1. హోమ్
  2. కూర్పులు
  3. అల్ అఖీద

హదీస్ ఎవరైతే అల్లాహ్’కు దేనినీ సాటి కల్పించకుండా (షిర్క్ చేయకుండా) ఆయనను కలుస్తాడో, అతని పాపాలు అతనికి హాని చేయలేవు. మరియు ఎవరైతే ఆయనకు ఇతరులను సాటి కల్పిస్తూ (షిర్క్ చేస్తూ) మరణిస్తాడో, అతని పుణ్యకార్యాలు అతనికి ప్రయోజనం చేకూర్చలేవు

عَنْ عَبْدَ اللهِ بْنِ عَمْرٍو رَضيَ اللهُ عَنْهُمَا يَقُولُ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«مَنْ لَقِيَ اللهَ لَا يُشْرِكُ بِهِ شَيْئًا لَمْ تَضُرَّهُ مَعَهُ خَطِيئَةٌ، وَمَنْ مَاتَ وَهُوَ يُشْرِكُ بِهِ لَمْ يَنْفَعْهُ مَعَهُ حَسَنَةٌ».

అబ్దుల్లాహ్ ఇబ్న్ అమ్ర్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖన: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
«ఎవరైతే అల్లాహ్’కు దేనినీ సాటి కల్పించకుండా (షిర్క్ చేయకుండా) ఆయనను కలుస్తాడో, అతని పాపాలు అతనికి హాని చేయలేవు. మరియు ఎవరైతే ఆయనకు ఇతరులను సాటి కల్పిస్తూ (షిర్క్ చేస్తూ) మరణిస్తాడో, అతని పుణ్యకార్యాలు అతనికి ప్రయోజనం చేకూర్చలేవు.»

ప్రామాణికమైన హదీథు ఆహ్మద్ నమోదు చేసినారు: ముస్నద్ అహ్మద్ - 6586

వివరణ

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు: ఎవరైతే ఏకదైవారాధకుడిగా (తౌహీద్ పై) ఉంటూ, అల్లాహ్ కు దేనినీ సాటి కల్పించని స్థితిలో మరణించి ఆయనను కలుస్తాడో, అతను తన పాపాల కారణంగా నరకంలో శిక్షించబడినప్పటికీ, చివరికి అతని గమ్యస్థానం స్వర్గమే అవుతుంది. మరియు ఎవరైతే అల్లాహ్ కు ఇతరులను సాటి కల్పిస్తూ (షిర్క్ చేస్తూ) మరణిస్తాడో, షిర్క్ తో పాటు చేసిన ఏ పుణ్యకార్యం కూడా అతనికి ప్రయోజనం చేకూర్చదు; మరియు అతనిపై స్వర్గం నిషిద్ధం (హరామ్) చేయబడుతుంది.

من فوائد الحديث

  1. షిర్కు చేయవద్దని హెచ్చరించబడింది - ఎందుకంటే అది పాపాలలో, తప్పులలో అత్యంత ఘోరమైనది మరియు అల్లాహ్ దానిని అస్సలు క్షమించడు.
  2. తౌహీద్ యొక్క ఘనత ఏమిటంటే, అది స్వర్గ ప్రవేశానికి కారణభూతమవుతుంది; నరకంలో శిక్షించబడిన తర్వాత అయినా సరే.
  3. మరణించే వరకు తౌహీద్ పై స్థిరంగా ఉండటం మరియు దానికి వ్యతిరేకమైన షిర్క్ నుండి దూరంగా ఉండటం యొక్క ప్రాధాన్యత.

అనువాదాలను వీక్షించండి

29 భాష
EN English ఇంగ్లీషు
UR اردو ఉర్దూ
ID Indonesia ఇండోనేషియన్
BN বাংলা బెంగాలీ
TR Türkçe టర్కిష్
RU Русский రష్యన్
BS Bosanski బోస్నియన్
SI සිංහල సింహళ
HI हिन्दी హిందీ
VI Tiếng Việt వియత్నమీస్
TL Tagalog టాగలాగ్
KU Kurdî కుర్దిష్
HA Hausa హౌసా
PT Português పోర్చుగీసు
ML മലയാളം మలయాళం
SW Kiswahili స్వాహిలీ
TH ไทย థాయ్
AS অসমীয়া అస్సామీ
NL Nederlands الهولندية
GU ગુજરાતી الغوجاراتية
PRS دری الدرية
SR Српски الصربية
HU Magyar المجرية
KN ಕನ್ನಡ Канада
KA ქართული الجورجية
MK Македонски المقدونية
KM ភាសាខ្មែរ الخميرية
PA ਪੰਜਾਬੀ البنجابية
MR मराठी الماراثية