1. హోమ్
  2. కూర్పులు
  3. అల్ అఖీద

హదీస్ “అల్లాహ్ యొక్క ఒక దాసుడు, అల్లాహ్ యొక్క మరొక దాసుడుని (అతని తప్పులను) ఈ ప్రపంచములో కప్పి ఉంచితే, పునరుత్థాన దినమున అల్లాహ్ అతడిని (అతని తప్పులను) కప్పి ఉంచుతాడు.”

عَنْ أَبِي هُرَيْرَةَ رضي الله عنه عَنِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«لَا يَسْتُرُ عَبْدٌ عَبْدًا فِي الدُّنْيَا إِلَّا سَتَرَهُ اللهُ يَوْمَ الْقِيَامَةِ».

అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హు) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి ఇలా ఉల్లేఖిస్తున్నారు:
“అల్లాహ్ యొక్క ఒక దాసుడు, అల్లాహ్ యొక్క మరొక దాసుడుని (అతని తప్పులను) ఈ ప్రపంచములో కప్పి ఉంచితే, పునరుత్థాన దినమున అల్లాహ్ అతడిని (అతని తప్పులను) కప్పి ఉంచుతాడు.”

ప్రామాణికమైన హదీథు ముస్లిం నమోదు చేసినారు: సహీహ్ ముస్లిం - 2590

వివరణ

ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా దీనిని విశదీకరిస్తున్నారు. ఏ విషయంలోనైనా ఒక ముస్లిం తన తోటి ముస్లింను కప్పి ఉంచితే, తీర్పుదినమున అల్లాహ్ అతడిని కప్పి ఉంచుతాడు - ఎలాగైతే ప్రతి పనికి దానికి తగిన ప్రతిఫలం ఉంటుందో. అల్లాహ్ అతడిని కప్పి ఉంచుట అంటే అతడి తప్పులను, పాపాలను తీర్పుదినమున అక్కడ సమావేశపరచబడిన వారందరి ముందు వెల్లడించక పోవడం కావచ్చు; లేదా ఆ తప్పులకు, పాపాలకు అతడిని బాధ్యుడిని చేయకుండా, తీర్పుదినమున వాటిని అతనికి తెలియ పరచకుండా ఉండిపోవుట కావచ్చు.

من فوائد الحديث

  1. ఒకవేళ ఒక ముస్లిం ఏదైనా తప్పు చేస్తే, లేదా పాపం చేస్తే, అతని తప్పును బహిర్గతం చేయకుండా కప్పి ఉంచుట అనుమతించబడినదే; దానితోపాటు అతడు ఆ తప్పుడు పనికి పాల్బడినందుకు అతడిని నిందించాలి, మందలించాలి, మరియు అల్లాహ్ పేరుతో అతడిని భయపెట్టాలి. అయితే అతడు బహిరంగంగా, మరియు అలవాటుగా తప్పుడు పనులకు, పాపపు కార్యాలకు పాల్బడుతూ ఉండే వాడైతే, అతని తప్పును, పాపపు కార్యాన్ని దాచి ఉంచరాదు. ఎందుకంటే అలా చేయడం ఇతరులు పాపపు పనులకు పాల్బడడానికి మరింత ధైర్యాన్నిస్తుంది. అందుకని అతని వ్యవహారాన్ని అధికారులకు తెలియజేయాలి. అలా తెలియజేయుటలో అతని పేరును ప్రస్తావించవలసి వచ్చినా అది తప్పు కాదు. ఎందుకంటే అతడు బహిరంగంగా తప్పుడు పనులకు, పాపపు పనులకు పాల్బడుతూ ఉంటాడు గనుక.
  2. ఈ హదీథులో ఇతరుల తప్పులను కప్పి ఉంచుట ప్రోత్సహించబడింది.
  3. తప్పుడు పనికి, లేదా పాపపు పనికి పాల్బడిన వాని తప్పును కప్పి ఉంచుట వలన కలిగే లాభాలలో ఒకటి, అది అతడిని తాను పాల్బడిన తప్పుడు పని పట్ల, పాపపు పని పట్ల ఆలోచించుకోవడానికి, తద్వారా అల్లాహ్ ఎదుట పశ్చాత్తాప పడడానికి అవకాశాన్నిస్తుంది. ఒకరు చేసిన తప్పుడు పనిని, పాపపు పనిని బహిర్గతపరచడం అనేది అశ్లీలతను వ్యాపింపజేయ వచ్చు; తప్పుడు పనులకు, పాపపు పనులకు పాల్బడుట పట్ల జనంలో ధైర్యాన్ని పెరుగవచ్చు. సామాజిక వాతావరణాన్ని చెడిపోవచ్చు, కలుషితం చేయవచ్చు; ప్రజలను వాటి వైపునకు ఆకర్షితులను చేయవచ్చు.

అనువాదాలను వీక్షించండి

50 భాష
EN English ఇంగ్లీషు
UR اردو ఉర్దూ
ES Español స్పానిష్
ID Indonesia ఇండోనేషియన్
BN বাংলা బెంగాలీ
TR Türkçe టర్కిష్
RU Русский రష్యన్
BS Bosanski బోస్నియన్
SI සිංහල సింహళ
HI हिन्दी హిందీ
ZH 中文 చైనీస్
FA فارسی పర్షియన్
VI Tiếng Việt వియత్నమీస్
TL Tagalog టాగలాగ్
KU Kurdî కుర్దిష్
HA Hausa హౌసా
PT Português పోర్చుగీసు
ML മലയാളം మలయాళం
SW Kiswahili స్వాహిలీ
TA தமிழ் తమిళం
MY မြန်မာ బర్మీస్
TH ไทย థాయ్
DE Deutsch జర్మన్
PS پښتو పష్టో
AS অসমীয়া అస్సామీ
SQ Shqip అల్బేనియన్
SV Svenska السويدية
AM አማርኛ الأمهرية
NL Nederlands الهولندية
GU ગુજરાતી الغوجاراتية
NE नेपाली النيبالية
YO Yorùbá Юрба
LT Lietuvių الليتوانية
PRS دری الدرية
SR Српски الصربية
TG тоҷикӣ الطاجيكية
RW Kinyarwanda Кинёрвондӣ
RO Română الرومانية
HU Magyar المجرية
MOS Moore الموري
MG Malagasy Малагашӣ
OM Oromoo Урумӣ
KN ಕನ್ನಡ Канада
WO Wolof الولوف
UK Українська الأوكرانية
KA ქართული الجورجية
MK Македонски المقدونية
KM ភាសាខ្មែរ الخميرية
PA ਪੰਜਾਬੀ البنجابية
MR मराठी الماراثية