1. హోమ్
  2. కూర్పులు
  3. ఫిఖ్ మరియు దాని నియమాలు

హదీస్ “ఎవరైతే అల్లాహ్ మార్గంలో ఒక పోరాట యోధుడిని (ఆయుధాలు మొ. వాటితో) సన్నద్ధం చేస్తాడో, అతను నిజంగా ఆ పోరాటంలో పాల్గొన్నట్లే; మరియు ఆ యోధుడి గైరుహాజరీలో, అతనిపై ఆధారపడిన వారిని ఎవరు సరిగ్గా చూసుకుంటారో అతడు కూడా నిజంగా పోరాటంలో పాల్గొన్నట్లే.”

عَن زَيْدِ بْنِ خَالِدٍ رَضِيَ اللَّهُ عَنْهُ أَنَّ رَسُولَ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«مَنْ جَهَّزَ غَازِيًا فِي سَبِيلِ اللَّهِ فَقَدْ غَزَا، وَمَنْ خَلَفَ غَازِيًا فِي سَبِيلِ اللَّهِ بِخَيْرٍ فَقَدْ غَزَا».

జైద్ ఇబ్న్ ఖాలిద్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
“ఎవరైతే అల్లాహ్ మార్గంలో ఒక పోరాట యోధుడిని (ఆయుధాలు మొ. వాటితో) సన్నద్ధం చేస్తాడో, అతను నిజంగా ఆ పోరాటంలో పాల్గొన్నట్లే; మరియు ఆ యోధుడి గైరుహాజరీలో, అతనిపై ఆధారపడిన వారిని ఎవరు సరిగ్గా చూసుకుంటారో అతడు కూడా నిజంగా పోరాటంలో పాల్గొన్నట్లే.”

ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు సహీహ్ అల్ బుఖారీ - 2843

వివరణ

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: అల్లాహ్ మార్గంలో పోరాడే ఒక యోధుని కొరకు – ఎవరైతే ప్రయాణ సాధనాలు, ఆయుధాలు, వాహనం, ఆహారం, ఆహారపదార్థాలు, ఇంకా అతనికి అవసరమైన ఇతర వస్తువులతో సహా ఆ యోధుడిని సిద్ధపరుస్తాడో, అతడు కూడా యోధుడిగానే పరిగణించబడతాడు మరియు (తీర్పు దినమునాడు) అతడు ఒక యోధునికి లభించే పుణ్యఫలాన్ని పొందుతాడు.
అలాగే ఎవరైతే యోధుని పరోక్షంలో అతని వ్యవహారాలను చక్కగా చూసుకుంటాడో మరియు అతను లేనప్పుడు అతని కుటుంబాన్ని చూసుకోవడంలో అతని స్థానంలో అతని ప్రతినిధిగా ఉంటాడో అతడు కూడా యోధునిగా పరిగణించబడతాడు.

من فوائد الحديث

  1. ఇందులో మంచిని చేయుటలో ముస్లిములు ఒకరినొకరు సహకరించుకోవాలనే హితబోధ ఉన్నది.
  2. ఇబ్న్ హజర్ రహిమహుల్లాహ్ ఇలా అన్నారు: “ఈ హదీథ్‌లో ముస్లింల ప్రయోజనాల కోసం ఎవరైనా ఏదైనా చేసినా లేదా వారి ముఖ్యమైన పనులలో ఏదైనా ఒకదానిని నిర్వహించినా అటువంటి వారికి మేలు చేయాలి అనే ఉద్బోధ ఉన్నది.”
  3. సాధారణ నియమం ఏమిటంటే: అల్లాహ్‌కు విధేయత చూపే చర్యలలో ఒక వ్యక్తికి ఎవరైనా సహాయం చేస్తే, ఆ వ్యక్తికి కూడా ఆచరించిన వాని ప్రతిఫలంలో కొంచెం కూడా తగ్గింపు లేకుండా – ఆచరించిన వాని లాంటి ప్రతిఫలమే లభిస్తుంది.

అనువాదాలను వీక్షించండి

53 భాష
EN English ఇంగ్లీషు
UR اردو ఉర్దూ
ES Español స్పానిష్
ID Indonesia ఇండోనేషియన్
UG ئۇيغۇرچە ఉయ్ఘర్
BN বাংলা బెంగాలీ
TR Türkçe టర్కిష్
RU Русский రష్యన్
BS Bosanski బోస్నియన్
SI සිංහල సింహళ
HI हिन्दी హిందీ
ZH 中文 చైనీస్
FA فارسی పర్షియన్
VI Tiếng Việt వియత్నమీస్
TL Tagalog టాగలాగ్
KU Kurdî కుర్దిష్
HA Hausa హౌసా
PT Português పోర్చుగీసు
ML മലയാളം మలయాళం
SW Kiswahili స్వాహిలీ
TA தமிழ் తమిళం
MY မြန်မာ బర్మీస్
TH ไทย థాయ్
DE Deutsch జర్మన్
PS پښتو పష్టో
AS অসমীয়া అస్సామీ
SQ Shqip అల్బేనియన్
SV Svenska السويدية
AM አማርኛ الأمهرية
NL Nederlands الهولندية
GU ગુજરાતી الغوجاراتية
KY Кыргызча Қирғизӣ
NE नेपाली النيبالية
LT Lietuvių الليتوانية
PRS دری الدرية
SR Српски الصربية
TG тоҷикӣ الطاجيكية
RW Kinyarwanda Кинёрвондӣ
RO Română الرومانية
HU Magyar المجرية
CS Čeština التشيكية
MOS Moore الموري
MG Malagasy Малагашӣ
OM Oromoo Урумӣ
KN ಕನ್ನಡ Канада
WO Wolof الولوف
AZ Azərbaycan Озарӣ
UK Українська الأوكرانية
KA ქართული الجورجية
MK Македонски المقدونية
KM ភាសាខ្មែរ الخميرية
PA ਪੰਜਾਬੀ البنجابية
MR मराठी الماراثية