1. హోమ్
  2. కూర్పులు
  3. పవిత్ర ఖుర్ఆన్ మరియు దాని శాస్త్రాలు

హదీస్ అనస్ రదియల్లాహు అన్హును, 'ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లమ్ పఠనం ఎలా ఉండేది?' అని అడగగా, ఆయన ఇలా సమాధానమిచ్చారు: «అది దీర్ఘంగా ఉండేది

عَنْ قَتَادَةَ قَالَ:
سُئِلَ أَنَسٌ كَيْفَ كَانَتْ قِرَاءَةُ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ؟ فَقَالَ: «كَانَتْ مَدًّا»، ثُمَّ قَرَأَ: {بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِ} [الفاتحة: 1] يَمُدُّ بِبِسْمِ اللَّهِ، وَيَمُدُّ بِالرَّحْمَنِ، وَيَمُدُّ بِالرَّحِيمِ.

ఖతాదహ్ ఉల్లేఖన:
అనస్ రదియల్లాహు అన్హును, 'ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లమ్ పఠనం ఎలా ఉండేది?' అని అడగగా, ఆయన ఇలా సమాధానమిచ్చారు: «అది దీర్ఘంగా ఉండేది», ఆ తర్వాత ఆయన {బిస్మిల్లాహిర్రహ్మాణిర్రహీమ్} అని పఠించారు. ఆయన 'బిస్మిల్లాహ్' ను, 'అర్-రహ్మాన్' ను, మరియు 'అర్-రహీమ్' ను దీర్ఘం తీసి పఠించేవారు.

ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ నమోదు చేసినారు: సహీహ్ అల్ బుఖారీ - 5046

వివరణ

అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు అన్హును, "ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లమ్ ఖుర్ఆన్ పఠనం ఎలా ఉండేది?" అని అడగగా, ఆయన ఇలా సమాధానమిచ్చారు: "ఆయన పఠనంలో అక్షరాలను సాగదీసేవారు. ఆయన 'అల్లాహ్' లోని 'లా' ను సాగదీసేవారు, 'అర్-రహ్మాన్' లోని 'మా' ను సాగదీసేవారు, మరియు 'అర్-రహీమ్' లోని 'హీ' ని సాగదీసేవారు.

من فوائد الحديث

  1. మద్: మద్ అక్షరాలైన అలిఫ్, వావ్ మరియు యా, సాకిన్ స్థితిలో ఉండి, వాటికి ముందు వాటికి అనుగుణమైన హరకత్ వచ్చినప్పుడు, వాటిని పూర్తిగా పొడిగించి అంటే మద్ తో పలకడం గురించి తెలుస్తున్నది.
  2. ఇందులో ఖుర్ఆన్ పారాయణానికి సంబంధించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పద్దతి (ప్రవర్తనా విధానం) వివరించబడినది.
  3. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పారాయణం చేసే విధానం యొక్క ఆచరణాత్మక అమలు తప్పనిసరి.
  4. అల్ సిందీ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: “ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తన స్వరాన్ని దీర్ఘంగా సాగదీసేవారు” అనే మాటలకు అర్థం ఏమిటంటే, ఆయన దీర్ఘం తీయడానికి అనువైన అక్షరాలను పొడిగించేవారు. ధ్యానచింతనలలో నిమగ్నమవ్వడానికి మరియు హితబోధ స్వీకరించేవారికి హితబోధ చేయడానికి ఆయన దీని ద్వారా సహాయం పొందేవారు.
  5. తజ్వీద్ మరియు ఖుర్ఆన్ శాస్త్రాలను నేర్చుకోవడం యొక్క ప్రాముఖ్యత తెలుస్తున్నది.
  6. గ్రంథాల భావాన్ని గ్రహించడానికి పండితుల వైపు మరలాలి - అనస్ రదియల్లాహు అన్హును ప్రశ్నించినప్పుడు ఆయన ప్రశ్నించిన వారికి స్పష్టం చేసినట్లుగా, వారు స్పష్టంగా వివరించాలి.

అనువాదాలను వీక్షించండి

29 భాష
EN English ఇంగ్లీషు
UR اردو ఉర్దూ
ID Indonesia ఇండోనేషియన్
BN বাংলা బెంగాలీ
TR Türkçe టర్కిష్
RU Русский రష్యన్
BS Bosanski బోస్నియన్
SI සිංහල సింహళ
HI हिन्दी హిందీ
VI Tiếng Việt వియత్నమీస్
TL Tagalog టాగలాగ్
KU Kurdî కుర్దిష్
HA Hausa హౌసా
PT Português పోర్చుగీసు
ML മലയാളം మలయాళం
SW Kiswahili స్వాహిలీ
TH ไทย థాయ్
AS অসমীয়া అస్సామీ
NL Nederlands الهولندية
GU ગુજરાતી الغوجاراتية
PRS دری الدرية
SR Српски الصربية
HU Magyar المجرية
KN ಕನ್ನಡ Канада
KA ქართული الجورجية
MK Македонски المقدونية
KM ភាសាខ្មែរ الخميرية
PA ਪੰਜਾਬੀ البنجابية
MR मराठी الماراثية