1. హోమ్
  2. కూర్పులు
  3. ఫిఖ్ మరియు దాని నియమాలు

హదీస్ “ఫజ్ర్ నమాజు కొరకు పలుకబడే అజాన్’లో “హయ్య అలల్ ఫలాహ్” (సాఫల్యము వైపునకు రండి) తరువాత “అస్సలాతు ఖైరుమ్మినన్’నౌమ్” (నిద్ర కంటే నమాజు ఉత్తమమైనది, శుభప్రదమైనది) అని పలుకుట సున్నత్’లో భాగము.”

عَنْ أَنَسٍ رَضيَ اللهُ عنه قَالَ:
مِنَ السُّنَّةِ إِذَا قَالَ الْمُؤَذِّنُ فِي أَذَانِ الْفَجْرِ حَيَّ عَلَى الْفَلَاحِ، قَالَ: الصَّلَاةُ خَيْرٌ مِنَ النَّوْمِ.

అనస్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన:
“ఫజ్ర్ నమాజు కొరకు పలుకబడే అజాన్’లో “హయ్య అలల్ ఫలాహ్” (సాఫల్యము వైపునకు రండి) తరువాత “అస్సలాతు ఖైరుమ్మినన్’నౌమ్” (నిద్ర కంటే నమాజు ఉత్తమమైనది, శుభప్రదమైనది) అని పలుకుట సున్నత్’లో భాగము.”

ప్రామాణికమైన హదీథు ఇబ్న్ ఖుజైమ, దారు ఖుత్నీ మరియు బైహిఖీ నమోదు చేసినారు: సహీహ్ ఇబ్నె ఖుజైమహ్ - 386

వివరణ

అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు అన్హు ఇలా తెలియజేస్తున్నారు: “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సున్నత్’లో భాగంగా ఆమోదించిన విషయాలలో ఒకటి, ముఅజ్జిన్ (నమాజు కొరకు అజాన్ పలుకు వ్యక్తి), ప్రత్యేకించి ఫజ్ర్ నమాజు కొరకు పలికే అజాన్’లో “హయ్య అలల్ ఫలాహ్” (సాఫల్యము వైపునకు రండి) అని (రెండుసార్లు) పలికిన తరువాత, అతడు “అస్సలాతు ఖైరుమ్మినన్’నౌమ్” (నమాజు నిద్ర కంటే శుభరదమైనది) అని (రెండుసార్లు) పలకాలి.”

من فوائد الحديث

  1. ఈ హదీథులో అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు అన్హు యొక్క ప్రకటన “ఇది సున్నతులో భాగము”: అంటే ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ‘సున్నత్’ (విధానము) అని అర్థము. దాని కారణంగా ఇది ‘మర్’ఫూ’ స్థాయి హదీథు నియమాన్ని కలిగి ఉంటుంది. అంటే ఉల్లేఖకుల పరంపర ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వరకు చేరి, హదీథు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు ఆపాదించబడినది అని అర్థము.
  2. ముజ్జిన్ ‘ఫజ్ర్’ నమాజు కొరకు పలికే పిలుపులో (అజాన్’లో) "హయ్యా అల్లా అల్-ఫలాహ్" తర్వాత, "అస్సలాతు ఖైరుమ్మినన్’నౌమ్” (నమాజు, నిద్ర కంటే ఉత్తమం) అని రెండుసార్లు పలుకుట సిఫార్సు చేయబడింది. ఎందుకంటే, ప్రజలు ఇంకా తమ నిద్రలో ఉన్న సమయాన ఫజ్ర్ నమాజు జరుగుతుంది, వారు తమ నిద్రలో నుంచి లేచి నమాజు కొరకు వెళ్ళడం జరుగుతుంది. అందుకే ఈ విషయములో మిగతా నమాజుల వలె కాకుండా, ‘ఫజ్ర్’ నమాజు ప్రత్యేకమైనది.

అనువాదాలను వీక్షించండి

36 భాష
EN English ఇంగ్లీషు
UR اردو ఉర్దూ
ES Español స్పానిష్
ID Indonesia ఇండోనేషియన్
BN বাংলা బెంగాలీ
TR Türkçe టర్కిష్
RU Русский రష్యన్
BS Bosanski బోస్నియన్
SI සිංහල సింహళ
HI हिन्दी హిందీ
ZH 中文 చైనీస్
FA فارسی పర్షియన్
VI Tiếng Việt వియత్నమీస్
TL Tagalog టాగలాగ్
KU Kurdî కుర్దిష్
HA Hausa హౌసా
PT Português పోర్చుగీసు
ML മലയാളം మలయాళం
SW Kiswahili స్వాహిలీ
MY မြန်မာ బర్మీస్
TH ไทย థాయ్
PS پښتو పష్టో
AS অসমীয়া అస్సామీ
AM አማርኛ الأمهرية
NL Nederlands الهولندية
GU ગુજરાતી الغوجاراتية
PRS دری الدرية
SR Српски الصربية
RO Română الرومانية
HU Magyar المجرية
KN ಕನ್ನಡ Канада
KA ქართული الجورجية
MK Македонски المقدونية
KM ភាសាខ្មែរ الخميرية
PA ਪੰਜਾਬੀ البنجابية
MR मराठी الماراثية