عَنِ ابْنِ أَبِي مُلَيْكَةَ:
عَنْ بَعْضِ أَزْوَاجِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ -قَالَ: أَبُو عَامِرٍ، قَالَ نَافِعٌ: أُرَاهَا حَفْصَةَ- أَنَّهَا سُئِلَتْ عَنْ قِرَاءَةِ رَسُولِ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ فَقَالَتْ: إِنَّكُمْ لَا تَسْتَطِيعُونَهَا قَالَ: فَقِيلَ لَهَا أَخْبِرِينَا بِهَا. قَالَ: فَقَرَأَتْ قِرَاءَةً تَرَسَّلَتْ فِيهَا قَالَ أَبُو عَامِرٍ: قَالَ نَافِعٌ: فَحَكَى لَنَا ابْنُ أَبِي مُلَيْكَةَ {الحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ} [الفاتحة: 2] ثُمَّ قَطَّعَ {الرَّحْمَنِ الرَّحِيمِ} [الفاتحة: 1] ثُمَّ قَطَّعَ {مَالِكِ يَوْمِ الدِّينِ}.

ఇబ్న్ అబీ ములైకహ్ ఉల్లేఖన:
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం భార్యలలో ఒక భార్య నుండి ఉల్లేఖన -అబూ ఆమిర్ అన్నారు, నాఫి అన్నారు: నేను ఆమెను హఫ్సా రదియల్లాహు అన్హా అని అనుకుంటున్నాను- ఆమెను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పారాయణం గురించి అడగగా ఆమె ఇలా అన్నారు: నిశ్చయంగా మీరు దానిని చేయలేరు. అప్పుడు ఆమెతో, 'దాని గురించి మాకు తెలియజేయండి' అని అనబడింది. అప్పుడు ఆమె ఆగి ఆగి స్పష్టంగా పారాయణం చేసేవారు. అబూ ఆమిర్ అన్నారు: నాఫి అన్నారు: ఇబ్న్ అబీ ములైకా మాకు దానిని చేసి చూపించారు: {అల్హమ్దు లిల్లాహి రబ్బిల్ ఆలమీన్} అని పఠించి, ఆ తర్వాత ఆగి, {అర్రహ్మా నిర్రహీమ్} అని పఠించి, ఆ తర్వాత ఆగి, {మాలికి యౌమిద్దీన్} అని పఠించారు.

ప్రామాణికమైన హదీథు ఆహ్మద్ నమోదు చేసినారు: ముస్నద్ అహ్మద్ - 26470

వివరణ

విశ్వాసుల మాత హఫ్సా రదియల్లాహు అన్హాను ఇలా ప్రశ్నించారు: "ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఖుర్ఆన్ పారాయణం ఎలా ఉండేది?" దానికి ఆమె "మీరు ఆయనలా పఠించలేరు" అని చెప్పగా, మరలా వారు ఆమెతో, "మాకు తెలియజేయండి" అని అన్నారు. నాఫె తెలిపారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఖుర్ఆన్ పారాయణ పద్ధతిని అనుకరించి, వారికి స్పష్టంగా తెలియజేయడానికి ఇబ్నె అబీ ములైక మా కొరకు నెమ్మదిగా పారాయణం చేశారు. ఆయన ఇలా పఠించారు: {అల్హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్} తర్వాత పారాయణాన్ని ఆపారు, {అర్రహ్మానిర్రహీమ్}, తర్వాత పారాయణాన్ని ఆపారు, {మాలికి యౌమిద్దీన్}.

من فوائد الحديث

  1. ఇందులో ఖుర్ఆన్ పారాయణానికి సంబంధించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పద్దతి (ప్రవర్తనా విధానం) వివరించబడినది.
  2. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క పారాయణ విధానాన్ని ఆచరణాత్మకంగా వివరించడం జరిగింది.
  3. ఖుర్ఆనును నిదానంగా పఠించడం షరీఅతుబద్దమైనది, ఎందుకంటే అది దానిపై లోతుగా ఆలోచించేందుకు మరింత సహాయపడుతుంది.
  4. ఖుర్’ఆన్ మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఆచరణ పట్ల సలఫె సాలిహీన్ శ్రద్ధ తెలుస్తున్నది.
  5. తజ్వీద్ మరియు ఖుర్ఆన్ శాస్త్రాలను తెలుసుకోవడం యొక్క ప్రాముఖ్యత తెలుస్తున్నది.

అనువాదాలను వీక్షించండి

30 భాష
EN English ఇంగ్లీషు
UR اردو ఉర్దూ
ES Español స్పానిష్
ID Indonesia ఇండోనేషియన్
BN বাংলা బెంగాలీ
TR Türkçe టర్కిష్
RU Русский రష్యన్
BS Bosanski బోస్నియన్
SI සිංහල సింహళ
HI हिन्दी హిందీ
VI Tiếng Việt వియత్నమీస్
TL Tagalog టాగలాగ్
KU Kurdî కుర్దిష్
HA Hausa హౌసా
PT Português పోర్చుగీసు
ML മലയാളം మలయాళం
SW Kiswahili స్వాహిలీ
TH ไทย థాయ్
AS অসমীয়া అస్సామీ
NL Nederlands الهولندية
GU ગુજરાતી الغوجاراتية
PRS دری الدرية
SR Српски الصربية
HU Magyar المجرية
KN ಕನ್ನಡ Канада
KA ქართული الجورجية
MK Македонски المقدونية
KM ភាសាខ្មែរ الخميرية
PA ਪੰਜਾਬੀ البنجابية
MR मराठी الماراثية