ఆయిషా రదియల్లాహు అన్హా ఉల్లేఖన:
పది (రమదాన్ చివరి పది రాత్రులు) ప్రారంభమైనప్పుడు, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం రాత్రిని మేల్కొని గడిపేవారు, తన కుటుంబాన్ని కూడా లేపేవారు, తాను మరింత ఎక్కువగా (ఆరాధనలలో) శ్రమించేవారు, మరియు తన నడుము బిగించేవారు (అర్థం: పూర్తిగా ధ్యానం, ఆరాధనలలో నిమగ్నమయ్యేవారు).

ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు సహీహ్ ముస్లిం - 1174

వివరణ

రమదాన్ చివరి పది రోజులు ప్రారంభమైనప్పుడు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రాత్రంతా అనేక విధాలుగా అల్లాహ్‌కు విధేయత చూపుతూ గడిపేవారు. ఆయన తన కుటుంబాన్ని కూడా లేపి నమాజు చేయించేవారు. సాధారణంగా చేసే ఆరాధనల కంటే మరింతగా ఎక్కువగా శ్రమించేవారు. తాను పూర్తిగా ఆరాధనలలో నిమగ్నమై, తన భార్యలతో సన్నిహిత సంబంధాన్ని కూడా నివారించేవారు.

من فوائد الحديث

  1. శుభసమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ సత్కార్యాలు అధికంగా చేయాలని ప్రోత్సహించబడింది.
  2. ఇమామ్ నవవి (రహిమహుల్లాహ్) ఇలా పలికినారు: ఈ హదీథు ద్వారా స్పష్టంగా తెలుస్తున్నది ఏమిటంటే - రమదాన్ చివరి పది రోజుల్లో ఆరాధనలో మరింత ఎక్కువగా శ్రమించమని ముస్లింలకు సిఫార్సు చేయబడింది. అలాగే, ఆ రాత్రులను ఆరాధనలలో (నమాజు, ఖుర్ఆన్ పఠనం, దిక్ర్ మొదలైనవి) మేల్కొని గడపడం కూడా సిఫార్సు చేయబడింది.
  3. తన కుటుంబ సభ్యుల ఆధ్యాత్మిక అభివృద్ధి పట్ల ప్రతి వ్యక్తి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వారిని ఆరాధనలో పాల్గొనమని ప్రోత్సహించాలి, ఆదేశించాలి. అలాగే, వారికి సహనంతో, దయతో మార్గనిర్దేశనం చేయాలి.
  4. సత్కార్యాలు చేయడానికి దృఢ సంకల్పం, సహనం, మరియు పట్టుదల చాలా అవసరం.
  5. అన్నవవి (రహిమహుల్లాహ్) ఇలా పలికినారు: "తన నడుము బిగించేవారు" అనే పదబంధానికి పండితులు వివిధ అర్థాలను తెలిపినారు. కొంతమంది చెప్పిన ప్రకారం, ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సాధారణంగా చేసే ఆరాధనల కంటే మరింత ఎక్కువగా శ్రమించి, ఆరాధనలలో నిమగ్నమయ్యే విషయాన్ని సూచిస్తుంది. "ఈ విషయం కోసం నేను నా నడుము బిగించాను" అని చెప్పడం అంటే - దానిని పూర్తి చేయడానికి గట్టిగా కట్టుబడటం, మొత్తం సమయాన్ని కేటాయించడం అన్నమాట.

అనువాదాలను వీక్షించండి

46 భాష
EN English ఇంగ్లీషు
UR اردو ఉర్దూ
ES Español స్పానిష్
ID Indonesia ఇండోనేషియన్
UG ئۇيغۇرچە ఉయ్ఘర్
BN বাংলা బెంగాలీ
TR Türkçe టర్కిష్
RU Русский రష్యన్
BS Bosanski బోస్నియన్
SI සිංහල సింహళ
HI हिन्दी హిందీ
ZH 中文 చైనీస్
FA فارسی పర్షియన్
VI Tiếng Việt వియత్నమీస్
TL Tagalog టాగలాగ్
KU Kurdî కుర్దిష్
HA Hausa హౌసా
PT Português పోర్చుగీసు
ML മലയാളം మలయాళం
SW Kiswahili స్వాహిలీ
TA தமிழ் తమిళం
MY မြန်မာ బర్మీస్
TH ไทย థాయ్
DE Deutsch జర్మన్
PS پښتو పష్టో
AS অসমীয়া అస్సామీ
SQ Shqip అల్బేనియన్
SV Svenska السويدية
AM አማርኛ الأمهرية
NL Nederlands الهولندية
GU ગુજરાતી الغوجاراتية
NE नेपाली النيبالية
PRS دری الدرية
SR Српски الصربية
RO Română الرومانية
HU Magyar المجرية
MOS Moore الموري
MG Malagasy Малагашӣ
KN ಕನ್ನಡ Канада
WO Wolof الولوف
UK Українська الأوكرانية
KA ქართული الجورجية
MK Македонски المقدونية
KM ភាសាខ្មែរ الخميرية
PA ਪੰਜਾਬੀ البنجابية
MR मराठी الماراثية