1. హోమ్
  2. కూర్పులు
  3. ఫిఖ్ మరియు దాని నియమాలు

హదీస్ “నాకు తరుచూ ‘స్ఖలన పూర్వ ద్రవం’ (వీర్య స్ఖలనానికి పూర్వము పురుషాంగం నుండి విదుదలయ్యే ఒక రకమైన ద్రవం) విడుదలవుతూ ఉంటుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కుమార్తె నా భార్య కావడంతో, ఈ విషయాన్ని గురించి వారిని ప్రశ్నించడానికి నాకు సిగ్గు అనిపించేది. కనుక నేను మిగ్దాం ఇబ్న్ అల్ అస్వద్’ను దానిని గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను ప్రశ్నించమని అడిగాను. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు “అతడు తన పురుషాంగాన్ని కడుక్కొని (తరువాత) వుదూ చేయాలి

عَنْ عَلِيٍّ رضي الله عنه قَالَ:
كُنْتُ رَجُلًا مَذَّاءً وَكُنْتُ أَسْتَحْيِي أَنْ أَسْأَلَ النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ لِمَكَانِ ابْنَتِهِ فَأَمَرْتُ الْمِقْدَادَ بْنَ الْأَسْوَدِ فَسَأَلَهُ فَقَالَ: «يَغْسِلُ ذَكَرَهُ وَيَتَوَضَّأُ». وَلِلبُخَاريِّ: فَقَالَ: «تَوَضَّأْ وَاغْسِلْ ذَكَرَكَ».

అలీ ఇబ్న్ అబీ తాలిబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం :
“నాకు తరుచూ ‘స్ఖలన పూర్వ ద్రవం’ (వీర్య స్ఖలనానికి పూర్వము పురుషాంగం నుండి విదుదలయ్యే ఒక రకమైన ద్రవం) విడుదలవుతూ ఉంటుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కుమార్తె నా భార్య కావడంతో, ఈ విషయాన్ని గురించి వారిని ప్రశ్నించడానికి నాకు సిగ్గు అనిపించేది. కనుక నేను మిగ్దాం ఇబ్న్ అల్ అస్వద్’ను దానిని గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను ప్రశ్నించమని అడిగాను. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు “అతడు తన పురుషాంగాన్ని కడుక్కొని (తరువాత) వుదూ చేయాలి”. సహీహ్ బుఖారీలో ఇలా ఉంది “అతడు వుదూకు ముందు తన పురుషాంగాన్ని కడుక్కుని వుదూ చేయాలి”.

ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు సహీహ్ ముస్లిం - 303

వివరణ

అలీ బిన్ అబీ తాలిబ్ రజియల్లాహు అన్హు కు తరుచూ చిక్కగా, తెల్లగా, జిగటగా ఉండే మదీ అనే ద్రవం ఆయన పురుషాంగం నుండి విడుదలవుతూ ఉండేది. ఆ ద్రవం సాధారణంగా లైంగిక పరమైన ఆలోచనల వలన గానీ లేక సంభోగానికి ముందుగానీ విడుదలవుతుంది. తరుచూ ఆ విధంగా విడుదలవుతున్న ఆ ద్రవం విషయం లో ఏమి చేయాలో ఆయనకు అర్థమయ్యేది కాదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కుమార్తె ఫాతిమా ఆయన భార్య కావడంతో, ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను దానిని గురించి ప్రశ్నించడానికి సిగ్గుగా ఉండేది. కనుక ఆయన మిఖ్దాద్ బిన్ అల్ అస్వద్ రజియల్లాహు అన్హు ను, ఆ విషయాన్ని గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను ప్రశ్నించమని కోరారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా జవాబిచ్చారు: “అతడు పురుషాంగాన్ని కడుగుకుని వుజూ చేయాలి.”

من فوائد الحديث

  1. ఈ హదీసులో అలీ బిన్ అబీ తాలిబ్ రజియల్లాహు అన్హు యొక్క ఘనత తెలుస్తున్నది – ఆ విషయం పట్ల ఆయన సిగ్గు పడటం, వేరొకరి ద్వారానైనా ప్రశ్నించడం నుండి ఆయనను దూరంగా ఉంచలేదు.
  2. ఈ హదీసు ద్వారా మన తరఫున ప్రశ్నించడానికి ఎవరినైనా మనం నియమించుకొన వచ్చును అనడానికి అనుమతి లభిస్తున్నది.
  3. తాను సిగ్గు పడుతున్న తనకు సంబంధించిన ఏదైనా విషయాన్ని గురించి, ప్రజల బహుళ ప్రయోజనం కొరకు బహిరంగపరుచుట అనుమతించబడిన విషయమే.
  4. మదీ (‘స్ఖలన పూర్వ ద్రవం’) అనేది అశుద్ధమైనదని, దానిని బట్టల నుండి మరియు శరీరానికి అంటుకుని ఉంటే శరీరం నుండి నీటితో కడిగి దూరం చేయాలి అని తెలుస్తున్నది.
  5. మదీ (‘స్ఖలన పూర్వ ద్రవం’) విడుదల కావడం అనేది వుదూను భంగ పరిచే విషయాలలో ఒకటి.
  6. మరొక హదీసులో పేర్కొనట్టు, శుభ్రపరుచునపుడు పురుషాంగాన్ని మరియు వృషణాలను కూడా కడగాలి.

అనువాదాలను వీక్షించండి

59 భాష
EN English ఇంగ్లీషు
UR اردو ఉర్దూ
ES Español స్పానిష్
ID Indonesia ఇండోనేషియన్
UG ئۇيغۇرچە ఉయ్ఘర్
BN বাংলা బెంగాలీ
FR Français ఫ్రెంచ్
TR Türkçe టర్కిష్
RU Русский రష్యన్
BS Bosanski బోస్నియన్
SI සිංහල సింహళ
HI हिन्दी హిందీ
ZH 中文 చైనీస్
FA فارسی పర్షియన్
VI Tiếng Việt వియత్నమీస్
TL Tagalog టాగలాగ్
KU Kurdî కుర్దిష్
HA Hausa హౌసా
PT Português పోర్చుగీసు
ML മലയാളം మలయాళం
SW Kiswahili స్వాహిలీ
TA தமிழ் తమిళం
MY မြန်မာ బర్మీస్
TH ไทย థాయ్
DE Deutsch జర్మన్
PS پښتو పష్టో
AS অসমীয়া అస్సామీ
SQ Shqip అల్బేనియన్
SV Svenska السويدية
AM አማርኛ الأمهرية
NL Nederlands الهولندية
GU ગુજરાતી الغوجاراتية
KY Кыргызча Қирғизӣ
NE नेपाली النيبالية
YO Yorùbá Юрба
LT Lietuvių الليتوانية
PRS دری الدرية
SR Српски الصربية
SO Soomaali الصومالية
TG тоҷикӣ الطاجيكية
RW Kinyarwanda Кинёрвондӣ
RO Română الرومانية
HU Magyar المجرية
CS Čeština التشيكية
MOS Moore الموري
MG Malagasy Малагашӣ
OM Oromoo Урумӣ
KN ಕನ್ನಡ Канада
WO Wolof الولوف
AZ Azərbaycan Озарӣ
UZ O‘zbek الأوزبكية
UK Українська الأوكرانية
KA ქართული الجورجية
MK Македонски المقدونية
KM ភាសាខ្មែរ الخميرية
BM Bambara البامبارية
PA ਪੰਜਾਬੀ البنجابية
MR मराठी الماراثية
KMR Kurmancî الكرمنجية