1. హోమ్
  2. కూర్పులు
  3. సద్గుణాలు మరియు పద్దతులు

హదీస్ “ఓ ఆయిషా, అల్లాహ్ సౌమ్యుడు మరియు సౌమ్యతను ఇష్టపడతాడు. మరియు ఆయన హింసకు, కఠినత్వానికి ఇవ్వని దానిని సౌమ్యతకు ప్రసాదిస్తాడు, మరింకా దేనికీ ఇవ్వని దానిని సౌమ్యతకు ప్రసాదిస్తాడు.”

عَنْ عَائِشَةَ أُمِّ المُؤْمِنين رضي الله عنها زَوْجِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«يَا عَائِشَةُ إِنَّ اللهَ رَفِيقٌ يُحِبُّ الرِّفْقَ، وَيُعْطِي عَلَى الرِّفْقِ مَا لَا يُعْطِي عَلَى الْعُنْفِ، وَمَا لَا يُعْطِي عَلَى مَا سِوَاهُ».

విశ్వాసుల మాతృమూర్తి మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం భార్య అయిన ఆయిషా రదియల్లాహు అన్హా, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారని ఉల్లేఖిస్తున్నారు:
“ఓ ఆయిషా, అల్లాహ్ సౌమ్యుడు మరియు సౌమ్యతను ఇష్టపడతాడు. మరియు ఆయన హింసకు, కఠినత్వానికి ఇవ్వని దానిని సౌమ్యతకు ప్రసాదిస్తాడు, మరింకా దేనికీ ఇవ్వని దానిని సౌమ్యతకు ప్రసాదిస్తాడు.”

ప్రామాణికమైన హదీథు ముస్లిం నమోదు చేసినారు: సహీహ్ ముస్లిం - 2593

వివరణ

ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం, విశ్వాసుల మాతృమూర్తి ఆయిషా రదియల్లాహు అన్హాను సౌమ్యంగా ఉండమని హితబోధ చేస్తున్నారు, అల్లాహ్ తన దాసుల పట్ల సౌమ్యుడు మరియు దయగలవాడు అని, ఆయన వారికి కఠినత్వాన్ని, కష్టాన్ని కాదు, వారికి సౌలభ్యాన్ని కోరు కుంటున్నాడు అని అన్నారు. ఆయన వారి సామర్ధ్యానికి మించి వారిపై భారాన్ని మోపడు. మరియు అల్లాహ్, తన దాసుడు ఇతరులతో వ్యవహరించడంలో సౌమ్యతను మరియు సౌలభ్యాన్ని అవలంబించడాన్ని, అలాగే ఇతరులతో వ్యవహరించుటలో కఠినత్వాన్ని లేదా తీవ్రతను నివారించడాన్ని ఇష్టపడతాడు. ఇంకా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు - సౌమ్యత మరియు కరుణ చూపేవారికి ఈ లోకంలో అల్లాహ్ ప్రశంసనీయమైన ఖ్యాతిని ప్రసాదిస్తాడు; మరియు వారు తమ లక్ష్యాలను సాధించడములో మరియు వారి వ్యవహారాలు కొనసాగించడంలో అల్లాహ్ సౌలభ్యాన్ని ప్రసాదిస్తాడు. మరియు హింస, కఠినత్వాలకు ఇవ్వని గొప్ప ప్రతిఫలాన్ని ఆయన ప్రసాదిస్తాడు; ఎందుకంటే సౌమ్యత మరేదీ తీసుకురాలేని ఫలితాలను తెస్తుంది.

من فوائد الحديث

  1. దయ, కరుణ మొదలైన గుణాలను ప్రోత్సహించాలి మరియు హింస, దౌర్జన్యాలను నిషేధించాలి.
  2. దయ, కరుణ అనేవి నైతిక విలువలలో ఉత్తమ విలువ కలిగిన గుణాలు.
  3. సౌమ్యుడైన వ్యక్తి సర్వశక్తిమంతుడైన అల్లాహ్ నుండి మంచి ప్రశంసలు మరియు సమృద్ధిగా ప్రతిఫలం పొందటానికి అర్హుడు.
  4. అల్ సిందీ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: “కఠినత్వం సౌమ్యతకు వ్యతిరేకం. అయితే ప్రజలు - సౌమ్యత మరియు కఠినత్వం -ఈ రెండు విధానలకు సమానంగా స్పందిస్తున్నంత వరకు - ఎవరైతే ప్రజలను సత్యమార్గం వైపునకు సౌమ్యత, దయ మరియు కరుణలతో ఆహ్వానిస్తాడో అతడు సత్యమార్గం వైపునకు కఠినత్వం మరియు తీవ్రతతో ఆహ్వానించే వాని కంటే ఉత్తమమైన వాడు. మరి పరిస్థితి రెండు విధానాలలో ఒక విధానానికే స్పందించేలాగా ఉంటే, ఆ పరిస్థితికి ఏ విధానం అనుకూలమైనదో అదే అప్పటికి అవసరమైనది అవుతుంది. అయితే ప్రతి పరిస్థితి యొక్క నిజమైన వాస్తవికత ఎరిగిన వాడు కేవలం అల్లాహ్‌ మాత్రమే.

అనువాదాలను వీక్షించండి

37 భాష
EN English ఇంగ్లీషు
UR اردو ఉర్దూ
ES Español స్పానిష్
ID Indonesia ఇండోనేషియన్
BN বাংলা బెంగాలీ
TR Türkçe టర్కిష్
RU Русский రష్యన్
BS Bosanski బోస్నియన్
SI සිංහල సింహళ
HI हिन्दी హిందీ
ZH 中文 చైనీస్
FA فارسی పర్షియన్
VI Tiếng Việt వియత్నమీస్
TL Tagalog టాగలాగ్
KU Kurdî కుర్దిష్
HA Hausa హౌసా
PT Português పోర్చుగీసు
ML മലയാളം మలయాళం
SW Kiswahili స్వాహిలీ
TA தமிழ் తమిళం
MY မြန်မာ బర్మీస్
TH ไทย థాయ్
PS پښتو పష్టో
AS অসমীয়া అస్సామీ
AM አማርኛ الأمهرية
NL Nederlands الهولندية
GU ગુજરાતી الغوجاراتية
PRS دری الدرية
SR Српски الصربية
RO Română الرومانية
HU Magyar المجرية
KN ಕನ್ನಡ Канада
KA ქართული الجورجية
MK Македонски المقدونية
KM ភាសាខ្មែរ الخميرية
PA ਪੰਜਾਬੀ البنجابية
MR मराठी الماراثية