1. హోమ్
  2. కూర్పులు
  3. ఫిఖ్ మరియు దాని నియమాలు

హదీస్ ఎవరైతే అల్లాహ్ కొరకు ఒక మస్జిదును నిర్మిస్తాడో, అల్లాహ్ అతని కొరకు స్వర్గములో దానిని పోలిన ఒక గృహాన్ని నిర్మిస్తాడు.”

عَنْ ‌مَحْمُودِ بْنِ لَبِيدٍ رضي الله عنه:
أَنَّ ‌عُثْمَانَ بْنَ عَفَّانَ أَرَادَ بِنَاءَ الْمَسْجِدِ فَكَرِهَ النَّاسُ ذَلِكَ، وَأَحَبُّوا أَنْ يَدَعَهُ عَلَى هَيْئَتِهِ، فَقَالَ: سَمِعْتُ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ يَقُولُ: «مَنْ بَنَى مَسْجِدًا لِلهِ بَنَى اللهُ لَهُ فِي الْجَنَّةِ مِثْلَهُ».

మహ్’మూద్ బిన్ లబీద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం :
“ఉథ్మాన్ బిన్ అఫ్ఫాన్ రజియల్లాహు అన్హు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మస్జిదును (మస్జిద్-ఎ-నబవీను) పునర్నిమించాలని అనుకున్నారు. కానీ ప్రజలు అలా చేయడాన్ని ఇష్టపడలేదు. వారు మస్జిదు యధాతథ స్థితిలోనే ఉండాలని కోరుకున్నారు. అపుడు ఆయన ఇలా అన్నారు “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించగా నేను విన్నాను – “ఎవరైతే అల్లాహ్ కొరకు ఒక మస్జిదును నిర్మిస్తాడో, అల్లాహ్ అతని కొరకు స్వర్గములో దానిని పోలిన ఒక గృహాన్ని నిర్మిస్తాడు.”

ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు సహీహ్ ముస్లిం - 533

వివరణ

ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రజియల్లాహు అన్హు మస్జిద్-ఎ-నబవీ ని, ఉన్న స్థితిలో కంటే ఉత్తమంగా పునర్నిర్మించాలని సంకల్పించినారు. దానికి ప్రజలు ఇష్టపడలేదు, ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలములో నిర్మించబడిన మస్జిదు అసలు నిర్మాణములో మార్పులు వస్తాయని. (ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలములో) మస్జిదు మట్టితో నిర్మించబడింది, దాని కప్పు సున్నపు రాయితో కట్టబడింది. అయితే ఉథ్మాన్ బిన్ అఫ్ఫాన్ రజియల్లాహు అన్హు రాతితో మరియు ప్లాస్టరుతో నిర్మించాలని తలపోసినారు. ప్రజల అయిష్టతను గమనించి, ఆయన వారికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అనగా తాను విన్నానని తెలియజేసినారు – “ఎవరైతే కేవలం అల్లాహ్ యొక్క కరుణ కొరకు, కపటత్వం గానీ లేక కీర్తి కండూతి గానీ లేకుండా, మస్జిదును నిర్మిస్తారో అల్లాహ్ వారు చేసిన పనిని పోలిన అత్యుత్తమమైన దానిని అతనికి ప్రసాదిస్తాడు; ఈ విషయానికి సంబంధించి ఆ అత్యుత్తమమైనది ఏమిటంటే అల్లాహ్ స్వర్గములో దానిని పోలిన అత్యుత్తమ ఇంటిని అతని కొరకు నిర్మిస్తాడు.

من فوائد الحديث

  1. ఈ హదీసులో మస్జిదులను నిర్మించడం పట్ల ప్రోత్సాహము, మరియు మస్జిదులను నిర్మించడం యొక్క ఘనత తెలుస్తున్నాయి.
  2. మస్జిదులని నిర్మించుట యొక్క ఘనతలో ఇంతకు ముందే కట్టి ఉన్న మస్జిదుల విస్తరణ, లేదా వాటిని పునర్నిర్మిచడం కూడా వస్తాయి.
  3. అలాగే ఈ హదీసులో – ఆచరణలన్నింటిలో అల్లాహ్ ఆదేశాలకు బద్ధులై ఉండడం, అందులో కల్మషము లేని సంకల్పము కలిగి ఉండడం యొక్క ప్రాధాన్యత తెలుస్తున్నది.

అనువాదాలను వీక్షించండి

61 భాష
EN English ఇంగ్లీషు
UR اردو ఉర్దూ
ES Español స్పానిష్
ID Indonesia ఇండోనేషియన్
UG ئۇيغۇرچە ఉయ్ఘర్
BN বাংলা బెంగాలీ
FR Français ఫ్రెంచ్
TR Türkçe టర్కిష్
RU Русский రష్యన్
BS Bosanski బోస్నియన్
SI සිංහල సింహళ
HI हिन्दी హిందీ
ZH 中文 చైనీస్
FA فارسی పర్షియన్
VI Tiếng Việt వియత్నమీస్
TL Tagalog టాగలాగ్
KU Kurdî కుర్దిష్
HA Hausa హౌసా
PT Português పోర్చుగీసు
ML മലയാളം మలయాళం
SW Kiswahili స్వాహిలీ
TA தமிழ் తమిళం
MY မြန်မာ బర్మీస్
TH ไทย థాయ్
DE Deutsch జర్మన్
JA 日本語 జపనీస్
PS پښتو పష్టో
AS অসমীয়া అస్సామీ
SQ Shqip అల్బేనియన్
SV Svenska السويدية
AM አማርኛ الأمهرية
NL Nederlands الهولندية
GU ગુજરાતી الغوجاراتية
KY Кыргызча Қирғизӣ
NE नेपाली النيبالية
YO Yorùbá Юрба
LT Lietuvių الليتوانية
PRS دری الدرية
SR Српски الصربية
SO Soomaali الصومالية
TG тоҷикӣ الطاجيكية
RW Kinyarwanda Кинёрвондӣ
RO Română الرومانية
HU Magyar المجرية
CS Čeština التشيكية
MOS Moore الموري
MG Malagasy Малагашӣ
IT Italiano ఇటాలియన్
OM Oromoo Урумӣ
KN ಕನ್ನಡ Канада
WO Wolof الولوف
AZ Azərbaycan Озарӣ
UZ O‘zbek الأوزبكية
UK Українська الأوكرانية
KA ქართული الجورجية
MK Македонски المقدونية
KM ភាសាខ្មែរ الخميرية
BM Bambara البامبارية
PA ਪੰਜਾਬੀ البنجابية
MR मराठी الماراثية
KMR Kurmancî الكرمنجية