1. హోమ్
  2. కూర్పులు
  3. సద్గుణాలు మరియు పద్దతులు

హదీస్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరణించినప్పుడు తన తెల్లని కంచరగాడిదను, తన ఆయుధాలను మరియు దానంగా ఇచ్చిన భూమిని మాత్రమే వదలి వెళ్ళారు. ఇవి తప్ప ఆయన ఒక్క దిర్హముగాని, దీనారుగాని, బానిసగాని, బానిసరాలిని గాని, మరే వస్తువును కూడా వదలి వెళ్ళలేదు

عَنْ عَمْرِو بْنِ الحَارِثِ خَتَنِ رَسُولِ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ أَخِي أُمِّ المؤمِنين جُوَيْرِيَةَ بِنْتِ الحَارِثِ رَضِيَ اللَّهُ عَنْهُم، قَالَ:
مَا تَرَكَ رَسُولُ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ عِنْدَ مَوْتِهِ دِرْهَمًا وَلاَ دِينَارًا وَلاَ عَبْدًا وَلاَ أَمَةً وَلاَ شَيْئًا، إِلَّا بَغْلَتَهُ البَيْضَاءَ، وَسِلاَحَهُ، وَأَرْضًا جَعَلَهَا صَدَقَةً.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బావమరిది, ఉమ్ముల్ ముమినీన్ జువైరియహ్ బింతె అల్-హారిథ్ సోదరుడైన అమర్ ఇబ్నె అల్-హారిథ్ రదియల్లాహు అన్హుమ్ ఇలా పలికినారు:
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరణించినప్పుడు తన తెల్లని కంచరగాడిదను, తన ఆయుధాలను మరియు దానంగా ఇచ్చిన భూమిని మాత్రమే వదలి వెళ్ళారు. ఇవి తప్ప ఆయన ఒక్క దిర్హముగాని, దీనారుగాని, బానిసగాని, బానిసరాలిని గాని, మరే వస్తువును కూడా వదలి వెళ్ళలేదు.

ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ నమోదు చేసినారు: సహీహ్ అల్ బుఖారీ - 2739

వివరణ

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరణించినప్పుడు, తాను స్వారీ చేసే తన తెల్లని కంచరగాడిదను, తాను ధరించే తన ఆయుధాలను మరియు ఆయన ఆరోగ్యంగా ఉన్నప్పుడు బాటసారుల కోసం దానం చేసిన కొంత భూమిని మాత్రమే వదలివెళ్ళారు. ఇవి తప్ప ఆయన వెండి దిర్హముగానీ, బంగారు దీనారు గానీ, బానిస గానీ, బానిసరాలిని గానీ, మేకలను గానీ, ఒంటెలను గానీ లేదా మరే ఇతర సంపదను గానీ వదలి వెళ్ళలేదు.

من فوائد الحديث

  1. ప్రవక్తలకు వారసులుండరు.
  2. ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్ల) తన మరణం తరువాత ఏమి వదిలి వెళ్ళారో తెలుపబడుతున్నది.
  3. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం దయ, తన దానగుణం మరియు దాతృత్వం కారణంగా, ముఖ్యమైన (విలువైన) దేనినీ వదిలి పెట్టకుండా మరణించారు.
  4. కిర్మానీ ఇలా పలికినారు: (వ జఅలహా) అనే ఆయన మాటలోని సర్వనామం కేవలం భూమిని మాత్రమే కాకుండా, ఆ మూడింటిని, అనగా: కంచర గాడిద, ఆయుధం మరియు భూమిని సూచిస్తుంది.
  5. అల్ ఖతన్: భార్య సోదరుడు, మరియు అల్ అఖ్తాన్ అంటే భార్య వైపు బంధువులు.

అనువాదాలను వీక్షించండి

29 భాష
EN English ఇంగ్లీషు
UR اردو ఉర్దూ
ID Indonesia ఇండోనేషియన్
BN বাংলা బెంగాలీ
TR Türkçe టర్కిష్
RU Русский రష్యన్
BS Bosanski బోస్నియన్
SI සිංහල సింహళ
HI हिन्दी హిందీ
VI Tiếng Việt వియత్నమీస్
TL Tagalog టాగలాగ్
KU Kurdî కుర్దిష్
HA Hausa హౌసా
PT Português పోర్చుగీసు
ML മലയാളം మలయాళం
SW Kiswahili స్వాహిలీ
TH ไทย థాయ్
AS অসমীয়া అస్సామీ
NL Nederlands الهولندية
GU ગુજરાતી الغوجاراتية
PRS دری الدرية
SR Српски الصربية
HU Magyar المجرية
KN ಕನ್ನಡ Канада
KA ქართული الجورجية
MK Македонски المقدونية
KM ភាសាខ្មែរ الخميرية
PA ਪੰਜਾਬੀ البنجابية
MR मराठी الماراثية