1. హోమ్
  2. కూర్పులు
  3. ఫిఖ్ మరియు దాని నియమాలు

హదీస్ ఎవరైనా వేట కోసం లేదా పశువుల కాపలా కోసం కాకుండా కుక్కను పెంచుకుంటే, అతని సత్కార్యాలు ప్రతి రోజు రెండు ఖీరాతుల వరకు తగ్గిపోతాయి

عَنْ ابنِ عُمَرَ رَضيَ اللهُ عنهما عَنْ رَسُولِ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«مَنِ اقْتَنَى كَلْبًا إِلَّا كَلْبَ ضَارٍ أَوْ مَاشِيَةٍ نَقَصَ مِنْ عَمَلِهِ كُلَّ يَوْمٍ قِيرَاطَانِ»، قَالَ سَالِمٌ: وَكَانَ أَبُو هُرَيْرَةَ يَقُولُ: «أَوْ كَلْبَ حَرْثٍ»، وَكَانَ صَاحِبَ حَرْثٍ.

అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖన, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
"ఎవరైనా వేట కోసం లేదా పశువుల కాపలా కోసం కాకుండా కుక్కను పెంచుకుంటే, అతని సత్కార్యాలు ప్రతి రోజు రెండు ఖీరాతుల వరకు తగ్గిపోతాయి." దానికి సాలిమ్ ఇలా చెప్పినారు: అబూ హురైరా రదియల్లాహు అన్హు వద్ద ఒక పొలం ఉండేది, అతను ఇలా చెప్పేవారు: "లేదా పొలం కాపాడే కుక్క అయితే కూడా (వ్యతిరేకం లేదు)."

ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు సహీహ్ ముస్లిం - 1574

వివరణ

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా హెచ్చరించారు: "వేట కోసం, పశువులను లేదా పంటలను కాపాడే అవసరం కోసం తప్ప, ఇతర కారణాల కోసం కుక్కను పెంచడం నిషిద్ధం. ఇతర ఉద్దేశాల కోసం కుక్కను పెంచినవారి సత్కార్యాల నుంచి ప్రతిరోజూ రెండు ఖీరాతులు (దాని పరిమాణం కేవలం అల్లాహ్ కు మాత్రమే తెలుసు) తగ్గిపోతాయి.

من فوائد الحديث

  1. ముస్లిం వ్యక్తి కొరకు పైన మినహాయించబడిన కొన్ని సందర్భాలలో తప్ప, కుక్కను పెంచడం అనుమతించబడలేదు.
  2. కుక్కలను పెంచడంలో అనేక హానికరమైన మరియు చెడు పరిణామాలు ఉన్నందున అది నిషిద్ధం. "దైవదూతలు కుక్క ఉన్న ఇంట్లోకి ప్రవేశించరు" అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి విశ్వసనీయంగా నమోదు చేయబడింది. ఇంకా అదనంగా, కుక్కలు తీవ్రమైన అపవిత్రతను (నజాసత్) కలిగి ఉంటాయి; దానిని పూర్తిగా తొలగించాలంటే, నీటితో మరియు మట్టితో పలుమార్లు కడగ వలసి ఉంటుంది.

అనువాదాలను వీక్షించండి

44 భాష
EN English ఇంగ్లీషు
UR اردو ఉర్దూ
ES Español స్పానిష్
ID Indonesia ఇండోనేషియన్
UG ئۇيغۇرچە ఉయ్ఘర్
BN বাংলা బెంగాలీ
TR Türkçe టర్కిష్
RU Русский రష్యన్
BS Bosanski బోస్నియన్
SI සිංහල సింహళ
HI हिन्दी హిందీ
ZH 中文 చైనీస్
FA فارسی పర్షియన్
VI Tiếng Việt వియత్నమీస్
TL Tagalog టాగలాగ్
KU Kurdî కుర్దిష్
HA Hausa హౌసా
PT Português పోర్చుగీసు
ML മലയാളം మలయాళం
SW Kiswahili స్వాహిలీ
TA தமிழ் తమిళం
MY မြန်မာ బర్మీస్
TH ไทย థాయ్
PS پښتو పష్టో
AS অসমীয়া అస్సామీ
SQ Shqip అల్బేనియన్
SV Svenska السويدية
AM አማርኛ الأمهرية
NL Nederlands الهولندية
GU ગુજરાતી الغوجاراتية
PRS دری الدرية
SR Српски الصربية
RO Română الرومانية
HU Magyar المجرية
MOS Moore الموري
MG Malagasy Малагашӣ
KN ಕನ್ನಡ Канада
WO Wolof الولوف
UK Українська الأوكرانية
KA ქართული الجورجية
MK Македонски المقدونية
KM ភាសាខ្មែរ الخميرية
PA ਪੰਜਾਬੀ البنجابية
MR मराठी الماراثية