عَنْ عَبْدِ اللَّهِ بْنِ مَسْعُودٍ رَضيَ اللهُ عنهُ قَالَ:
قَالَ لِي النَّبِيُّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ: «اقْرَأْ عَلَيَّ»، قُلْتُ: يَا رَسُولَ اللَّهِ، أَأَقْرَأُ عَلَيْكَ، وَعَلَيْكَ أُنْزِلَ؟ قَالَ: «نَعَمْ» فَقَرَأْتُ سُورَةَ النِّسَاءِ حَتَّى أَتَيْتُ إِلَى هَذِهِ الآيَةِ: {فَكَيْفَ إِذَا جِئْنَا مِنْ كُلِّ أُمَّةٍ بِشَهِيدٍ، وَجِئْنَا بِكَ عَلَى هَؤُلاَءِ شَهِيدًا} [النساء: 41]، قَالَ: «حَسْبُكَ الآنَ» فَالْتَفَتُّ إِلَيْهِ، فَإِذَا عَيْنَاهُ تَذْرِفَانِ.

అబ్దుల్లాహ్ ఇబ్న్ మస్’ఊద్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన:
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నాతో, «నాకు చదివి వినిపించు» అన్నారు. నేను, “ఓ రసూలుల్లాహ్! నేను మీకు చదివి వినిపించాలా, ఇది మీపైనే కదా అవతరించింది?” అని అన్నాను. ఆయన, «అవును» అన్నారు. అప్పుడు నేను 'అన్నిసా' సూరహ్ పారాయణం చేస్తూ, ఈ వాక్యం దగ్గరికి చేరుకున్నాను: {మేము ప్రతి సమాజం నుండి ఒక సాక్షిని తెచ్చి, నిన్ను వారందరిపై సాక్షిగా నిలబెట్టినప్పుడు వీరి పరిస్థితి ఏమిటి?} [అన్నిసా: 41], అప్పుడు ఆయన, «ఇక చాలు» అన్నారు. నేను ఆయన వైపు తిరిగి చూస్తే, ఆయన కళ్ళ నుండి ఏకధాటిగా కన్నీళ్ళు ప్రవహిస్తున్నాయి.

ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు సహీహ్ అల్ బుఖారీ - 5050

వివరణ

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అబ్దుల్లాహ్ ఇబ్న్ మసూద్ రదియల్లాహు అన్హును ఖుర్ఆన్ నుండి కొంత భాగం చదివి వినిపించమని కోరారు. దానికి అతను, “ఓ రసూలుల్లాహ్! ఖుర్ఆన్ మీపైనే కదా అవతరించింది కదా! అలాంటప్పుడు నేను మీకు ఖుర్ఆన్ చదివి వినిపించటమేమిటి?” అన్నారు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, “నాకు ఇతరుల నుండి ఖుర్ఆన్ పారాయణం వినాలనిపిస్తోంది” అని అన్నారు. అప్పుడు అతను 'అన్నిసా' సూరహ్ లోని ఈ ఆయతు నుండి పారాయణం మొదలుపెట్టారు. అలా అతను పారాయణం చేస్తూ, సర్వోన్నతుడైన అల్లాహ్ యొక్క ఈ వాక్కుకు చేరుకున్నప్పుడు: {فَكَيْفَ إِذَا جِئْنَا مِنْ كُلِّ أُمَّةٍ بِشَهِيدٍ، وَجِئْنَا بِكَ عَلَى هَؤُلاَءِ شَهِيدًا}. అంటే, "నీవు నీ ప్రభువు సందేశాన్ని వారికి చేరవేశావని నీ సమాజంపై నిన్ను సాక్షిగా మేము నిలబెట్టినప్పుడు, నీ పరిస్థితి మరియు నీ సమాజం పరిస్థితి ఏమవుతుంది?" ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, 'ఇక పారాయణం ఆపు' అని అన్నారు. ఇబ్నె మసూద్ రదియల్లాహు అన్హు ఇలా అన్నారు: నేను ఆయన వైపు తిరిగి చూడగా, ఆ పరిస్థితి యొక్క భయంతో మరియు తన సమాజంపై గల కరుణతో ఆయన కళ్ళ నుండి కన్నీటి ధారలు ప్రవహిస్తున్నాయి.

من فوائد الحديث

  1. నవవి (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: ఖిరాతును శ్రద్ధగా వినడం, దానిని వింటూ ఏడవడం, దానిపై ధ్యానించడం వంటివి ప్రియమైన ఆచరణలు. అలాగే, ఇతరులను ఖిరాతు చేయమని కోరి, దానిని వినడం కూడా ప్రియమైన ఆచరణయే. ఎందుకంటే, స్వయంగా పఠించడం కంటే ఇలా వినడం, విషయాన్ని అర్థం చేసుకోవడానికి మరియు దానిపై ధ్యానం పెట్టడానికి మరింత ప్రభావవంతంగా ఉంటుంది.
  2. ఖుర్ఆనును పారాయణం చేయడంలో ప్రతిఫలం ఉన్నట్లే, దానిని వినడంలో కూడా ప్రతిఫలం ఉంది.
  3. ఇక్కడ అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ రదియల్లాహు అన్హు యొక్క ఘనత తెలుస్తున్నది, ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతని నోటి నుండి ఖుర్ఆను వినడానికి ఇష్టపడ్డారు. మరియు ఇది ఖుర్ఆను నేర్చుకొనుటలో, దానిని కంఠస్థం చేయుటలో మరియు దానిలో నైపుణ్యం సాధించుటలో ఇబ్న్ మస్ఊద్ రదియల్లాహు అన్హు యొక్క ఆసక్తి మరియు ఆతృతను సూచిస్తున్నది.
  4. అల్లాహ్ ఆయతులను విన్నప్పుడు, ప్రశాంతంగా, మౌనంగా ఉంటూ, కేకలు వేయకుండా, ఆయన భయభీతితో ఏడవడంలో ఔన్నత్యము (ఫదీలత్) ఉంది.

అనువాదాలను వీక్షించండి

32 భాష
EN English ఇంగ్లీషు
UR اردو ఉర్దూ
ES Español స్పానిష్
ID Indonesia ఇండోనేషియన్
BN বাংলা బెంగాలీ
TR Türkçe టర్కిష్
RU Русский రష్యన్
BS Bosanski బోస్నియన్
SI සිංහල సింహళ
HI हिन्दी హిందీ
ZH 中文 చైనీస్
FA فارسی పర్షియన్
VI Tiếng Việt వియత్నమీస్
TL Tagalog టాగలాగ్
KU Kurdî కుర్దిష్
HA Hausa హౌసా
PT Português పోర్చుగీసు
ML മലയാളം మలయాళం
SW Kiswahili స్వాహిలీ
TH ไทย థాయ్
AS অসমীয়া అస్సామీ
NL Nederlands الهولندية
GU ગુજરાતી الغوجاراتية
PRS دری الدرية
SR Српски الصربية
HU Magyar المجرية
KN ಕನ್ನಡ Канада
KA ქართული الجورجية
MK Македонски المقدونية
KM ភាសាខ្មែរ الخميرية
PA ਪੰਜਾਬੀ البنجابية
MR मराठी الماراثية