1. హోమ్
  2. కూర్పులు
  3. ఫిఖ్ మరియు దాని నియమాలు

హదీస్ “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రజలలో అత్యంత ఉదారంగా ఉండేవారు. రమదాన్ నెలలో జిబ్రీల్ (అలైహిస్సలాం) ఆయనను కలిసినపుడు ఆయన దాతృత్వం, ఉదారత మరింతగా పెరిగిపోయేవి

عَنِ ابْنِ عَبَّاسٍ رضي الله عنهما قَالَ:
كَانَ رَسُولُ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ أَجْوَدَ النَّاسِ، وَكَانَ أَجْوَدُ مَا يَكُونُ فِي رَمَضَانَ حِينَ يَلْقَاهُ جِبْرِيلُ، وَكَانَ يَلْقَاهُ فِي كُلِّ لَيْلَةٍ مِنْ رَمَضَانَ فَيُدَارِسُهُ القُرْآنَ، فَلَرَسُولُ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ أَجْوَدُ بِالخَيْرِ مِنَ الرِّيحِ المُرْسَلَةِ.

ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖనం :
“రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రజలలో అత్యంత ఉదారంగా ఉండేవారు. రమదాన్ నెలలో జిబ్రీల్ (అలైహిస్సలాం) ఆయనను కలిసినపుడు ఆయన దాతృత్వం, ఉదారత మరింతగా పెరిగిపోయేవి. జిబ్రీల్ (అలైహిస్సలాం) రమదాన్ మాసములో ప్రతి రాత్రి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వద్దకు వచ్చేవారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో కలిసి ఖుర్’ఆన్ పునశ్చరణ చేయుట కొరకు. అపుడు దాతృత్వములో, ఉదారతలో, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వేగవంతమైన గాలి కంటే కూడా ఎక్కువ వేగంగా ఉండేవారు.”

ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు సహీహ్ అల్ బుఖారీ - 6

వివరణ

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రజలలో అత్యంత ఉదార స్వభావి, రమదాన్ మాసంలో ఆయన దాతృత్వం మరింతగా పెరిగిపోయేది. తనను అర్థించిన వారికి ఏది అవసరమో దానిని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇచ్చివేసేవారు. ఆయన దాతృత్వం అధికం కావడానికి రెండు విషయాలు కారణంగా ఉండేవి, అవి:
మొదటిది: జిబ్రీల్ (అలైహిస్సలాం) తో ఆయన సమావేశం కావడం;
రెండవ విషయం: కంఠస్థము చేసి, ధారణలో ఉంచుకున్న ఖుర్’ఆన్ ను పునశ్చరణ చేయడం.
జిబ్రీల్ (అలైహిస్సలాం) ఖుర్ఆన్ యొక్క అవతరించిన ప్రతి ఆయతును ఆయన ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంతో అధ్యయనం చేసేవారు, మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరింత ఉదారత్వముతో; అర్థించిన వారికి అర్థించిన దాని కంటే ఎక్కువ ప్రసాదిస్తూ, వీలైనంత ఎక్కువ మంచి చేస్తూ, అల్లాహ్ తన కరుణతో పంపే వర్షం మరియు మంచి గాలి కంటే వేగంగా ప్రజలకు మరింత త్వరగా ప్రయోజనం చేకూరుస్తూ ఉండేవారు.

من فوائد الحديث

  1. ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం యొక్క ఉదారతను గురించి, ముఖ్యంగా రమదాన్ మాసములో ఆయన ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం దాతృత్వం యొక్క విస్తారత గురించి ప్రస్తావించబడింది. ఎందుకంటే ఆ మాసము విధేయత మరియు సత్కార్యాల ఋతువులకు చెందిన మాసము.
  2. ఇందులో ఎల్లప్పుడూ దాతృత్వాన్ని కొనసాగించాలని, రమదాన్ మాసంలో దానిని మరింతగా పెంచాలని సిఫార్సు చేయబడింది.
  3. రమదాన్ మాసంలో దానధర్మాలు, ఖుర్ఆన్ పఠనం వంటివి ఎక్కువ చేయాలి.
  4. జ్ఞాన పరిరక్షణ సాధనాలలో ఒకటి ఙ్ఞానవంతులైన విద్యార్థులతో మరియు పండితులతో దానిని అధ్యయనం చేయడం.

అనువాదాలను వీక్షించండి

53 భాష
EN English ఇంగ్లీషు
UR اردو ఉర్దూ
ES Español స్పానిష్
ID Indonesia ఇండోనేషియన్
UG ئۇيغۇرچە ఉయ్ఘర్
BN বাংলা బెంగాలీ
TR Türkçe టర్కిష్
RU Русский రష్యన్
BS Bosanski బోస్నియన్
SI සිංහල సింహళ
HI हिन्दी హిందీ
ZH 中文 చైనీస్
FA فارسی పర్షియన్
VI Tiếng Việt వియత్నమీస్
TL Tagalog టాగలాగ్
KU Kurdî కుర్దిష్
HA Hausa హౌసా
PT Português పోర్చుగీసు
ML മലയാളം మలయాళం
SW Kiswahili స్వాహిలీ
TA தமிழ் తమిళం
MY မြန်မာ బర్మీస్
TH ไทย థాయ్
DE Deutsch జర్మన్
PS پښتو పష్టో
AS অসমীয়া అస్సామీ
SQ Shqip అల్బేనియన్
SV Svenska السويدية
AM አማርኛ الأمهرية
NL Nederlands الهولندية
GU ગુજરાતી الغوجاراتية
KY Кыргызча Қирғизӣ
NE नेपाली النيبالية
LT Lietuvių الليتوانية
PRS دری الدرية
SR Српски الصربية
TG тоҷикӣ الطاجيكية
RW Kinyarwanda Кинёрвондӣ
RO Română الرومانية
HU Magyar المجرية
CS Čeština التشيكية
MOS Moore الموري
MG Malagasy Малагашӣ
OM Oromoo Урумӣ
KN ಕನ್ನಡ Канада
WO Wolof الولوف
AZ Azərbaycan Озарӣ
UK Українська الأوكرانية
KA ქართული الجورجية
MK Македонски المقدونية
KM ភាសាខ្មែរ الخميرية
PA ਪੰਜਾਬੀ البنجابية
MR मराठी الماراثية