1. హోమ్
  2. కూర్పులు
  3. సద్గుణాలు మరియు పద్దతులు

హదీస్ విన్నారా! నిశ్చయంగా మీలో ప్రతి ఒక్కరూ తమ ప్రభువుతో ఏకాంతంగా సంభాషిస్తున్నారు, కాబట్టి ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకోవద్దు

عَنْ أَبِي سَعِيدٍ رَضِيَ اللَّهُ عَنْهُ قَالَ:
اعْتَكَفَ رَسُولُ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ فِي المَسْجِدِ، فَسَمِعَهُمْ يَجْهَرُونَ بِالقِرَاءَةِ، فَكَشَفَ السِّتْرَ، فَقَالَ: «أَلَا إِنَّ كُلَّكُمْ مُنَاجٍ رَبَّهُ، فَلَا يُؤْذِيَنَّ بَعْضُكُمْ بَعْضًا، وَلَا يَرْفَعْ بَعْضُكُمْ عَلَى بَعْضٍ فِي القِرَاءَةِ»، أَوْ قَالَ: «فِي الصَّلَاةِ».

అబూ సయీద్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన:
రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం మస్జిదులో ఏతికాఫ్ లో ఉన్నారు, అప్పుడు వారు (ప్రజలు) బిగ్గరగా ఖుర్’ఆన్ పఠనం చేయడాన్ని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం విన్నారు. ఆయన తెరను తొలగించి, ఇలా అన్నారు: «విన్నారా! నిశ్చయంగా మీలో ప్రతి ఒక్కరూ తమ ప్రభువుతో ఏకాంతంగా సంభాషిస్తున్నారు, కాబట్టి ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకోవద్దు, మరియు పఠనంలో ఒకరిపై ఒకరు తమ స్వరాలను పెంచవద్దు», లేదా వారు ఇలా అన్నారు: «సలాహ్ లో».

ప్రామాణికమైన హదీథు అబూదావూద్ నమోదు చేసినారు: సునన్ అబీదావూద్ - 1332

వివరణ

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ సామీప్యం పొందడానికి తన మస్జిదు లోపల ఒక గుడారంలో ఏతికాఫ్’లో ఉన్నారు, అప్పుడు ఆయన తన సహాబాలు ఒకరికొకరు ఇబ్బంది కలిగించేలా చాలా బిగ్గరగా ఖుర్ఆన్ పఠించడం విన్నారు. అపుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం గుడారం పైనున్న తెరను తొలగించి, అలా చేసిన వారిని మందలించి, ఇలా అన్నారు: "మీరందరూ ఖుర్ఆన్ పఠనం ద్వారా మీ ప్రభువుతో సంభాషిస్తున్నారు, కాబట్టి మీరు ఒకరికొకరు ఇబ్బంది కలిగించుకోకండి, మరియు పఠనంలో లేదా నమాజులో ఒకరిపై ఒకరు మీ స్వరాన్ని పెంచకండి."

من فوائد الحديث

  1. ఎవరికైనా ఇబ్బంది కలిగే విధంగా ఖుర్ఆన్ పారాయణంలో స్వరాన్ని పెంచడం నిషిద్ధం (హరామ్).
  2. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సహాబాలకు దివ్యఖుర్ఆన్ పారాయణ పద్దతులను బోధించినారు.

అనువాదాలను వీక్షించండి

29 భాష
EN English ఇంగ్లీషు
UR اردو ఉర్దూ
ID Indonesia ఇండోనేషియన్
BN বাংলা బెంగాలీ
TR Türkçe టర్కిష్
RU Русский రష్యన్
BS Bosanski బోస్నియన్
SI සිංහල సింహళ
HI हिन्दी హిందీ
VI Tiếng Việt వియత్నమీస్
TL Tagalog టాగలాగ్
KU Kurdî కుర్దిష్
HA Hausa హౌసా
PT Português పోర్చుగీసు
ML മലയാളം మలయాళం
SW Kiswahili స్వాహిలీ
TH ไทย థాయ్
AS অসমীয়া అస్సామీ
NL Nederlands الهولندية
GU ગુજરાતી الغوجاراتية
PRS دری الدرية
SR Српски الصربية
HU Magyar المجرية
KN ಕನ್ನಡ Канада
KA ქართული الجورجية
MK Македонски المقدونية
KM ភាសាខ្មែរ الخميرية
PA ਪੰਜਾਬੀ البنجابية
MR मराठी الماراثية