1. హోమ్
  2. కూర్పులు
  3. సద్గుణాలు మరియు పద్దతులు

హదీస్ నిశ్చయంగా, శాపాలు పెట్టేవారు ప్రళయదినాన సాక్షులుగా గానీ, మధ్యవర్తులుగా గానీ ఉండరు

عَنْ أَبِي الدَّرْدَاءِ رضي الله عنه: سَمِعْتُ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ يَقُولُ:
«إِنَّ اللَّعَّانِينَ لَا يَكُونُونَ شُهَدَاءَ وَلَا شُفَعَاءَ يَوْمَ الْقِيَامَةِ».

రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకుతూ ఉండగా తాను విన్నానని, అబూ దర్దాఅ రదియల్లాహు అన్హు ఉల్లేఖించినారు:
నిశ్చయంగా, శాపాలు పెట్టేవారు ప్రళయదినాన సాక్షులుగా గానీ, మధ్యవర్తులుగా గానీ ఉండరు.

ప్రామాణికమైన హదీథు ముస్లిం నమోదు చేసినారు: సహీహ్ ముస్లిం - 2598

వివరణ

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు: 'ఎవరైతే అమాయకులపై తరుచుగా శాపాలు పెడతారో, వారు రెండు శిక్షలకు పాత్రులవుతారు. మొదటి శిక్ష: ప్రళయ దినాన అతడు ప్రవక్తలు, సందేశహరులు తమ తమ జాతులకు దైవసందేశాలను అందజేసారని సాక్ష్యం ఇచ్చే అర్హత కోల్పోతాడు. అంతేగాక, అతడి దుష్టత్వం వలన ఇహలోకంలోనూ అతడి సాక్ష్యం అంగీకరించబడదు. అలాగే అతడికి 'షహాదత్' (అల్లాహ్ మార్గంలో ధర్మయుద్ధం చేస్తూ మరణించే భాగ్యం) లభించదు. రెండవ శిక్ష: ప్రళయ దినాన విశ్వాసులు (ముస్లింలు) నరకానికి అర్హులైన తమ సోదరుల కొరకు మధ్యవర్తన చేసే సమయంలో, ఈ శపించే వ్యక్తి (లాఅిన్) ఎవరికీ మధ్యవర్తన చేయడానికి అనుమతించబడడు.

من فوائد الحديث

  1. శాపాలు పెట్టడం హరామ్ (నిషేధించబడినది). తరచుగా శాపాలు పెట్టడం అనేది నిశ్చయంగా, కబీరా గునాలలో (పెద్ద పాపాలలో) ఒకటిగా పరిగణించబడుతుంది.
  2. ఈ హదీథులో తెలిపిన విషయం తరచుగా శపించేవారికే వర్తిస్తుంది, ఏదో ఒకసారి లేదా చాలా అరుదుగా శపించేవారి కొరకు కాదు. ఇంకా, ఇస్లామీయ ధర్మశాస్త్రంలో షరియతు అనుమతించిన శాపాలు దీని క్రిందకు రావు. అవి ఏమిటంటే — ప్రత్యేకంగా ఒక వ్యక్తిని శపించడం గురించి కాకుండా, కేవలం చెడు లక్షణాలు ఉన్నవారిని లేదా చెడు పనులు చేసే వారిని సాధారణంగా శపించడాన్ని షరిఅతు అనుమతిస్తుంది. ఉదాహరణకు: "అల్లాహ్ యూదులను, నసారాలను శపించును", "అల్లాహ్ దుర్మార్గులను శపించును", "అల్లాహ్ చిత్రాలు వేసే వారిని శపించును", "అల్లాహ్ లూత్ ప్రజల పని చేసే వారిని (స్వలింగ సంపర్కం చేసే వారిని) శపించును", "అల్లాహ్ కోసం కాకుండా ఇతరుల కోసం బలి ఇచ్చే వారిని అల్లాహ్ శపించును", "అల్లాహ్ పురుషులలో మహిళలలా, మహిళలలో పురుషులలా ప్రవర్తించే, వేషధారణ చేసే వారిని శపించును" మొదలైన వాటికి ఇది వర్తించదు.
  3. దీని ద్వారా ప్రళయదినం నాడు, మోమినుల (విశ్వాసుల) శిఫారసు (షఫాఅత్) ఉండటం ఇస్లామీయ విశ్వాసంలో స్పష్టంగా ధృవీకరించబడింది.

అనువాదాలను వీక్షించండి

45 భాష
EN English ఇంగ్లీషు
UR اردو ఉర్దూ
ES Español స్పానిష్
ID Indonesia ఇండోనేషియన్
BN বাংলা బెంగాలీ
TR Türkçe టర్కిష్
RU Русский రష్యన్
BS Bosanski బోస్నియన్
SI සිංහල సింహళ
HI हिन्दी హిందీ
ZH 中文 చైనీస్
FA فارسی పర్షియన్
VI Tiếng Việt వియత్నమీస్
TL Tagalog టాగలాగ్
KU Kurdî కుర్దిష్
HA Hausa హౌసా
PT Português పోర్చుగీసు
ML മലയാളം మలయాళం
SW Kiswahili స్వాహిలీ
TA தமிழ் తమిళం
MY မြန်မာ బర్మీస్
TH ไทย థాయ్
DE Deutsch జర్మన్
PS پښتو పష్టో
AS অসমীয়া అస్సామీ
SQ Shqip అల్బేనియన్
SV Svenska السويدية
AM አማርኛ الأمهرية
NL Nederlands الهولندية
GU ગુજરાતી الغوجاراتية
NE नेपाली النيبالية
PRS دری الدرية
SR Српски الصربية
RO Română الرومانية
HU Magyar المجرية
MOS Moore الموري
MG Malagasy Малагашӣ
KN ಕನ್ನಡ Канада
WO Wolof الولوف
UK Українська الأوكرانية
KA ქართული الجورجية
MK Македонски المقدونية
KM ភាសាខ្មែរ الخميرية
PA ਪੰਜਾਬੀ البنجابية
MR मराठी الماراثية