1. హోమ్
  2. కూర్పులు
  3. ఫిఖ్ మరియు దాని నియమాలు

హదీస్ “మీ సొదరుడు అణచివేతదారుడైనా, లేక అణచివేతకు గురియైన వాడైనా అతనికి మద్దతునివ్వండి”

عَنْ أَنَسِ بْنِ مَالِكٍ رَضِيَ اللَّهُ عَنْهُ قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«انْصُرْ أَخَاكَ ظَالِمًا أَوْ مَظْلُومًا». فَقَالَ رَجُلٌ: يَا رَسُولَ اللَّهِ، أَنْصُرُهُ إِذَا كَانَ مَظْلُومًا، أَفَرَأَيْتَ إِذَا كَانَ ظَالِمًا كَيْفَ أَنْصُرُهُ؟ قَالَ: « تَحْجُزُهُ -أَوْ تَمْنَعُهُ- مِنَ الظُّلْمِ؛ فَإِنَّ ذَلِكَ نَصْرُهُ».

అనస్ ఇబ్న్ మాలిక్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
“మీ సొదరుడు అణచివేతదారుడైనా, లేక అణచివేతకు గురియైన వాడైనా అతనికి మద్దతునివ్వండి”. ఒక వ్యక్తి ఇలా అన్నాడు: “ఓ రసూలుల్లాహ్! అతడు అణచివేతకు గురియైన వాడైతే మద్దతు నిస్తాను. కానీ అణచివేతదారునికి ఎలా మద్దతునివ్వాలి?” దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “అతడిని అణచివేత నుండి ఆపడం ద్వారా, లేదా అతడిని అణచివేత నుండి నిరోధించడం ద్వారా. నిశ్చయంగా ఇది అతనికి మద్దతునివ్వడం అవుతుంది.”

ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ నమోదు చేసినారు: సహీహ్ అల్ బుఖారీ - 6952

వివరణ

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముస్లిం తన తోటి ముస్లిం సోదరునికి, అతను దౌర్జన్యపరుడైనా (అణచివేతదారుడైనా), అణచివేతకు గురవుతున్నా వాడైనా, అతనికి మద్దతు ఇవ్వమని ఆదేశించారు. అప్పుడు ఒక వ్యక్తి ఇలా అడిగినాడు: “ఓ రసూలుల్లాహ్! అతను అణచివేయబడితే అతని నుండి అన్యాయాన్ని తొలగించడం ద్వారా నేను అతనికి మద్దతు ఇస్తాను, కానీ అతను అణచివేసేవాడైతే? నేను అతనికి ఎలా మద్దతు ఇవ్వగలను?” దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “మీరు అతడిని చేయి పట్టుకుని అతడు హింసకు పాల్బడుట నుండి నిషేధించాలి, అతడిని అదుపు చేయాలి, అతడిని అణచివేత చేయటం నుండి నిరోధించాలి. ఇది అతనితో పాటు ఉండే అతని షైతానుకు మరియు షైతాను యొక్క చెడు ఆఙ్ఞలకు వ్యతిరేకంగా అతనికి మద్దతు ఇచ్చే పద్ధతులలో ఒకటి.

من فوائد الحديث

  1. ఇది ధర్మములో మరియు విశ్వాసములో ఉండే సోదరభావాన్ని మరియు ఆ సోదరభావము యొక్క హక్కును ముస్లిములకు గుర్తు చేయడం.
  2. అణచివేతదారుడిని అదుపులో ఉంచాలి మరియు అన్యాయం చేయకుండా నిరోధించాలి.
  3. ఇస్లాం ధర్మం అజ్ఞానకాలపు భావనలను ఖండిస్తుంది. ఇక్కడ (ఇస్లాం లో) అతడు అణచివేతదారుడైనా, అణచివేతకు గురైన వాడైనా అతనికి మద్దతుగా నిలబడడం చూస్తాము (అణచివేతదారుడిని చేయిపట్టుకుని ఆపడం ద్వారా, అణచివేతకు గురైన వానికి సహాయంగా నిలవడం ద్వారా).

అనువాదాలను వీక్షించండి

36 భాష
EN English ఇంగ్లీషు
UR اردو ఉర్దూ
ES Español స్పానిష్
ID Indonesia ఇండోనేషియన్
BN বাংলা బెంగాలీ
TR Türkçe టర్కిష్
RU Русский రష్యన్
BS Bosanski బోస్నియన్
SI සිංහල సింహళ
HI हिन्दी హిందీ
ZH 中文 చైనీస్
FA فارسی పర్షియన్
VI Tiếng Việt వియత్నమీస్
TL Tagalog టాగలాగ్
KU Kurdî కుర్దిష్
HA Hausa హౌసా
PT Português పోర్చుగీసు
ML മലയാളം మలయాళం
SW Kiswahili స్వాహిలీ
MY မြန်မာ బర్మీస్
TH ไทย థాయ్
PS پښتو పష్టో
AS অসমীয়া అస్సామీ
AM አማርኛ الأمهرية
NL Nederlands الهولندية
GU ગુજરાતી الغوجاراتية
PRS دری الدرية
SR Српски الصربية
RO Română الرومانية
HU Magyar المجرية
KN ಕನ್ನಡ Канада
KA ქართული الجورجية
MK Македонски المقدونية
KM ភាសាខ្មែរ الخميرية
PA ਪੰਜਾਬੀ البنجابية
MR मराठी الماراثية