1. హోమ్
  2. కూర్పులు
  3. అల్ అఖీద

హదీస్ యూదులను మరియు క్రైస్తవులను అల్లాహ్ శపించు గాక! ఎందుకంటే వారు తమ ప్రవక్తల సమాధులను ప్రార్థనా స్థలాలుగా చేసుకున్నారు

عَنْ عَائِشَةَ أُمِّ المؤْمنينَ رَضيَ اللهُ عنها قَالَتْ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ فِي مَرَضِهِ الَّذِي لَمْ يَقُمْ مِنْهُ:
«لَعَنَ اللهُ الْيَهُودَ وَالنَّصَارَى، اتَّخَذُوا قُبُورَ أَنْبِيَائِهِمْ مَسَاجِدَ» قَالَتْ: فَلَوْلَا ذَاكَ أُبْرِزَ قَبْرُهُ، غَيْرَ أَنَّهُ خُشِيَ أَنْ يُتَّخَذَ مَسْجِدًا.

ఉమ్ముల్ ముమినీన్ అంటే విశ్వాసుల తల్లి అయిన ఆయిషా రదియల్లాహు అన్హా ఉల్లేఖన, తాను కోలుకోలేని అనారోగ్యంతో ఉన్న సమయంలో రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
"యూదులను మరియు క్రైస్తవులను అల్లాహ్ శపించు గాక! ఎందుకంటే వారు తమ ప్రవక్తల సమాధులను ప్రార్థనా స్థలాలుగా చేసుకున్నారు." ఆ తరువాత ఆమె ఇలా అన్నారు: "ఆయన సమాధిని ప్రార్థనా స్థలంగా చేసుకుంటారనే భయం లేకపోతే, ఆయన సమాధి పైకి కనబడేలా చేయబడి ఉండేది".

ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు సహీహ్ ముస్లిం - 529

వివరణ

ఉమ్ముల్ ముమినీన్ అంటే విశ్వాసుల తల్లి అయిన ఆయిషా రదియల్లాహు అన్హా ఇలా పలికినారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం తన తీవ్రమైన అనారోగ్యంతో అంతిమ సమయంలో ఉన్నప్పుడు ఇలా పలికినారు: “అల్లాహ్ యూదులను మరియు క్రైస్తవులను శపించారు మరియు వారిని తన దయ నుండి బహిష్కరించినాడు, ఎందుకంటే వారు తమ ప్రవక్తల సమాధులను ప్రార్థనా స్థలాలుగా చేసుకున్నారు, వాటిపై కట్టడాలు నిర్మించడం లేదా వాటి దగ్గర ప్రార్థించడం లేదా వాటికి అభిముఖంగా నిలబడి ప్రార్థన చేయడం ద్వారా.” ఇంకా ఆమె రదియల్లాహు అన్హా ఇలా పలికినారు: “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి నిషేధం మరియు హెచ్చరిక లేకుంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమాధికి కూడా యూదులు మరియు క్రైస్తవులు తమ ప్రవక్తల సమాధులకు చేసినట్లుగానే జరుగుతుందనే భయం లేకుంటే, ఆయన సమాధి కనిపించేది మరియు ప్రముఖమైనదిగా తయారు చేయబడి ఉండేది.

من فوائد الحديث

  1. ఇది ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క చివరి ఆజ్ఞలలో ఒకటి, ఇది దాని ప్రాముఖ్యత మరియు ప్రత్యేకతను సూచిస్తుంది.
  2. సమాధులను ప్రార్థనా స్థలాలుగా చేసుకోవడం మరియు అంత్యక్రియల ప్రార్థన (జనాజా నమాజు) కాకుండా వాటి వద్ద ప్రార్థన చేయడాన్ని ఖచ్చితంగా నిషేధించడం మరియు కఠినంగా నివారించడం. చనిపోయినవారిని ఆరాధించడం, ఆయన సమాధి చుట్టూ ప్రదక్షిణ చేయడం, దాని నలుమూలలను తాకడం మరియు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం నామంతో, సిఫారసుతో వేడుకోవడం - ఇదంతా బహుదైవారాధన మరియు దాని మార్గాల నుండి వచ్చింది.
  3. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం ఏకేశ్వరోపాసన పట్ల, సమాధుల ఆరాధనా భయం పట్ల చూపిన తీవ్రమైన వ్యతిరేకత మరియు దానిని పూర్తిగా నివారించాలని శ్రద్ధ చూపారు, ఎందుకంటే అది బహుదైవతారాధనకు దారితీస్తుంది.
  4. సర్వశక్తిమంతుడైన అల్లాహ్ తన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఆయన సమాధి వద్ద బహుదైవారాధన జరగకుండా కాపాడాడు, కాబట్టి ఆయన తన సహాబాలను మరియు వారి తరువాత వచ్చే వారిని తన సమాధి బయటపడకుండా కాపాడమని ఆదేశించినాడు.
  5. సహాబాలు రదియల్లాహు అన్హుమ్, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సూచనల ప్రకారం ప్రవర్తించారు, ఆయన బోధనలు పాటించారు మరియు ఏకేశ్వరోపాసన పట్ల ఆసక్తి కలిగి ఉన్నారు.
  6. యూదులు మరియు క్రైస్తవులను అనుకరించడం నిషేధం, మరియు సమాధుల పైన నిర్మించడం అనేది వారి దురాచారాలలో ఒకటి.
  7. వారు ప్రార్థనాలయం నిర్మించకపోయినా, సమాధుల దగ్గర ప్రార్థించడం మరియు వాటికి అభిముఖంగా నిలబడి ప్రార్థనలు చేయడం మొదలైనవి చేయడం.

అనువాదాలను వీక్షించండి

44 భాష
EN English ఇంగ్లీషు
UR اردو ఉర్దూ
ES Español స్పానిష్
ID Indonesia ఇండోనేషియన్
UG ئۇيغۇرچە ఉయ్ఘర్
BN বাংলা బెంగాలీ
TR Türkçe టర్కిష్
RU Русский రష్యన్
BS Bosanski బోస్నియన్
SI සිංහල సింహళ
HI हिन्दी హిందీ
ZH 中文 చైనీస్
FA فارسی పర్షియన్
VI Tiếng Việt వియత్నమీస్
TL Tagalog టాగలాగ్
KU Kurdî కుర్దిష్
HA Hausa హౌసా
PT Português పోర్చుగీసు
ML മലയാളം మలయాళం
SW Kiswahili స్వాహిలీ
TA தமிழ் తమిళం
MY မြန်မာ బర్మీస్
TH ไทย థాయ్
PS پښتو పష్టో
AS অসমীয়া అస్సామీ
SQ Shqip అల్బేనియన్
SV Svenska السويدية
AM አማርኛ الأمهرية
NL Nederlands الهولندية
GU ગુજરાતી الغوجاراتية
PRS دری الدرية
SR Српски الصربية
RO Română الرومانية
HU Magyar المجرية
MOS Moore الموري
MG Malagasy Малагашӣ
KN ಕನ್ನಡ Канада
WO Wolof الولوف
UK Українська الأوكرانية
KA ქართული الجورجية
MK Македонски المقدونية
KM ភាសាខ្មែរ الخميرية
PA ਪੰਜਾਬੀ البنجابية
MR मराठी الماراثية