1. హోమ్
  2. కూర్పులు
  3. జీవితచరిత్ర మరియు చరిత్ర

హదీస్ “ఇంటిలో ఆయన తన కుటుంబానికి సేవ చేసేవారు అంటే తన ఇంటి పనులలో సహాయం చేసేవారు, మరియు నమాజు సమయం వచ్చినప్పుడు నమాజు కోసం బయటకు వెళ్లేవారు.”

عَنِ الأَسْوَدِ بنِ يَزِيدَ قَالَ:
سَأَلْتُ عَائِشَةَ مَا كَانَ النَّبِيُّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ يَصْنَعُ فِي بَيْتِهِ؟ قَالَتْ: كَانَ يَكُونُ فِي مِهْنَةِ أَهْلِهِ -تَعْنِي خِدْمَةَ أَهْلِهِ-، فَإِذَا حَضَرَتِ الصَّلاَةُ خَرَجَ إِلَى الصَّلاَةِ.

కుడి వైపున నిద్రపోవడం వల్ల త్వరగా మేల్కొనవచ్చు, ఎందుకంటే గుండె కుడి వైపు నిద్రపోయిన స్థితిలో గుండే తక్కువగా స్థిరంగ ఉంటుంది మరియు గుండె ఎడమ వైపున ఉన్నందు వలన కుడి వైపునకు తిరిగి పడుకోవడం అనేది గుండెకు మరింత విశ్రాంతినిస్తుంది. ఒక వ్యక్తి ఎడమ వైపునకు తిరిగి నిద్రపోతే, శరీరపు బరువు దానిపై పడి ఒత్తిడి కలుగజేస్తుంది, అది హృదయానికి హాని కలిగిస్తుంది.
“నేను ఆయిషా రదియల్లాహు అన్హాను అడిగాను, “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంట్లో ఏమి చేసేవారు?” అని. ఆమె ఇలా అన్నారు, “ఇంటిలో ఆయన తన కుటుంబానికి సేవ చేసేవారు అంటే తన ఇంటి పనులలో సహాయం చేసేవారు, మరియు నమాజు సమయం వచ్చినప్పుడు నమాజు కోసం బయటకు వెళ్లేవారు.”

ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ నమోదు చేసినారు: సహీహ్ అల్ బుఖారీ - 676

వివరణ

విశ్వాసుల మాతృమూర్తి అయిన ఆయషా రదియల్లాహు అన్హాను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన ఇంటిలో ఎలా ఉండేవారు అని, తన ప్రవర్తన గురించి, తాను చేసే పనుల గురించి అడిగారు. ఆమె ఇలా జవాబిచ్చినారు: "ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇతరుల వలే ఒక మానవమాత్రుడు మాత్రమే. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం పురుషులు తమ ఇళ్లలో చేసే విధంగానే పని చేసేవారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తన పనులను తానే చేసుకునేవారు మరియు తన కుటుంబానికి కూడా సేవ చేసేవారు (అంటే ఇంటి పనులలో సహాయం చేసేవారు); ఆయన తమ గొర్రెలకు పాలు పితుకుతారు, తన బట్టలు చిరిగిపోతే కుట్టుకుంటారు, తన చెప్పులు తెగిపోతే వాటిని కుట్టి సరిచేసుకుంటారు మరియు ఇంటిలో లోహపు బాల్చీ (బక్కెట్టు) పాడైపోతే దానికి అతుకులు వేసి బాగుచేస్తారు. అయితే నమాజు సమయం ఆసన్నమైనపుడు, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఆలస్యం చేయకుండా నమాజు కొరకు బయటకు వెళ్ళేవారు.

من فوائد الحديث

  1. ఇందులో ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం అణకువ, వినయవిధేయతల యొక్క పరిపూర్ణత మరియు ఆయన కుటుంబం పట్ల ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రీతి, వాత్సల్యము గమనించవచ్చు.
  2. ప్రాపంచిక లక్ష్యాలు, పనులు అల్లాహ్ యొక్క దాసుడిని నమాజు నుండి దూరం చేయకూడదు.
  3. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విధిగా ఆచరించవలసిన ఐదు నమాజులను వాటి ప్రారంభ సమయాలలో ఆచరించేవారు.
  4. ఇమాం ఇబ్న్ హజర్ అల్ అస్ఖలానీ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: “ఈ హదీథు వినయాన్ని, అహంకారాన్ని విడిచిపెట్టి, తన కుటుంబానికి సేవ చేయడాన్ని ప్రోత్సహిస్తుంది”.

అనువాదాలను వీక్షించండి

37 భాష
EN English ఇంగ్లీషు
UR اردو ఉర్దూ
ES Español స్పానిష్
ID Indonesia ఇండోనేషియన్
UG ئۇيغۇرچە ఉయ్ఘర్
BN বাংলা బెంగాలీ
TR Türkçe టర్కిష్
RU Русский రష్యన్
BS Bosanski బోస్నియన్
SI සිංහල సింహళ
HI हिन्दी హిందీ
ZH 中文 చైనీస్
FA فارسی పర్షియన్
VI Tiếng Việt వియత్నమీస్
TL Tagalog టాగలాగ్
KU Kurdî కుర్దిష్
HA Hausa హౌసా
PT Português పోర్చుగీసు
ML മലയാളം మలయాళం
SW Kiswahili స్వాహిలీ
MY မြန်မာ బర్మీస్
TH ไทย థాయ్
PS پښتو పష్టో
AS অসমীয়া అస్సామీ
AM አማርኛ الأمهرية
NL Nederlands الهولندية
GU ગુજરાતી الغوجاراتية
PRS دری الدرية
SR Српски الصربية
RO Română الرومانية
HU Magyar المجرية
KN ಕನ್ನಡ Канада
KA ქართული الجورجية
MK Македонски المقدونية
KM ភាសាខ្មែរ الخميرية
PA ਪੰਜਾਬੀ البنجابية
MR मराठी الماراثية