1. హోమ్
  2. కూర్పులు
  3. ఫిఖ్ మరియు దాని నియమాలు

హదీస్ “ఆ నీరు ఒకవేళ “ఖుల్లతైన్”లకు (రెండు పెద్ద కుండల నిండుగా ఉన్న నీటికి) సమానంగా ఉంటే అది మాలిన్యాన్ని గ్రహించదు.”

عَن عَبْدِ اللَّهِ بْنِ عُمَرَ رضي الله عنهما قَالَ: سُئِلَ رَسُولُ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ عَنِ الْمَاءِ وَمَا يَنُوبُهُ مِنَ الدَّوَابِّ وَالسِّبَاعِ، فَقَالَ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«إِذَا كَانَ الْمَاءُ قُلَّتَيْنِ لَمْ يَحْمِلِ الْخَبَثَ».

అబ్దుల్లాహ్ ఇబ్న్ ఉమర్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖన: రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లంను పశువులు మరియు వేటాడే జంతువులు తరుచూ త్రాగుతూ ఉండే నీటిని గురించి (వాటిని ఉపయోగించ వచ్చునా) అని ప్రశ్నించడం జరిగింది. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
“ఆ నీరు ఒకవేళ “ఖుల్లతైన్”లకు (రెండు పెద్ద కుండల నిండుగా ఉన్న నీటికి) సమానంగా ఉంటే అది మాలిన్యాన్ని గ్రహించదు.”

ప్రామాణికమైన హదీథు అబూదావూద్, అత్తిర్మిదీ, అన్నసాయీ, ఇబ్న్ మాజహ్ మరియు అహ్మద్ నమోదు చేసినారు: సునన్ అబీదావూద్ - 63

వివరణ

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను జంతువులు మరియు క్రూర జంతువులు తరుచూ త్రాగుతూ ఉండే నీటి వనరులలోని నీటి పరిశుద్ధత గురించి ప్రశ్నించడం జరిగింది. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: ఒకవేళ ఆ నీరు “ఖుల్లతైన్”లకు (రెండు పెద్ద కుండల నిండుగా ఉన్న నీటికి), అంటే దాదాపు 210 లీటర్లకు సమానంగా ఉంటే అది పెద్ద మొత్తంలో ఉన్న నీరుగా భావించబడుతుంది; అది మాలిన్యాన్ని గ్రహించదు, అశుద్ధత కారణంగా ఆ నీటి మూడు లక్షణాలైన రంగు, రుచి, వాసనలలో ఏ ఒక్క లక్షణమైనా మారనంత వరకు.

من فوائد الحديث

  1. నీరు దాని రంగు, రుచి మరియు వాసన అనే మూడు లక్షణాలలో, అపరిశుద్ధత కారణంగా ఏదైనా ఒక లక్షణంలో మార్పు వచ్చినట్లయితే ఆ నీరు అపరిశుద్ధమైనదిగా భావించ బడుతుంది. ఈ హదీథు సాధారణంగా చాలా సందర్భాలకు వర్తిస్తుంది, ఏదో ఒక నిర్దుష్ఠమైన సందర్భానికి కాదు.
  2. ఒకవేళ పరిశుద్ధ వస్తువులు, అపరిశుద్ద పదార్థాల కారణంగా నీరు మార్పునకు లోనైనట్లయితె, అది పూర్తిగానే అపరిశుద్ధమై పోతుంది; ఆ అపరిశుద్ద పదార్థము, లేక ఆ అపరిశుద్ధ వస్తువు కొద్ది మొత్తములో ఉన్నా లేక ఎక్కువ మొత్తములో ఉన్నా సరే. ఈ విషయంపై ఉలమాలందరి ఏకాభిప్రాయం ఉన్నది.

అనువాదాలను వీక్షించండి

50 భాష
EN English ఇంగ్లీషు
UR اردو ఉర్దూ
ES Español స్పానిష్
ID Indonesia ఇండోనేషియన్
BN বাংলা బెంగాలీ
TR Türkçe టర్కిష్
RU Русский రష్యన్
BS Bosanski బోస్నియన్
SI සිංහල సింహళ
HI हिन्दी హిందీ
ZH 中文 చైనీస్
FA فارسی పర్షియన్
VI Tiếng Việt వియత్నమీస్
TL Tagalog టాగలాగ్
KU Kurdî కుర్దిష్
HA Hausa హౌసా
PT Português పోర్చుగీసు
ML മലയാളം మలయాళం
SW Kiswahili స్వాహిలీ
TA தமிழ் తమిళం
MY မြန်မာ బర్మీస్
TH ไทย థాయ్
DE Deutsch జర్మన్
PS پښتو పష్టో
AS অসমীয়া అస్సామీ
SQ Shqip అల్బేనియన్
SV Svenska السويدية
AM አማርኛ الأمهرية
NL Nederlands الهولندية
GU ગુજરાતી الغوجاراتية
KY Кыргызча Қирғизӣ
NE नेपाली النيبالية
LT Lietuvių الليتوانية
PRS دری الدرية
SR Српски الصربية
TG тоҷикӣ الطاجيكية
RW Kinyarwanda Кинёрвондӣ
RO Română الرومانية
HU Magyar المجرية
MOS Moore الموري
MG Malagasy Малагашӣ
OM Oromoo Урумӣ
KN ಕನ್ನಡ Канада
WO Wolof الولوف
UK Українська الأوكرانية
KA ქართული الجورجية
MK Македонски المقدونية
KM ភាសាខ្មែរ الخميرية
PA ਪੰਜਾਬੀ البنجابية
MR मराठी الماراثية